Jump to content

'చంద్రన్న లవర్స్ డే'


spider_reddy

Recommended Posts

'చంద్రన్న @kodi' aipoindi ippudu   'చంద్రన్న లవర్స్ డే' anta vidu marada???

 

కుటిల రాజకీయం - అవినీతి వంటి విషయాల్లో విమర్శలు - ఆరోపణలు ఉన్నా కూడా ఏపీ సీఎం చంద్రబాబుకు కొన్ని విషయాల్లో మాత్రం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రజలు హుందాగా ఉండాలని కోరుకునే నేతల్లో ఆయన ఒకరని చెబుతుంటారు. విశృంఖలత్వం - చెడు వ్యసనాలు - క్రమశిక్షణ రాహిత్యం వంటివాటికి ఆయన స్వయంగా దూరంగా ఉండడమే కాకుండా ప్రజలంతా అలాగే ఉండాలని కోరుకుంటారని చెబుతారు. అయితే... తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం చంద్రబాబు వైఖరి మారుతోందా అన్న అనుమానాలు కలిగిస్తున్నాయి. ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ప్రతి సందర్భాన్నీ ఏదో ఒక కార్యక్రమానికి వినియోగించుకుని ప్రచారం పొందాలని తాపత్రయ పడుతున్న ఆయన ఆ దారిలో కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు బలపడుతున్నాయి. ముఖ్యంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుంచి మూడు రోజుల పాటు అంటే ప్రేమికుల దినోత్సవమైన ఫిబ్రవరి 14 వరకు విశాఖలో ప్రేమోత్సవం పేరిట భారీ ఈవెంట్ నిర్వహించాలని నిర్ణయించడం వివాదాస్పదమవుతోంది. దీనిపై విపక్ష వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
    
వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఈ విషయంలో చంద్రబాబును ఏకిపడేశారు. చంద్రబాబుకు విదేశీ సంస్కృతిపై మోజు ఎక్కువైందని ఆయన ఆరోపించారు. ప్రేమికుల దినోత్సవం రోజు విశాఖ సముద్రతీరంలో డిస్కో డ్యాన్సులు నిర్వహించాలని యోచిస్తున్నారని ఆరోపించారు. తెలుగువారి మనసంతా ప్రేమతోనే నిండి ఉంటుందని... ప్రత్యేకంగా ప్రేమికుల దినోత్సవం పేరుతో కార్యక్రమాలు అవసరం లేదని మండిపడ్డారు. ప్రచారం కోసమే చంద్రబాబు ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నరని మండిపడ్డారు. ఇలాంటి కార్యక్రమాలను చేపడితే ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
    
విశాఖలో నిర్వహించే ప్రేమోత్సవానికి ప్రపంచవ్యాప్తంగా 9వేల ప్రేమ జంటలను ఆహ్వానించనున్నారు. ఈవెంట్ ను పదివేల ఎకరాల్లో నిర్వహిస్తారట. ర్యాంప్ వాక్ లు బికినీ షో వంటివి ఉంటాయని వినిపిస్తోంది. ఆ సమయంలోనే ఇన్వెస్టర్స్ మీట్ కూడా ఏర్పాటు చేయనుండడంతో ఆడవారి అందాలను ఎరవేసి పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు చంద్రబాబు నీచ ఆలోచన చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమ రాష్ట్రంలో విచ్చలవిడితనానికి ఎలాంటి హద్దులు లేవని ఇన్వెస్టర్లకు వివరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఇలా దిగజారిందని ఆరోపిస్తున్నారు. ప్రేమోత్సవం లాంటి కార్యక్రమాలతో విశాఖ సంస్కృతిని నాశనం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
    
మరోవైపు టీడీపీ మిత్రపక్షం బీజేపీ ఏటా ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకిస్తుంది. అలాంటిది చంద్రబాబు మాత్రం ఆ సందర్భంగా భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. కాగా ఈ కార్యక్రమానికి ప్రముఖ పాప్ గాయని షకీరాను ఇన్వైట్ చేస్తున్నట్లు టాక్. మరి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని పిలుస్తారో లేదో..? సంక్రాంతికి రంజాన్ కు సంబరాలు జరుపుతున్నట్లే ప్రేమికుల రోజునూ చంద్రబాబు ఘనంగా జరపబోతున్నారన్నమాట. 

Link to comment
Share on other sites

Part of promoting tourism in vizag... use every oppurtunity... big and small...

Cable connection lu bigisthoo chillar aunty la ni gokey loafer karunakar reddy ki ivanni teliyakapovadam not a surprise... vaadi range adhey...  _-_

Link to comment
Share on other sites

lovers day lantivi jarupukovali ante.. family motham london povali maa jagan anna la.. ante kani.. vijayama odipoina chota ilantivi enti... eppudu anna vinama petama...mana papalanu intlo peti talam veyandi..  brahmilaugh.gif

Link to comment
Share on other sites

వాలెంటైన్స్ డే సందర్భంగా విశాఖలో బీచ్ లవ్ వేడుకలు నిర్వహించడంపై ప్రతిపక్షాలు విమర్శలు తారాస్థాయికి చేరాయి. స్వర్గీయ ఎన్ టీ రామారావు తెలుగువారి ఆత్మగౌరవం కోసం నాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారని అలాంటి పార్టీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు మన సంస్కృతి - సాంప్రదాయాలను భ్రష్టు పట్టిస్తున్నారని వైఎస్ ఆర్ సీపీ మహిళా  విభాగం అధ్యక్షురాలు - ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. నిత్యం విదేశీ జపం చేసే చంద్రబాబు..ఇప్పుడు ఆ దేశాల సంస్కృతిని విశాఖపట్నం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ నగరంలో ఉత్తరాంధ్ర జిల్లాల మహిళా ప్రతినిథుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ఎన్ టీఆర్ కూతురుగా పుట్టిన భువనేశ్వరి - మనవరాళు బ్రహ్మీణి చంద్రబాబు నిర్ణయాన్ని ఖండిస్తారో? సమర్థిస్తారో తెల్చుకోవాలని సూచించారు. వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీగా బీచ్ వేడుకలను అడ్డుకుంటామని ఆర్కే రోజా హెచ్చరించారు. 

టీడీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులో విద్యార్థి రిషితేశ్వరి ఆత్మహత్య - విజయవాడలో కాల్ మనీ–సెక్స్ రాకెట్ - తహశీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి - తనను అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేసిన విధానం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయంటే ఏపీలో అరాచకాలు ఏమాత్రం ఉన్నాయో అర్థమవుతుందన్నారు. ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని మహిళలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక దగా చేశారని రోజా ధ్వజమెత్తారు. రూ.14600 కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేసేందుకు చంద్రబాబుకు మనసు రావడం లేదని ఆయన మాత్రం ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొడుతూ వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. నాడు బాబు వస్తే జాబు వస్తుందని నమ్మించారని ఇంటికి రూ.2 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని వాగ్దానం చేసి తీరా సీఎం అయ్యాక చిల్లీ గవ్వ కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మీ పథకం కింద రూ.30 వేలు చెల్లిస్తామన్నారని ఏ ఒక్కరికి ఈ పథకం వర్తించలేదని రోజా విమర్శించారు. గర్భిణులకు పండంటి బిడ్డ పుడితే వారి పౌష్టికాహారం కోసం రూ.10 చెల్లిస్తామన్నారని మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తామని చంద్రబాబు స్మార్ట్గా మోసం చేశారన్నారు. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో నారావారి నరకాసురుడి పాలనను అంతం చేద్దామని రోజా పిలుపునిచ్చారు. చంద్రబాబు పాలన మూడు ముక్కల్లో చెప్పాలంటే అరిష్టం - అవినీతి - అరాచకాలని ఎమ్మెల్యే రోజా అభివర్ణించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వేళా విషయమే ఏమో తెలియదు కానీ..ఈ రెండుళ్లుగా సకాలంలో వర్షాలు కురవక తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కరువుకు పాయింట్ - షర్ట్ వేస్తే అది చంద్రబాబే అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక దోచుకోవడం - దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారని అవినీతిలో ఏపీని నంబర్ వన్ చేసిన ఘనత బాబుదేనని రోజా ఎద్దేవా చేశారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...