Jump to content

ltt 4 langas


beerbob

Recommended Posts

దినమొక గండం

 

 హామీలు అటకెక్కాయి. అతివలపై ఆగడాలు ఆగలేదు. తెలంగాణ వినీలాకాశంలో 'సగభాగం' ఎప్పటిలాగే నిరాదరణ పాలవుతోంది. అంతులేని బాధలగాథలతో కునారిల్లుతోంది. సర్వవిధ ఆధిపత్యాలు.. అత్యాచారాలు.. అపహరణలు.. 
భర్తలు, అత్తింటి ఆరళ్లతో అల్లాడుతోంది. తెలంగాణ తల్లికి దినమొక గండంగా గడుస్తోంది. అరోపణలు కాదు; సాక్షాత్తూ కేంద్ర హోం శాఖ నిగ్గుతేల్చిన నిజాలు! దాని నేతృత్వంలో పని చేసే నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన 2015 గణాంకాలు వెల్లడించిన తాజా వివరాలివి!!
- శంభాజీ. ఎల్‌
గడచిన 2015లో తెలంగాణ గడ్డ మీద మహిళలపై జరిగిన ఆగడాలపై అక్షరాల పదిహేను వేలా నూటముప్ఫయి అయిదు కేసులు నమోదయ్యాయి. వాటిలో శిక్షార్హనేరాలు 83.1 శాతం. అంతకు ముందు సంవత్సరం (2014)లో అది 78.3 శాతం వద్ద ఆగింది. అంటే ఒక్క సంవత్సరంలోనే అతివలపై జరిగిన ఆగడాలు 4.8శాతం ఎగబాకాయి. ఇది ఆందోళనకర పరిణామం. దేశవ్యాప్తంగా మహిళలపై జరిగిన ఆగడాల్లో శిక్షార్హమైన జాతీయ సగటు 53.9 కావడం గమనార్హం! జాతీయ సగటుకన్నా ఏకంగా 29.2 శాతం అధిక ఘోరాలు తెలంగాణలో మహిళలపై జరిగాయి. ఆ విషయంలో అంతకు ముందు సంవత్సర జాతీయ సగటు 56.3 శాతంగా ఉండి.. ప్రస్తుత సంవత్సరానికి అది 2.4 శాతం తగ్గింది. కానీ..రాష్ట్రంలో మాత్రం పెరగడం గమనార్హం! రాష్ట్రంలో సర్వ రంగాల్లో అభివృద్ధి క్షీణత చోటు చేసుకున్న పరిణామం ఒకవైపునుంటే.. మరోవైపు దౌర్భాగ్యకర రీతిలో మహిళలపై ఆగడాలు పెరిగాయి. 
లైంగిక దాడులు.. అపహరణలు
మహిళల ఆత్మగౌరవంపై దెబ్బతీసే లైంగికదాడులు ప్రస్తుత 2015 గణాంకాల ప్రకారం 1,105 జరిగాయి. మొత్తం నేరాల్లో దాని వాటా 6.1శాతంగా నిలిచింది. అది కూడా జాతీయ సగటు 5.7 కన్నా 0.4శాతం అధికమే! వాటిలో సామూహిక నడిబొడ్డున 'తల్లి'కి లైంగికదాడులు 26 అని తేలితే సిగ్గుపడక తప్పదు. ఆ విషయంలో జాతీయ సగటు 5.7గా నమోదైంది. అవి కాక మరో 43 లైంగికదాడి యత్నాలు సైతం రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. ఇక భారత నేరస్మృతిలోని సెక్షన్‌లు 363, 364, 364ఏ, 366 ప్రకారం శిక్షార్హమైన అపహరణ కేసులు 648 నమోదు కాగా 676 మంది బాధితులుగా తేలారు. 
'కట్న' మృత్యు ఘంటికలు
ఇక వరకట్న చావులు ప్రస్తుత సంవత్సరంలో 263కి చేరాయి. మహిళల గౌరవానికి భంగం కలిగించే ఘటనలు 3,608 చోటు చేసుకున్నాయి. వాటిలో 3,622 మంది బాధితులుగా తేలారు. లైంగిక వేధింపుల్లో 623 మంది మహిళలు ఇబ్బంది పడ్డారు. మహిళలు పని చేసే కార్యాలయాల్లో..ఇతర పని ప్రాంతాల్లో.. ప్రయాణాల్లో.. ఇలా ఎక్కడపడితే అక్కడ తెలంగాణ మహిళల పట్ల మృగాళ్ల అనుచిత ప్రవర్తనల ఘటనలు కొల్లలుగానే నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,288 ఘటనల్లో 1,291 మంది మహిళలు ఇక్కట్లు అనుభవించారు. వాటిలో పని చేసే కార్యాలయాల్లోనే 32 ఘటనలు జరిగాయి. ఇతర పని ప్రాంతాల్లో 169 ఘటనల్లో 170 మంది ఇబ్బంది పడ్డారు. ఇక వివిధ ప్రయాణ సాధనాల్లో ఈ యేడు 179 ఘటనల్లో 180 మంది బాధితులయ్యారు. 
భర్తలా.. కాలయములా?
కట్టుకున్న భర్తలు, వారి తరుపు బంధువుల క్రూర చేష్టలకు ఏకంగా 7,329 మంది నానా అగచాట్లు పడ్డారు. వారిలో 592 మంది క్రూరత్వం తట్టుకోలేక ఆత్మహత్యా యత్నాలు చేశారు. 
మేనిఫెస్టో ఏం చెబుతోంది?
గడచిన సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) తన 2014 ఎన్నికల ప్రణాళికలో మహిళాలోకానికి భారీ హామీలే గుప్పించింది. ''జాతి నిర్మాణంలో అన్ని రంగాల్లో మహిళా శక్తిని ఉపయోగించుకోకుండా ఏ దేశం బాగుపడదు. తెలంగాణలో మహిళల వికాసం కోసం, వారికి అన్ని రకాల అవకాశాలు కల్పించి ప్రగతి బాటలో నడిపించడం కోసం టీఆర్‌ఎస్‌ చిత్తశుద్ధితో పని చేస్తుంది'' (పేజీ. 18) అన్న భారీ మాటలను ఉటంకించింది. ఇంకా చట్ట సభల్లో 33.3 రిజర్వేషన్లను కల్పిస్తామంది. కానీ.. ఒక్క మహిళకూ మంత్రివర్గంలో ఈనాటికీ చోటు కల్పించకపోవడం గమనార్హం! జిల్లా కేంద్రాల్లో మహిళా పారిశ్రామిక వాడల ఏర్పాటు ఏమైందో ఏలినవారే సెలవియ్యాలి. తెలంగాణలో మహిళా విశ్వ విద్యాలయం ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రణాళికలో విస్పష్టంగా ప్రకటించారు. ఆ మాట పక్కనబెడితే నడుస్తోన్న యూనివర్సిటీలనే నీరుగార్చుతోందన్న అపప్రధ ప్రభుత్వ వశమైంది. మొత్తంగా మహిళాలోకానికి 17 హామీలను టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ఇచ్చింది. వాటిలో కనీసం ఒక్కటైనా అమలవుతోన్న దాఖలా లేదు. సగం హామీలను నెరవేర్చినా తెలంగాణ మహిళ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచే అవకాశాలు లేకపోలేదు. ఎంతైనా పాలకులు! బహుపరాక్‌!!

Link to comment
Share on other sites

16 minutes ago, sri_india said:

KCR adikaram loki vochakaa telangana palana purthigaa debbathindi bro ..... prajalu nirashalooo unnaru .... 2019 lo debba thappadu 

Ltt 4 langas

Link to comment
Share on other sites

5 minutes ago, sri_india said:

KCR adikaram loki vochakaa telangana palana purthigaa debbathindi bro ..... prajalu nirashalooo unnaru .... 2019 lo debba thappadu 

 

7 minutes ago, beerbob said:

Ltt 4 langas

 

Link to comment
Share on other sites

26 minutes ago, sri_india said:

KCR adikaram loki vochakaa telangana palana purthigaa debbathindi bro ..... prajalu nirashalooo unnaru .... 2019 lo debba thappadu 

 

8 minutes ago, beerbob said:

Ltt 4 langas

 

7 minutes ago, sri_india said:

KCR adikaram loki vochakaa telangana palana purthigaa debbathindi bro ..... prajalu nirashalooo unnaru .... 2019 lo debba thappadu 

 

Just now, beerbob said:

 

 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...