Jump to content

గవర్నర్ తరువాత అది బాలయ్యకే సాధ్యం -Jai Balayya


kiladi bullodu

Recommended Posts

హెడ్డింగ్ చూసి ఆశ్చర్యపోతున్నారా?అసలు గవర్నర్ కి బాలయ్య కి ఏంటి సంభంధం అనుకుంటున్నారా?అసలు ఏ విషయం లో గవర్నర్ బాట లో బాలయ్య నడుస్తున్నారు అనుకుంటున్నారా ?అయితే ఈ స్టోరీ చదవాల్సిందే…ఆంధ్రప్రదేశ్,తెలంగాణ గా విడిపోయిన తరువాత చంద్రబాబునాయుడు,కేసిఆర్ ల మధ్య దూరం చాలానే పెరిగింది.ఒకరి పై ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు.వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి గవర్నర్ నరసింహన్ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే వున్నాడు.ఇప్పుడు వాళ్ళిద్దరిని కలపటానికి బాలయ్య కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాడు.చంద్రబాబునాయుడు కి స్వయానా బామ్మర్ది,వియ్యకుండు కావడం తో పాటు ఇటు కేసిఆర్ ఫ్యామిలీ తో కూడా బాలయ్య కి మంచి సంబంధాలు కలిగి వుండటం తో తెలుగు ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఇద్దరూ చంద్రులను కలపాలని బాలయ్య నిశ్చయించుకున్నాడు.తాను నటిస్తున్న గౌతమి పుత్ర శాతకర్ణి పూజా కార్యక్రమాలకి ఇద్దరూ ముఖ్యమంత్రులను ఆహ్వానించినప్పటికీ అప్పుడు కేసిఆర్ మాత్రమే ఆ కార్యక్రమం లో పాల్గొన్నారు.దీంతో మళ్ళీ మరోసారి వాళ్ళను కలపాలి అని నిర్ణయించుకున్నారు బాలయ్య

 

నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్‌లోనే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి. సంక్రాంతి బ‌రిలో నిలిచిన ఈ చిత్రం ప్ర‌స్తుతం తుది మెరుగులు దిద్దుకొంటోంది. హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఈ చిత్ర ప్రారంభోత్స‌వానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ హాజ‌రైన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. ఆడియో ఫంక్ష‌న్ ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు చేతుల మీదుగా జ‌ర‌గ‌నుంది. ఈ సినిమా స్పెష‌ల్ షో మాత్రం ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులకూ ఒకేసారి ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. అందుకు ముహూర్తం కూడా ఖ‌రారైపోయిన‌ట్టు స‌మాచారం. 2017 జ‌న‌వ‌రి 3వ తేదీన కేసీఆర్‌, చంద్ర‌బాబుల‌కు గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణిని ప్ర‌ద‌ర్శించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ముఖ్య‌మంత్రులతో వ్య‌వ‌హారం కాబ‌ట్టి.. వాళ్ల అపాయింట్ మెంట్లు ముందే ఫిక్స‌యిపోతాయి.

కాబట్టి… వాళ్ల డేట్ లాక్ చేసుకోవ‌డానికి ముందుగానే ఈ డేట్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. బాల‌క‌ష్ణ స్వ‌యంగా ముహూర్తం చూసి.. జ‌న‌వ‌రి 3వ తేదీన స్పెష‌ల్ షో ఏర్పాటు చేయాల‌ని ఫిక్స‌య్యాడ‌ని టాక్‌. వీలుంటే ఇద్ద‌రు సీఎంల‌కు ఒకేసారి, లేదంటే వేర్వేరుగా షోలు వేస్తార‌ట‌. వీలైనంత వ‌ర‌కూ ఇద్ద‌రికీ ఒకేసారి సినిమా చూపించాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. బెనిఫిట్ షో ఎప్పుడు ప‌డాలి,ఆడియో ఏ స‌మ‌యానికి రిలీజ్ చేయాలి అనేది కూడా బాల‌య్య ముందే ముహూర్తం ఫిక్స్ చేసి పెట్టుకొన్న‌ట్టు,అవ‌న్నీ ఆయ‌న అనుకొన్న ప్ర‌కార‌మే జ‌రిపించాల‌ని నిర్ణ‌యించుకొన్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆడియో ఎక్క‌డ నిర్వ‌హించాల‌న్న విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నారు. ఆడియో ఫంక్ష‌న్ విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌, తిరుప‌తిల్లో ఓ చోట నిర్వ‌హించి, ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ మాత్రం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్నారట.ఆయన అనుకున్నట్టు ఇద్దరినీ కలపగలిగితే గవర్నర్ తరువాత ఆ పని బాలయ్యే చేసినట్టు అవుతుంది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...