Jump to content

ఆరడుగుల అందగాడు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. లక్షల్లో జీతం


sri_india

Recommended Posts

ఆరడుగుల అందగాడు. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. లక్షల్లో జీతం. ఇంతకంటే అర్హతలేం కావాలి? వెంటనే సంబంధానికి ఒకే చెప్పి మూడు ముళ్లు వేయించేసుకుని అమెరికా వెళ్లిపోయిందా కొత్త పెళ్లి కూతురు. ఇండియాలో ఉన్నంతకాలం నలత చేసిందని భర్త దూరంగా ఉంటే నిజమేననుకుంది. తీరా అమెరికా వెళ్లాక అతని అసలు రూపం బయటపడి నివ్వెరపోయింది. అతనో చిత్రమైన లైంగిక ఉన్మాది. ఆమెను తాకడు. కానీ అతనికి లైంగిక కోరికలున్నాయి. ఆమె సున్నితమైన ప్రదేశాల్లో సిగరెట్లతో కాల్చుతూ అందుకామె విలవిల్లాడుతుంటే చూసి లైంగికోద్రేకం పొందుతాడతను. అలా అతను పెట్టే లైంగిక హింసకు ఆమె ఒళ్లు పచ్చి పుండైంది. ఇంటికి ఫోన్‌ చేద్దామంటే ఇంట్లో ఫోన్‌ లేకుండా చేశాడు. పాస్‌పోర్ట్‌ చింపేశాడు. బయటికి వెళ్లకుండా ఇంటికి తాళం వేశాడు. అలా నరకం అనుభవించిన ఆ అమ్మాయి చివరికి పక్కింటివాళ్ల సాయంతో ఆ నరకం నుంచి బయట పడింది. సెక్సువల్‌ పర్‌వర్షన్‌కు ఇది ఒక పార్శ్వం మాత్రమే! ఇలాంటి వికృత లైంగిక వ్యసనపరులు ఎంతోమంది. ఒక్కొకరిది ఒక్కో తరహా! పైకి హుందాగా, నార్మల్‌గా కనిపించే వీళ్లలో విపరీతమైన మనస్తత్వం దాక్కుని ఉంటుంది. సమయం అనుకూలించినప్పుడు, లైంగికోద్రేకాన్ని ప్రేరేపించే అంశాలు ఎదురుపడ్డప్పుడు మాత్రమే బయల్పడే వీళ్ల కోరికలకు ఎంతోమంది బలైపోతూ ఉంటారు. అయితే ఇలాంటి సెక్సువల్‌ పర్వర్షన్‌కు కారణాలేమిటి? వీళ్లు తిరిగి మామూలుగా మారే అవకాశమే లేదా? ఇలాంటి వాళ్లను సరిచేసే చికిత్సలే లేవా?
 
 

సెక్సువల్‌ పర్‌వర్షన్‌ అంటే? 
దీన్ని వైద్య పరిభాషలో ‘పారాఫీలియా’ అంటారు. ఈ వ్యక్తుల లైంగికోద్రేకం, లైంగిక తృప్తి అసహజమైన పనులు, ఊహలతో కూడుకుని ఉంటాయి. పారాఫీలియా వ్యక్తులు వాళ్లకు లైంగికోద్రేకం కలిగించే వస్తువులు, పనుల మీద ఆసక్తి కలిగి ఉంటారు. ఈ డిజార్డర్‌ ఉన్న వ్యక్తుల ప్రవర్తన సమాజానికి, సాధారణ జీవితానికి, వృత్తికి, ఇబ్బందికరంగా ఉంటుంది. వీళ్లు లైంగిక కోరికలు తీవ్రంగా కలిగి ఉండటంతోపాటు వాటిని తీర్చుకోవటం కోసం పర్యవసానాలు లెక్క చేయకుండా, ఎంతటికైనా తెగించే ధోరణి కలిగి ఉంటారు. ఇలాంటి వ్యక్తులు స్త్రీలలోకంటే పురుషుల్లోనే ఎక్కువ. వీళ్ల ప్రవర్తన, ఆలోచనలు, ఊహలు, అవసరాలు అసహజంగా ఉంటాయి. వీరిలో ఒకే రకమైన పర్వర్షన్‌ ఉండొచ్చు లేదా రెండు మూడు రకాల పర్వర్షన్స్‌ కలిసి ఉండొచ్చు. వీళ్లల్లో వ్యక్తిత్వ సమస్యలు కూడా ఉంటాయి. అవమానాలకు గురవటం, ఆత్మన్యూనత, ఒంటరితనం, ప్రేమ దక్కకపోవటం, రిలేషన్‌షిప్‌ ప్రాబ్లమ్స్‌...పారాఫీలియాలుగా మారటానికి కారణాలు. అదిమిపెట్టి ఉంచిన ఈ భావోద్వేగాలే పెరిగి పెద్దయ్యాక వికృతమైన లైంగిక కోరికల రూపంలో విజృంభిస్తాయి. తాము ఎంచుకున్న అసహజ పద్ధతిలో లైంగిక కోరిక తీర్చుకోవటం ద్వారా పర్వర్ట్‌గా మారటానికి దారితీసిన కారణాల మీద విజయం సాధించినట్టుగా పారాఫీలియాలు ఫీలవుతూ ఉంటారు. 
కారణాలు అనేకం 
సెక్సువల్‌ పర్వర్షన్‌ అనే ప్రవృత్తి హఠాత్తుగా వచ్చేది కాదు. వాటి బీజాలు చిన్నతనంలోనే నాటుకుని ఉంటాయి. పారాఫీలియాగా మారిన ప్రతి వ్యక్తీ ఆ తాలూకు లక్షణాలను 13 ఏళ్ల ప్రాయం నుంచే అలవరుచుకుంటాడు. పెరిగిన వాతావరణం, పెంపకం, పరిసరాలు, ఇంటర్నెట్‌, మత్తుమందుల ప్రభావం...ఇలా పర్వర్షన్‌కు కారణాలు ఎన్నో ఉంటాయి. 
పెంపకం: పదకొండేళ్ల పిల్లాడు తల్లి నిద్రపోతున్న సమయంలో ఆమె దుస్తులు తొలగించి చేత్తో తాకే ప్రయత్నం చేస్తుంటే అదిరిపడి లేచిందో తల్లి. అలాంటి చేదు అనుభవంతో కుంగిపోయిన ఆమె ‘లోపం...తన పెంపకానిదా? లేక పిల్లాడిదా?’ అని తనను తాను ప్రశ్నించుకుంది. నిజానికి తప్పు పిల్లాడిది కాదు తల్లిదే! మోడల్‌ అయిన ఆ తల్లి పిల్లాడి ముందే దుస్తులు మార్చుకోవటం, చిన్నప్పటి నుంచి పక్కనే పడుకోబెట్టుకోవటం చేసేది. కానీ తల్లైనా, తండ్రైనా...ఈ పనులన్నీ పిల్లలు మూడేళ్ల వయసుకు చేరుకునేసరికి మానుకోవాలి. పిల్లలు మూడేళ్ల వయసుకే లైంగిక స్పృహ, లైంగికాసక్తి కలిగి ఉంటారు. కాబట్టి పిల్లల మూడేళ్ల వయసు నుంచి పెద్దలు ఈ నియమాలు పాటించాలి. 

  • చిన్న పిల్లల ముందు పెద్దలు దుస్తులు మార్చుకోకూడదు, వాళ్లని మార్చుకోనివ్వకూడదు. నగ్నంగా ఇతరులకు కనిపించటం తప్పు అని నేర్పాలి.
  • పిల్లలే కదా! అని వాళ్లతో కలిసి స్నానం చేయటం, వాళ్లకి స్నానం చేయించటం మానుకోవాలి.
  • పిల్లల మర్మాంగాలను చూసి నవ్వుకోవటం, ఏడిపించటం చేయకూడదు.
  • స్వయంతృప్తి పొందే పిల్లలను అవమానించకూడదు. ఎగతాళి చేయకూడదు.
  • విపరీతమైన కట్టడి, ఒత్తిడి వల్ల పిల్లలు ఆత్మ న్యూనతకు లోనై ఇంట్రావర్ట్‌లుగా తయారవుతారు. ఈ నైజమే పెద్దయ్యాక పర్వర్షన్‌గా మారుతుంది.
  • అతి పిన్న వయసు నుంచే సెక్స్‌ ఎడ్యుకేషన్‌ దశలవారీగా పిల్లలకు నేర్పాలి.
  • గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ తేడాలను అర్థమయ్యేలా చెప్పాలి.
  • శరీరంలో తాకకూడని, తాకనివ్వకూడని అవయవాల మీద అవగాహన ఏర్పరచాలి.
  • లైంగికోద్రేకాన్ని పెంచే అంశాలకు పిల్లల్ని దూరంగా ఉంచాలి.
  • పిల్లల ముందు పెద్దలు దూరం పాటించాలి.
బాల్యంలో లైంగిక హింస: ఎక్కువశాతం సెక్సువల్‌ పర్వర్ట్స్‌ బాల్యంలో ఇతర సెక్సువల్‌ పర్వర్ట్స్‌ చేతుల్లో లైంగిక హింసకు గురయినవారే! ఇలాంటి దారుణానికి బలయిన చిన్నారులు పెరిగి పెద్దయ్యాక ఆ ఆక్రోశాన్ని, ప్రస్టేషన్‌‌ను తిరిగి పిల్లల మీదే చూపించి సంతృప్తి పడుతూ ఉంటారు. కాబట్టి పిల్లలు అలాంటి దారుణానికి బలికాకుండా చూసుకోవాలి. పిల్లల మీద దారుణాలకు ఒడిగట్టే సెక్సువల్‌ పర్వర్ట్స్‌లో యువకుల కంటే మధ్య వయస్కులు, వృద్ధులే ఎక్కువ! పైగా వీళ్లు బాధితులకు బాగా తెలిసినవాళ్లే అయి ఉంటారు.
 

టీనేజ్‌: చెడు స్నేహాల ప్రభావం వల్ల కూడా సెక్సువల్‌ పర్వర్ట్స్‌గా మారే ప్రమాదం ఉంది. అప్పటిదాకా నార్మల్‌గా చక్కని కుటుంబ వాతావరణంలో ఆరోగ్యంగా పెరిగిన పిల్లలు స్నేహితుల ప్రభావానికి లోనై విపరీతమైన మాబ్‌ హిస్టీరియాకు లోనయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటప్పుడు స్నేహితుల గుంపుతో కలిసి వాళ్లు చేసే లైంగిక నేరాల్లో పాలుపంచకుంటారు కూడా! ఎదిగేకొద్దీ అదే అలవాటుగా మారి సెక్సువల్‌ పర్వర్షన్‌కు దారితీయొచ్చు. 
పోర్న్‌: అశ్లీల వీడియోలు చూడాలనే ఆసక్తి లైంగిక కోరికలున్న ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ఎక్కువశాతం మందిలో పోర్న్‌ వాచింగ్‌ ఓ పరిధికే పరిమితమై ఉంటే...సెక్సువల్‌ పర్వర్ట్స్‌లో ఇది విపరీతంగా, అసహజంగా ఉంటుంది. వాటిలో రకాలు, ప్రయోగాలు, విపరీత పోకడలకు వ్యసనపరులుగా తయారవుతారు. ఇలాంటి అలవాటు మరింత ముదిరితే ప్రమాదమే! 

పెరిగిన వాతావరణం: హింసతో కూడిన పెంపకం, వాతావరణంలో పెరిగిన పిల్లలు సెక్సువల్‌ పర్వర్ట్స్‌గా మారే అవకాశాలు ఎక్కువ. సీ్త్రని విపరీతంగా కొడుతూ, లైంగికంగా హింసించే కుటుంబంలో పెరిగే పిల్లల్లో అదే ప్రవృత్తి ఏర్పడుతుంది. ఇరుకు ఇంట్లో పిల్లలకు తెలిసేలా తల్లిదండ్రులు సెక్స్‌లో పాల్గొనటం, వివాహేతర సంబంధాలు ఏర్పరుచుకోవటం, సెక్స్‌ సంబంధించిన విషయాలు పిల్లల ముందు చర్చించుకోవటం... ఇలాంటివన్నీ పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి.
 

మత్తు మందులు: మద్యం, డ్రగ్స్‌.. సెక్సువల్‌ పర్వర్షన్‌కు తోడ్పడతాయి. వీటి వల్ల ఇన్‌హిబిషన్స్‌ వదిలి ధైర్యం వస్తుంది. దాంతో ఎలాంటి అసహజ లైంగిక దాడులకైనా తెగబడటం అలవరుచుకుంటారు. 
పారాఫీలియాను నియంత్రించొచ్చు : పారాఫీలియా లక్షణాలను గుర్తించటం కష్టం. ఈ కోవకు చెందిన వ్యక్తులు మిగతా సమయాల్లో మామూలుగా ఉండి లైంగికోద్రేకం కలిగించే అంశాలు అనుభవంలోకొచ్చినప్పుడే ఆ రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే పారాఫీలియాగా మారిన తర్వాత లక్షణాలనుబట్టి గుర్తించి చికిత్స అందించేకంటే అలా మారకుండా నియంత్రించటమే ఉత్తమమైన మార్గం. బాల్యంలోనే పారాఫీలియా బీజాలు నాటుకుంటాయి కాబట్టి అందుకు కారణమయ్యే అంశాలకు పిల్లలను దూరంగా ఉంచటంతోపాటు పిల్లల్లో ఈ లక్షణాలను గమనించాలి. 

  • ఇన్‌ట్రావర్ట్‌లుగా మారి ఎక్కువ సమయం ఒంటరిగా గడపటానికి ఇష్టపడటం.
  • ఒకే వస్తువును అసహజమైన తీరులో ఇష్టపడుతూ ఉండటం.
  • విపరీతమైన బిడియం, మొహమాటంతో నలుగురిలో కలవటానికి ఇష్టపడకపోవటం.
  • సఖ్యంగా మెలిగే పెద్దల్ని చాటుగా గమనిస్తూ ఉండటం.
  • అక్క, తల్లి, చెల్లి స్నానం చేస్తున్నప్పుడు, దుస్తులు మార్చుకుంటున్నప్పుడు చాటుగా చూడటం.

చికిత్సలున్నాయి 

పారాఫీలియా కలిగి ఉండి దాన్నుంచి ఆనందం పొందే వ్యక్తులు వాళ్ల కార్యాకలాపాలను రహస్యంగా సాగిస్తూ ఉంటారు. అలాంటి ప్రవర్తనను ఆ వ్యక్తులు తప్పుగా, రుగ్మతగా భావించరు. దాంతో పొరపాటున ఇతరుల కంటపడేవరకూ వీళ్ల పారాఫీలియా బహిర్గతమవదు. అలా తీవ్ర నేరాలకు పాల్పడి పట్టుబడి పారాఫీలియాలుగా డయాగ్నైజ్‌ అయిన వ్యక్తులూ ఉంటారు. ఇది ఒక రకం. రెండో రకం వ్యక్తులకు వాళ్ల అసహజ ప్రవర్తన గురించి తెలుసు. దాన్నుంచి బయటపడాలని ప్రయత్నిస్తూ విఫలమవుతూ ఉంటారు. ఈ కోవకు చెందినవాళ్లు తమ మీద తాము నియంత్రణ కోల్పోతున్న విషయాన్ని గ్రహించి చికిత్స కోసం వైద్యుల్ని కలుస్తూ ఉంటారు. అయితే ఈ రెండు రకాల పారాఫీలియాలకు కౌన్సిలింగ్‌, బిహేవియరల్‌ థెరపీ, శరీరంలోని హార్మోన్లను, మెదడులోని న్యూరో ట్రాన్స్‌మీటర్ల పనితీరును మందగించేలా చేసే మందులతో చికిత్స చేసి మామూలు వ్యక్తుల్లా మార్చవచ్చు.
 

లైంగికోన్మాదం - రకాలు 

  • ఎగ్జిబిషనిజం: గుప్త అవయవాలను బహిరంగంగా ప్రదర్శించటం...ఎగ్జిబిషనిజం. ఈ రకం పర్వర్ట్స్‌ పబ్లిక్‌గా అందరి ముందు లైంగికావయవాలను ప్రదర్శిస్తూ లైంగిక తృప్తి పొందుతూ ఉంటారు. దీన్లో మరో రకం... ‘ట్రయోలిజం’. ఈ రకం వ్యక్తులు మూడో వ్యక్తిగా ఇద్దరి లైంగిక క్రీడను చూస్తూ లైంగికోద్రేకం పొందుతారు.
  • ఫెటిషిజం: ఈ కోవకు చెందిన వాళ్లు సహజంగా లైంగికోద్రేకాన్ని కలిగించని అవయవాలు చూసి లైంగికోద్రేకం పొందుతారు లేదా లోదుస్తులు చూసి లైంగికంగా ప్రేరేపితులవుతారు. లేదా కొన్ని వస్తువుల మీద లైంగికాసక్తి ఏర్పరుచుకుంటారు. పాదాలు, శిరోజాలు, సిల్క్‌, లెదర్‌ వస్తువులు, చెప్పులు, పర్సులు, హ్యాండ్‌ కర్చీఫ్స్‌, లోదుస్తులు...వాటిలో కొన్ని.
  • ఫ్రొట్యూరిజం: లైంగికావయవాలను ఇతరులకు రుద్దుతూ లైంగికోద్రేకం పొందుతూ ఉంటారు. ఈ కోవకు చెందిన వ్యక్తులు బస్సులో నిలబడి ప్రయాణం చేసే తోటి ప్రయాణికులను ఇబ్బంది పెడుతూ పట్టుబడుతూ ఉంటారు.
  • పీడోఫిలియా: పిల్లల మీద లైంగిక నేరాలకు పాల్పడే వాళ్లు ఈ కోవకు చెందినవాళ్లే! ఆడపిల్లల మీదే కాకుండా మగపిల్లల మీద లైంగిక దాడికి పాల్పడేవాళ్లు కూడా ఈ కోవ కిందకే వస్తారు.
  • శాడిజం: ఎదుటి వ్యక్తిని శారీరకంగా హింసిస్తూ లైంగికోద్రేకం పొందుతారు. ఎదుటి వ్యక్తి ఎంతలా బాధతో అరుస్తూ ఉంటే శాడి్‌స్టకు అంత ఎక్కువ లైంగిక సంతృప్తి కలుగుతూ ఉంటుంది. ఈ ధోరణి మితిమీరి అత్యాచారాలు, హత్యలకు కూడా దారితీయొచ్చు.
  • మాసోచిజం: ఈ కోవకు చెందిన వ్యక్తులు...హింస పెట్టటం కాకుండా హింస పడుతూ లైంగికోద్రేకం పొందుతారు. ఇలాంటి పురుషులు స్త్రీలకు శారీరకంగా దగ్గరవకుండా వాళ్లతో కొట్టించుకుని, హింసించేలా ప్రోత్సహించి ఆనందపడతారు. బాల్యమంతా స్త్రీల మధ్య అంటే...తల్లి వితంతువు అయి ఉండి, పిన్ని, పెద్దమ్మ, అత్త, అక్కాచెల్లెళ్లు...ఇలా చుట్టూరా సీ్త్రలుండే వాతావరణంలో పెరిగే మగపిల్లలు ఇలాంటి పర్వర్ట్‌లుగా మారే అవకాశం ఎక్కువ.
  • వొయూరిజం: నగ్నంగా ఉన్న లేదా సెక్స్‌లో పాల్గొంటున్న వ్యక్తులను చూసి లైంగికోద్రేకానికి లోనయ్యేవాళ్లు ఈ కోవలోకొస్తారు. దుస్తులు మార్చుకుంటున్న లేదా స్నానం చేస్తున్న వ్యక్తుల్ని చాటుమాటుగా చూసి ఆనందపడే ‘పీపింగ్‌ టామ్స్‌’ ఈ కోవకి చెందినవాళ్లే!
  • ట్రాన్స్‌వెస్టిజం: పురుషులు సీ్త్రలుగా దుస్తులు ధరించి మురిసిపోవటం.
  • స్కాటోలోజియా: ఇతరులకు ఫోన్‌ చేసి అసభ్యంగా మాట్లాడటం.

చిత్రమైన కేసు 
వైద్యులు ఎంతోమంది రోగుల్ని చూస్తూ ఉంటారు. వాళ్లలో చిత్రమైన సమస్యలున్నవాళ్లు కూడా ఉంటారు. అలాంటి ఓ చిత్రమైన పారాఫీలియా రోగితో డాక్టర్‌ అనుభవం ఇది. 
‘డాక్టర్‌ నన్నెవరూ కొట్టట్లేదు. నేనేం చేయను?’ మంచి ఉద్యోగం, చక్కని ఒడ్డూ పొడవుతో నార్మల్‌గా కనిపించే ఓ వ్యక్తి చికిత్స కోసం వచ్చి తన బాధనిలా వెళ్లబోసుకున్నాడు. అతనికున్న రుగ్మత ‘మాసోచిజం’. అంటే...హింస భరిస్తూ లైంగికానందం పొందటం. ఇందుకోసం అతను అప్పటిదాకా ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు. కానీ హింసను భరించే వ్యసనం అంతకంతకూ ముదిరిపోయి ఎంత హింసించినా సంతృప్తి చెందని స్థితికి చేరుకుంది. పైగా ఎక్కువశాతం మంది అతన్ని అతను ఆశించినంతగా హింసించలేకపోతున్నారు. ఇక బయటివాళ్లే అలా ఉంటే రేపు పెళ్లి చేసుకుంటే భార్య పరిస్థితేంటి? ఆమె తాను సంతృప్తి చెందేంతగా హింసించగలుగుతుందా? అలా అతనిలో మొదలైన ఆలోచన తనలో లోపాన్ని గ్రహించి చికిత్స తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఈ రోగి పరిస్థితి నవ్వు తెప్పించేలా ఉండొచ్చు. కానీ అతనికది జీవన్మరణ సమస్య. 
లైంగికోన్మాదుల్లో వందల రకాలు 
పారాఫీలియాలో మొత్తం 547 రకాలున్నాయి. వీటిలో ఎక్కువశాతం పారాఫీలియాలు వైద్యుల దృష్టికి రాకుండానే ఉంటున్నాయి. ఇందుకు కారణం...ఆ రుగ్మత ఇతరులకు ఎలాంటి హాని కలిగించకపోవటమే! శాడిజం, వయూరిజంలాంటి పారాఫీలియాలు హింసకు, ప్రాణహానిలాంటి ప్రమాదకరమైన పరిణామాలకు దారితీసే పారాఫీలియాలతోపాటు, వేదిక మీద నిలబడి అందరి దృష్టిలో పడటం ద్వారా లైంగికోద్రేకం పొందే ‘అటాగొనిస్టాఫిలియా’ అనే ప్రమాదం లేని పారాఫీలియాలు కూడా ఉన్నాయి. ఇక పారాఫీలియాలు పురుషులకే పరిమితం కాదు. ఇలాంటి స్త్రీలూ ఉంటారు. అయితే ఈ కోవకు చెందిన ప్రతి 20 మందిని తీసుకుంటే వారిలో ఒకే ఒక స్త్రీ పారాఫీలియా ఉంటుంది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...