Jump to content

తెలంగాణలో పనులు జరగాలంటే ఈయన్ని కలవండి !


sri_india

Recommended Posts

 

4-10-16-1-copy.png

 

అదేంటి రేవంత్ ని చూపించి ఈ మాట చెబుతున్నారంటే సీన్ అలాగే ఉంది. లేటెస్ట్ గా అయ్యిన పని సిరిసిల్ల జిల్లా ! నెత్తీనోరూ మొత్తుకున్నా కాలేదు. కేటీఆర్ కారుకి అడ్డుపడి తిట్టిపోసినా చలనం రాలేదు. రేవంత్ వెళ్లి అక్కడ పరామర్శించి మద్దతు ప్రకటించాక ఇక రంగంలోకి దిగి నిర్ణయం ప్రకటించారు కేసీఆర్. ఇదేం మొదటిసారి కాదు. లెక్కతీస్తే ఇలాంటి ఘటనలు అరడజనుపైగా ఉన్నాయ్  కోఇన్సిడెంటల్ గా ఇలా ఆరు సార్లు జరుగుతుందంటారా ?


తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం అంటూ ఏడదిన్నర ఎండగట్టిన తర్వాత, నిరుద్యోగ జేఏసీ పుట్టుకొచ్చింది అక్కడ. వాళ్లు మీటింగ్ లు మీద మీటింగులు పెట్టుకుంటే  పోరాగాళ్లు పోరాడతాన్రు మనం మద్దతియ్యాలె అని, ఇట్లనే ఉంటయా దొర ఉద్యోగాలంటే అంటూ రేవంత్ మీటింగ్ కి హాజరైన తర్వాత  నాల్రోజుల్లో నోటి ఫికేషన్ వచ్చింది టీఎస్ పీఎస్సీ నుంచి. 

 మల్లన్నసాగర్ ఆందోళనల్ని ఉక్కుపాదంతో తొక్కిపెట్టాలనుకొని  పొరుగు జిల్లాల నుంచి లారీల నుంచి జనాన్ని తోలి  ఆందోళన చేస్తున్న రైతుల గొంతు నొక్కతున్నారు. ఆ దశలో రేవంత్ రెండ్రోజుల దీక్షకి దిగిన తర్వాత  ప్యాకేజీలో కొత్త క్లాజులొచ్చాయ్. రైతుల్ని ఒప్పించే తీసుకుంటామంటూ తలొగ్గింది కేసీఆర్ ప్రభుత్వం. అదీ రెండ్రోజులు తిరిగే లోపే !


ఇక మొన్న వర్షాలప్పుడు  అడ్డగోలు కట్టడాలకి ఎక్కడికక్కడ పర్మిషన్లు ఇచ్చారు  తక్షణం కూల్చాలంటూ రేవంత్ రంగంలోకి దిగి నిజాం పేట ప్రాంతంలో సొంతంగా ప్రొక్లెయిన్ తెప్పించి కూల్చాడు గోడలు. ఆది కొన్ని ఛానెళ్లు పదేపదే చూపించి ఆ తర్వాత నీళ్లు తప్పుకున్నాయ్, ముంపు తగ్గింది అంటూ చూపించడం స్టార్ట్ చేశాయ్. అంతే ఆ తర్వాత సాయంత్రమే కూల్చివేస్తాం  ఈ హడావుడి గాళ్లంతా అప్పుడు అడ్డుపడకూడదు మరి అంటూ వగలుపోయాడు అక్కడి ముఖ్యమంత్రి.


 ఇక సిరిసిల్ల సంగతి. కొడుకు కేటీఆర్ ని మూడుసార్లుగా గెలిపిస్తున్న చోట జిల్లా ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ఒప్పుకోలేదు. వాళ్లు కేటీఆర్ కాన్వాయ్ మీద కూడా దాడిశారు. ఆ మర్నాడు రేవంత్ వెళ్లి వాళ్లకి సంఘీభావం ప్రకటించిన తర్వాత వారం తిరిగే లోపు ఇపుడు జిల్లాకి ఓకే చెప్పింది. మరో రెండు జిల్లాలు కూడా ఉన్నాయ్ కదా అంటారేమో ఆ రెండు జిల్లాల కోసం డిమాండ్ చేసిన వాళ్లకీ ఈ మధ్యకాలంలో ఇంత సక్సెస్ రేటు లేదు అందుకే రేవంత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడం. 

 


 అధికారంలో ఉండే మాట చెల్లొచ్చు. ప్రతిపక్షంలో ఓ వెలుగుతున్నా చెల్లుబడి కావొచ్చు. కానీ అధికార పార్టీ చేతిలో చీల్చి చీల్చి పీలికలు అయిపోయిన ఓ విపక్ష పార్టీలో మిగిలిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో నెట్టుకొస్తున్న ఒక లీడర్ విషయంలో ఇంత జాగ్రత్తపడటం వెనక లెక్కేంటి ? సింపుల్. వ్యతిరేకత నాటు కూడదు  నాటుకున్నా ఎదగ కూడదు  ఎదిగినా మన ముందు నిలబడకూడదు  అనేది కేసీఆర్ ఫార్ములా ! అందుకే ఏ విషయం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ధిక్కార స్వరాన్ని  వేస్తున్న అడుగుల్ని మాత్రం ఆయన గమనిపిస్తూనే ఉన్నాడు. అందుకే అంటున్నది  ఏ పనైనా జరగాలంటే రేవంత్ ప్రస్తావిస్తే చాలేమో అని. ఇదేం సరదాకి అంటున్న మాట కాదు ప్రభుత్వాన్ని నడిపే ఓ బుర్ర ఏ స్థాయిలో ఆలోచిస్తోందో ఎలాంటి ప్రయోజనాలతో కదులుతోందో, ఎలాంటి భయంలో వ్యూహరచన చేస్తోందో చెప్పడానికే ఇదంతా ! ఇలాంటి ఎత్తుగడల్నే బంగారు ఉలికిపాట్లు అంటారు. జర్రంత తెలుసుకోండ్రి ! 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...