Jump to content

Bank Managers Caught


TampaChinnodu

Recommended Posts

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధానిలోని క‌శ్మీర్ గేట్ బ్రాంచ్ యాక్సిస్ బ్యాంక్‌లో రూ.40 కోట్ల విలువైన ర‌ద్ద‌యిన 500, వెయ్యి నోట్ల డిపాజిట్ జ‌రిగిన‌ట్లు ఐటీ అధికారులు గుర్తించారు. నోట్ల ర‌ద్దు త‌ర్వాత ఇంత పెద్ద ఎత్తున అక్ర‌మ డిపాజిట్లు ల‌భించ‌డం ఇదే తొలిసారి. న‌ల్ల‌ధ‌నానికి ఢిల్లీయే కేరాఫ్‌గా మార‌డంతో కొన్ని ఇత‌ర బ్యాంకులు కూడా ఇలాంటి మ‌నీ లాండ‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో ఢిల్లీలోని రాజ‌కీయ నాయకులు, ఉన్న‌తోద్యోగులు, పారిశ్రామిక‌వేత్తల స‌న్నిహితులపై దృష్టిసారించారు. గ‌త మూడు రోజులుగా యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌తో పాటు ఆ బ్యాంకు ఇద్ద‌రు మేనేజ‌ర్ల ఇళ్ల‌లో ఐటీ అధికారులు సోదాలు నిర్వ‌హించి విలువైన ప‌త్రాలు, న‌గ‌దు స్వాధీనం చేసుకున్నారు. 

ఓల్డ్ ఢిల్లీ, ల‌క్ష్మీ న‌గ‌ర్ ప్రాంతాల్లో కొంద‌రు ఈ న‌ల్ల‌ధ‌నాన్ని సేక‌రించి, బ్యాంకు అధికారుల సాయంతో వాటిని అకౌంట్ల‌లో డిపాజిట్ చేసే వ్యాపారానికి తెర‌తీశారు. ఇలాంటి లావాదేవీల‌కు స‌హ‌క‌రించినందుకు యాక్సిస్ బ్యాంకు ఇద్ద‌రు మేనేజ‌ర్ల‌కు రూ.40 ల‌క్ష‌లు చెల్లించిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఈ రూ.40 కోట్ల విలువైన ర‌ద్ద‌యిన నోట్ల‌ను కొత్త‌గా తెరిచిన మూడు అకౌంట్ల‌లో న‌వంబ‌ర్ 11 నుంచి 22 మ‌ధ్య జ‌మ చేసిన‌ట్లు గుర్తించారు. ఈ మూడు అకౌంట్ల‌లో మొత్తం రూ.39.26 కోట్లు జ‌మ‌య్యాయి. వీటిని ఆర్టీజీఎస్ ద్వారా ఇత‌ర అకౌంట్ల‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేశారు. ఈ కేసులో అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్య‌క్తుల‌ను విచారించ‌గా.. బ్యాంకు స‌మ‌యం ముగిసిన త‌ర్వాత ఈ డ‌బ్బు తీసుకోవ‌డానికి ప్ర‌త్యేకంగా కౌంట‌ర్లు తెర‌వ‌డానికి ఆ ఇద్ద‌రు మేనేజ‌ర్లు స‌హ‌క‌రించార‌ని తెలిపారు. అయితే బ్యాంకు అధికారులు మాత్రం ఆ మొత్తం పాత అకౌంట్ల‌లోనే డిపాజిట్ అయిన‌ట్లు చెబుతున్నారు.

Link to comment
Share on other sites

17 minutes ago, micxas said:

dorkaru kada antha easy ga... (*

If modi is serious about this note ban. Then he has to take strict against people abusing it. Otherwise all this effort will be waste

Link to comment
Share on other sites

2 minutes ago, TampaChinnodu said:

If modi is serious about this note ban. Then he has to take strict against people abusing it. Otherwise all this effort will be waste

but its going to be a tedious task, so best thing is to arrest at least like 100 bank managers who are corrupt and dismiss them... which will eventually force the others to back out %$#$

Link to comment
Share on other sites

1 minute ago, micxas said:

but its going to be a tedious task, so best thing is to arrest at least like 100 bank managers who are corrupt and dismiss them... which will eventually force the others to back out %$#$

Yes. Kondari meeda strict actions theesukunte others will get fear

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...