రెండు రోజుల క్రితం వరకు డోనాల్డ్ ట్రంప్‌ని ‘అమెరికన్ కెసిఆర్’ అని ఆడిపోసుకున్నారు తెలుగువాళ్లు! ఇప్పుడతనే అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యారు. అచ్చంగా మన కెసిఆర్‌లాగే! ప్రచార మాధ్యమాలన్నీ హిల్లరీ క్లింటన్ వెనక నిలబడ్డాయి. ట్రంప్ మాట్లాడిన ప్రతి మాటకి వక్ర భాష్యాలు చెప్పాయి. “మాట తీరు సరి లేదని, ఆడవాళ్ళంటే గౌరవం లేదని, లేడీ పెర్‌ఫ్యూం తగిలితే చొంగ కార్చేసుకునే ఉమనైజర్” అని తెగ దుష్ప్రచారం చేసింది ప్రో-హిల్లరీ క్యాంప్. ట్రంప్ నెగ్గితే ఇండియన్లని, ముఖ్యంగా తెలుగువాళ్లందరినీ గెంటేస్తాడని, డాలర్లు రావడం ఆగి