Jump to content

telangana drohulu- నర్సమ్మ,సక్కమ్మ,బచ్చిగళ్ల జంగయ్య etc


beerbob

Recommended Posts

3 ఎకరాలేమోగానీ... 3 గజాలు ఇచ్చెటోడులేడు

 

- మహాజన పాదయాత్ర నుంచి బొల్లె జగదీశ్వర్‌
-ఆటో ఉన్నా రేషన్‌ కార్డు కట్‌
- 65 ఏండ్ల వయసున్నా పింఛన్‌ ఇస్తలేరు

- రోజూ నాలుగుసార్లు మిషిన్ల ఒత్తాలే
-ఒక్కసారి ఒత్తకపోయినా ఆరోజు జీతం కట్‌

- తక్కువ జీతాలతో బతికేదెట్లా...
- పాదయాత్ర బృందానికి జనం వినతులు 

రాష్ట్రంలో కేసీఆర్‌ ఎన్నికల ముందల ఎన్నో చెప్పిండు. 3 ఎకరాల భూమన్నడు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లన్నడు. ఇంటికో ఉద్యోగమన్నడు. అధికారంలోకి వచ్చినాక అన్నీ మరిచిండు. 3 ఎకరాల భూమి ఏమోగానీ... 3 గజాల భూమి ఇచ్చెటోడు లేడు. ఇక డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల ఊసే ఎత్తడం లేదు. రేషన్‌ కార్డులు తొలగిస్తుండు. కార్లుంటే కార్డులు తొలగిస్తుంటే ఏమో అనుకున్నం. తీరా ఆటో ఉన్నా రేషన్‌ కార్డు తొలగిస్తున్నరు. ఇదేం పాలన అర్థమైతలేదు. వాళ్లింట్ల నలుగురికి పదవులొచ్చినయి. మా పిల్లలకు ఉద్యోగాలెయ్యి. కేసీఆర్‌ సారు మా బాధలు తెల్సుకోవాలే. వాటిని పరిష్కరించాలే. ఇలా పలువురు ప్రజలు, మున్సిపల్‌ కార్మికులు, వివిధ రకాల వృత్తిదారులు తమ గోడును పాదయాత్ర బృందం ముందు వెళ్లబోసుకున్నారు. పాదయాత్ర బృందానికి నేతృత్వం వహిస్తున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి పలు వినతిపత్రాలు సమర్పించారు. సమస్యలు పరిష్కారమయ్యేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సామాజిక న్యాయం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఈనెల 17న చేపట్టిన మహాజన పాదయాత్ర ఆదివారానికి ఏడు రోజులు పూర్తి చేసుకుంది. ఆదివారం అబ్దుల్లాపూర్‌ మెట్‌ నుంచి ప్రారంభమైన పాదయాత్ర పెద్దఅంబర్‌పేట, కోహెడ, ఉప్పరిగూడ, తొర్రూర్‌, కమ్మగూడ, తుర్కయంజాల్‌, రాగన్నగూడ, బొంగ్లూర్‌ వరకు సాగింది. ఆదివారం పాదయాత్ర బృందం 26.5 కిలోమీటర్లు తిరిగింది. పాదయాత్ర బృందం ఆదివారం రాత్రి బొంగ్లూర్‌ వద్దే బస చేయనుంది. సోమ వారం బొంగ్లూరు నుంచి ఆదిబట్ల మీదుగా కొంగరకలాన్‌ చేరుకుంటుంది.
3 ఎకరాలేమో గానీ... 3 గజాలు ఇచ్చెటోడు లేడు : 
మాచర్ల గోపాల్‌, కోహెడ
3 ఎకరాల భూమి ఏమోగానీ... 3 గజాల భూమి ఇచ్చెటోడు లేడు. 3 గజాలకే గతిలేకపోతే 3 ఎకరాలు ఎవరిస్తరు. భూమి లేదు ఏం లేదు. వైఎస్‌ సర్కారుల పింఛన్‌ వచ్చేది. కేసీఆర్‌ వచ్చినంక వయసు తక్కువుందని పింఛన్‌ తీసేసిండ్రు. నాకు 65 ఏండ్లున్నయి. ఏం పని జెయ్యాలే, ఎట్లా బతకాలే. సార్లకు దరఖాస్తులు పెట్టినా వస్తలేదు. ఇంకెఎవరికి చెప్పాలే.
90 ఎకరాలు గుంజుకున్నరు : గుండె బాబయ్య, అబ్దుల్లాపూర్‌మెట్‌
మాకున్న 90 ఎకరాల భూమి గుంజుకున్నరు. జేఎన్‌ ఎన్‌యూఆర్‌ఎం కాలనీ కట్టిండ్రు. అక్కడ అన్నీ కష్టాలే ఉన్నయి. బొందలగడ్డ లేదు. మంచినీళ్లు వస్తలేవు. కరెంటు సక్కగా ఉంటలేదు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి చెప్పినం. అయినా ఏం కాలే. మాకు న్యాయం జెయ్యాలే.
రూ.10 నుంచి పనిచేస్తున్నా పర్మినెంట్‌ కాలే : పోచమ్మ, కుంట్లూరు
నేను రూ.10 నుంచి సపాయి పనిచేస్తున్న. 20 ఏండ్ల సంది ఇదే పనిల ఉన్న. ఇప్పుడు రూ.6 వేలు ఇస్తుండ్రు. ఇంకా పర్మినెంట్‌ జెయ్యలే. మస్తు బాధ అయితంది. మాకు చట్టం చెప్పినట్టు జీతం ఇయ్యాలే. రూ.18 వేలు వస్తయంట. మా పిల్లలు పెద్దగయ్యిండ్రు. ఇండ్లు లేవు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ఇస్తమని కేసీఆర్‌ సారు చెప్పిండు. గా ఇండ్లివ్వాలే.
నెలల ఒక్క సెలవు లేదు : యాదమ్మ, పిగిలిపూర్‌
రోజుకు 24 గంటలల్ల ఎప్పుడు అవసరమైతే అప్పుడు పనిచేస్తం. సెలవుల్లేవు. నెలల ఒక్కరోజూ సెలవు లేదు. సెలవుల్లేకుండా ఎట్ల పనిజెయ్యాలే.
కొబ్బరికాయ కొట్టాలన్నా అనుమతి కావాలంట : చెంగయ్య, జేఎన్‌ఎన్‌యుఆర్‌ఎం కాలనీ
శ్రీరామనవమి చేసుకుంటుంటే ఎవరిని అడిగి గుడిలోకి వచ్చిండ్రు అని సర్పంచి భర్త ధనుంజయగౌడ్‌ నిలదీసిండు. ఆ గుల్లో కొబ్బరికాయలు కొట్టాలన్నా అనుమతి కావాలంట. మంచినీళ్ల ట్యాంకి కట్టడానికి ఇంజినీర్‌ వస్తే, నేను ఊర్లో లేనపుడు ఎందుకొచ్చినవు, నేను వచ్చాక ట్యాంకి గురించి మాట్లాడుకుందామని ఆయన అన్నడు. మేం గుల్లోకి పోవద్దా? మంచినీల్లు తాగొద్దా?. మా గురించి పట్టించుకోండి.
మా హాస్టల్‌ల ఇంకా బట్టలివ్వలే : ఎస్సీ సంక్షేమ వసతిగృహం విద్యార్థులు, ఉప్పరిగూడ
పోయినసారి బట్టలే ఉన్నయి. ఈసారి ఇంకా బట్టలివ్వలే. అన్నం బాగానే పెడుతున్నరు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాదయాత్ర బృందం సభ్యుడు శోభన్‌నాయక్‌ మాట్లాడుతూ ఖైదీలకు రూ.32 ఇస్తున్నరు. భావితరాలకు చెందిన విద్యార్థులకు రోజుకు రూ.24 ఇవ్వడం సమంజసం కాదన్నారు. మెస్‌చార్జీలు పెంచాలని డిమాండ్‌ చేశారు.
ఒక్కసారి ఒత్తకపోయినా ఆరోజు జీతం కట్‌ : 
వసంత, కుంట్లూరు
నేను పెద్ద అంబర్‌పేట నగర పంచాయితీలో పనిచేస్తున్న. ఉదయం 5, మళ్లీ 10 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 5 గంటలకు మిషన్ల ఒత్తాలే. రోజుకు ఒక్కసారి ఒత్తకపోయినా ఆరోజు జీతం కట్‌ చేస్తున్నరు. మమ్మల్ని కాల్చుకు తింటున్నరు.
గ్లౌజుల్లేవు, సబ్బుల్లేవు : నర్సమ్మ, పెద్ద అంబర్‌పేట
ఏండ్ల సంది పనిచేస్తున్నా పర్మినెంట్‌ కావడం లేదు. గ్లౌజుల్లేవు. సబ్బుల్లేవు. మురికిపని ఎట్లా జెయ్యాలే. మావి చేతులు కావా?. రోజుకు ఒకేసారి 8 గంటల పని జేపియ్యా లే. రోజుల్లో ఎప్పుడంటే అప్పుడు ఉదయం, సాయంత్రం 8 గంటలు చేపియొద్దు.
సమ్మె చేసినా జీతం పెరగలే : సక్కమ్మ, కోహెడ
మేము 400 మంది కార్మికులం. 44 రోజులు సమ్మె చేసినం. అయినా జీతం పెరగలేదు. గదే రూ.4,200 ఇస్తు న్నరు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ వర్తించడం లేదు. కనీస వేతనాలు ఇయ్యాలే. మాకు నెలకు రూ.18 వేలు జీతం పెంచాలే.
దావఖానకే రూ.2 వేలు అయినయి : యాదమ్మ, కోహెడ
నేను సపాయి కార్మికురాలిని. నాకు రూ.1,250 జీతం ఇస్తున్నరు. దావఖానకు పోతే రూ.2 వేలు అయినయి. జీతం తక్కువ ఇస్తే ఏం జెయ్యాలే. ఎక్కడి నుంచి తేవాలే. తక్కువ జీతంతో అప్పులు చేస్తు మేం ఎట్లా బతకాలే.
ఆ 100 ఎకరాలు మాకు పట్టాలివ్వాలి : బచ్చిగళ్ల జంగయ్య, తొర్రూరు
2006లో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజీవ్‌ స్వగృహ కోసం 
మా భూములు తీసుకున్నది. ఇండ్లు నిర్మించలేదు. 80 ఏండ్ల సంది దళితులే సాగు చేసుకుంటున్నరు. ఆ 100 ఎకరాల భూమిని దళితులకు మూడు ఎకరాల చొప్పు న మా గ్రామంలో పట్టాలివ్వాలి. మా కుటుంబాలను ప్రభు త్వం ఆదుకోవాలి. ఇలా అనేక మంది మున్సిపల్‌ కార్మికులు తక్కువ జీతం వస్తున్నదని, నెలనెలా జీతం ఇవ్వడం లేదని, ఇచ్చిన జీతం సరిపోతలేదని, జీతాలు పెంచాలని, మూడెకరాల భూమి ఇప్పించాలని, పింఛన్‌ వస్తలేదని, రేషన్‌ కార్డు ఇప్పించాలని పాదయాత్ర బృందానికి వినతిపత్రాలు అందజేశారు.

Link to comment
Share on other sites

1 minute ago, beerbob said:

%$#$

 

Just now, sri_india said:

neeku cinema chudadam raadhu bro ... america lo untee urgent gaa New York film academy lo cheri  cinema lu ela chudaloo nerchukooo bro 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...