Jump to content

She is great


kakatiya

Recommended Posts


30viralaa167.jpg

పుణె : ప్రజా జీవనంలోకి సామాజిక మాధ్యమాలు వచ్చిన తరువాత ప్రతి ఒక్కరూ తమ అనుభవంలోని సంఘటనల తాలూకూ ఫోటోలు, వీడియోలు పంచుకుంటూ లైక్‌లు, కామెంట్‌లు, షేర్‌లు చేయడం పరిపాటిగా మారింది. అలా ప్రతిసారి కొన్ని విభిన్నమైన వీడియోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసే వ్యక్తి ఓ బ్యాంకు ఉద్యోగినిని నెమ్మదిగా పనిచేసే తీరును చిత్రించి వ్యంగ్యంగా ‘ప్రపంచంలోనే వేగవంతమైన క్యాషియర్‌’ అనే టైటిల్‌తో ఈ నెల 24న అప్‌లోడ్‌ చేసిన వీడియోను 4.9మిలియన్ల మంది వీక్షించారు. లక్షల్లో షేర్‌ చేశారు. వేలల్లో లైక్‌లు కొట్టారు. కొంత మంది ఆమె పనితీరును విమర్శిస్తే మరికొందరు అలా చిత్రించడం తప్పంటూ కెమెరామెన్‌కు చీవాట్లు పెట్టారు. ఆ వీడియో వెనుక ఉన్న అసలు ఉదంతమిది

పుణెలోని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో ప్రేమలతా షిండే క్యాషియర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆమెకు పక్షవాతం సోకింది. రెండుసార్లు గుండెపోటు వచ్చింది. చికిత్స అనంతరం కోలుకుని వృత్తి పట్ల గౌరవంతో ఆమె మళ్లీ విధుల్లో చేరారు. శరీరం సహకరించపోయినా పదవీ విరమణ వరకూ తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలనే ఆకాంక్ష ఆమెలో బలంగా నాటుకుపోయింది. ఇందు కోసం బ్యాంకు సిబ్బంది సైతం సహకరించి ఆమెకు తోడ్పాటునందించారు. భర్త లేకున్నా వైద్యం చేయించుకుంటోంది. ఒక్కగానొక్క కొడుకు భార్యా పిల్లలతో కలిసి విదేశాల్లో ఉంటున్నాడు. చివరి వరకూ సేవలందించి గౌరవ ప్రదంగా పదవీ విరమణ చేయాలనేది ఆమె కోరిక. ‘ఇలాంటి మహిళ మన దేశంలో ఉన్నందుకు మనమెంతో గర్వపడాలి.. అందుకోసం మాత్రమే మనం దీపావళి చేసుకోవాలం’టూ కుందన్‌ శ్రీవాస్తవ అనే వ్యక్తి ఆ మహిళ జీవితంలోని ఒడిదుడుకులను గురించి తెలియజేస్తూ తన ఫేస్‌బుక్‌ పేజీలో వివరణ ఇచ్చారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...