Jump to content

Babu Money ..Govinda...Govinda


vravi22

Recommended Posts

భోషాణం బద్దలు 

00 కిలోల బంగారం.. 90 కోట్లు స్వాధీనం

చెన్నైలో కాంట్రాక్టర్‌ శేఖర్‌రెడ్డి ఇంట్లో నిధి 

  • వెయ్యి కోట్ల ఆస్తుల పత్రాలు లభ్యం
  • నగదులో 70 కోట్లు కొత్త కరెన్సీ
  • శేఖర్‌ రెడ్డి టీటీడీ బోర్డు సభ్యుడు
  • అన్నాడీఎంకే పెద్దలకు ఆప్తుడు
  • శశికళ, పన్నీర్‌లకు సన్నిహితుడు
  • ఇసుక అనుమతులన్నీ ఆయనవే
 
చెన్నై, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): పెద్దనోట్ల కట్టలు తెగాయి. ఒకటీ రెండూ కాదు... ఏకంగా రూ.70 కోట్ల విలువైన సరికొత్త 2వేల నోట్లు బయటపడ్డాయి. అంతా ఇంతా కాదు... ఒకేసారి వంద కిలోల బంగారు ‘నిక్షేపాలు’ జిగేల్‌మన్నాయి. సామాన్య జనం పెళ్లి పేరంటాలు వాయిదా వేసుకుంటూ, చావుకొస్తే నానా తంటాలు పడుతుండగా... పెద్దలు మాత్రం కట్టలుకట్టలుగా సొమ్ములు పోగేసుకున్న వైనం వెలుగు చూసింది. చెన్నైకి చెందిన బడా కాంట్రాక్టర్‌, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుడు, తమిళనాడు అధికారపార్టీ అన్నాడీఎంకే ప్రముఖులకు అత్యంత సన్నిహితుడైన జె.శేఖర్‌ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు జరిపినప్పుడు ఈ ‘నిధి - నిక్షేపాలు’ బయటపడ్డాయి. సోదాల్లో రూ.90 కోట్ల నగదు లభించగా... రూ.70 కోట్లు అచ్చంగా కొత్త 2 వేల నోట్లే! చెన్నైలోని శేఖర్‌ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు గురువారం తనిఖీ చేశారు. ఆయన స్నేహితులు, వ్యాపార భాగస్వాములుగా భావిస్తున్న శ్రీనివాసులు రెడ్డి, ప్రేమ్‌రెడ్డి, కిరణ్‌ రెడ్డి తదితరుల నివాసాల్లోనూ తనిఖీలు జరిగాయి. ఉదయం 8.30 నుంచి తనిఖీలు స్థానిక టి.నగర్‌లోని సాంబశివ వీధి, బజుల్లా రోడ్డు, విజయరాఘవ రోడ్డు, అన్నానగర్‌, మొగప్పేర్‌ తదితర ప్రాంతాల్లో తనిఖీలు జరిపారు. రాత్రి పొద్దుపోయే వరకు జరిగిన తనిఖీల్లో నగదు, నగలతో పాటు కోట్లాది రూపాయల విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రూ.90 కోట్లలో సుమారు 20 కోట్లు పాత 1000, 500 నోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కోటి కిలో బరువున్న వంద బంగారు కడ్డీలు స్వాధీనం చేసుకున్నారు. ఇక... వేలూరు జిల్లా విరుదంపట్టిలో ఉన్న శేఖర్‌ రెడ్డి నివాసానికి ఐటీ అధికారులు సీలు వేశారు. చిత్తూరు జిల్లాలోని ఆయన కార్యాలయాల్లోనూ తనిఖీ చేసినట్లు సమాచారం. విజయ రాఘవరోడ్డులో ఉన్న శేఖర్‌ రెడ్డి కార్యాలయానికి ఐటీ సిబ్బంది కరెన్సీ లెక్కించే యంత్రాలను తీసుకెళ్లి సొమ్ములు లెక్కపెట్టాల్సి వచ్చింది. మొత్తం ఆస్తుల విలువను లెక్కించేందుకు అప్పటికిప్పుడు అదనపు సిబ్బందిని, ఆడిటర్లను, బ్యాంకు అధికారులను రప్పించారు. పలుచోట్ల సోదాలు ఇంకా జరుగుతున్నాయి. అవి పూర్తయితేగానీ మొత్తం లెక్కలు బయటపడవు.
 
 
ఎవరీ శేఖర్‌ రెడ్డి?
తమిళనాడులోని వేలూరు జిల్లా కట్పాడి సమీపంలోని తొండ్ర తులసి అనే గ్రామం! ఆయన మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. తొలుత చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకునేవారు. తర్వాత రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి అడుగుపెట్టారు. కాలక్రమంలో స్థానిక రాజకీయ నాయకులకు దగ్గరయ్యారు. ‘స్థాయి’ పెరిగేకొద్దీ... తమిళనాడు ప్రభుత్వంలో పని చేసే కొంతమంది సీనియర్‌ ఐఏఎస్‌లకు సన్నిహితుడిగా మారారు. రోడ్లు, నిర్మాణ కాంట్రాక్టు పనులు కూడా చేపట్టారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, 2001లో ప్రజా పనుల శాఖమంత్రిగా ఉన్న పన్నీర్‌ సెల్వానికి కూడా దగ్గరయ్యారు. అప్పటి నుంచే శేఖర్‌ రెడ్డి దశ మారినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి సంబంధించిన అనేక కాంట్రాక్టులు ఆయనను వెతుక్కుంటూ వచ్చేవని చెబుతారు. వైభవ్‌ ఇనఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌, జేఎ్‌సఆర్‌ బిల్డర్స్‌ పేరిట రెండు కంపెనీలకు శేఖర్‌ రెడ్డి అధినేతగా ఉన్నారు. భారీ స్థాయిలో ఇసుక ర్యాంప్‌లుకూడా ఉన్నాయి. తమిళనాడువ్యాప్తంగా ఇసుక తవ్వకాల అనుమతులన్నీ ఆయనకే దక్కడం విశేషం. ప్రస్తుతం ఈసీఆర్‌ రోడ్డు విస్తరణ, వీరాణాం చెరువు పూడికతీత పనులతోపాటు రూ.వెయ్యికోట్లకు పైగా విలువ చేసే కాంట్రాక్టు పనులు చేతిలో ఉన్నాయి. శశికళకు, తమిళనాడు మంత్రి విజయ భాస్కర్‌కు కూడా శేఖర్‌రెడ్డి సన్నిహితుడే. డీఎంకేలోనూ పలువురు ప్రముఖులతో బాగా పరిచయమని చెబుతారు. చిత్తూరులోని దుర్గా కాలనీలో శేఖర్‌ రెడ్డి అత్తగారి ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది.
 
 
సెల్వం సిఫారసుతో...

జయలలిత సన్నిహితురాలు శశికళతోనూ శేఖర్‌ రెడ్డికి మంచి పరిచయాలున్నాయి. జయ బెంగళూరు జైల్లో ఉన్న సమయంలో పన్నీర్‌సెల్వం సిఫారసుతోనే ఆయనకు టీటీడీ పాలకమండలిలో సభ్యత్వం లభించినట్లు తెలిసింది. ఇటీవల పన్నీర్‌సెల్వం తిరుమల సందర్శించినప్పుడు శేఖర్‌ రెడ్డి ఆయన వెంటే ఉన్నారు. వ్యక్తిగతంగా శేఖర్‌ రెడ్డికి మంచి పేరే ఉంది. స్వచ్ఛంద సేవా సంస్థలకు భారీగా విరాళాలు ఇస్తుంటారు. డబ్బుల్లేక చదువుకోలేని విద్యార్థులను ఆదుకుంటారు. 

‘పిల్లుల పోట్లాట’ ఫలితమా? 

 

శేఖర్‌ రెడ్డితోపాటు తమిళనాడు సీనియర్‌ మంత్రి ఎడప్పాడి పళనిస్వామి వియ్యంకుడైన ఈరోడ్డు రామలింగం నివాసంలోనూ ఐటీ అధికారులు తనిఖీ చేసినట్లు తెలిసింది. ఇటీవల బెంగళూరులో పట్టుబడిన రూ.150 కోట్ల కేసుతో రామలింగానికి సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన నివాసం నుంచి ఇటీవల సీబీఐ అధికారులు రూ.6 కోట్ల కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. గురువారం రామలింగం కుమారుడైన చంద్రకాంతను వారు ప్రశ్నించారు. అదే సమయంలో శేఖర్‌ రెడ్డి బృందం నివాసాలు, కార్యాలయాలపై ఐటీ అధికారులు పంజా విసిరారు. పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి పళనిస్వామి ఇద్దరూ సీఎం పదవి కోసం పోటీ పడ్డారు. పన్నీర్‌ సెల్వమే గెలిచారు. ఈ క్రమంలోనే... ఒకరి సన్నిహితులకు సంబంధించి మరొకరు ఐటీ అధికారులకు ఉప్పందించారా అన్నదానిపై చర్చ జరుగుతోంది. ఇటీవల శశికళకు సన్నిహితంగా మెలుగుతున్నందునే శేఖర్‌ రెడ్డిపై ప్రత్యర్థులు సమాచారం ఇచ్చి ఉంటారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు తమిళ సర్కారులో కుమ్ములాటలు మొదలవుతున్న నేపథ్యంలో ‘తోక జాడిస్తే ఇంతే’ అని కేంద్రం హెచ్చరికలు జారీ చేసిందా అనే చర్చ కూడా జరుగుతోంది. పోయె్‌సగార్డెనలో శశికళతో పన్నీర్‌సెల్వం మంతనాలు జరుపుతున్న సమయంలోనే ఈ దాడులు జరగడం విశేషం.
 
Link to comment
Share on other sites

  • Replies 44
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • vravi22

    11

  • ParmQ

    10

  • Luke

    6

  • DiscoKing

    5

Top Posters In This Topic

1 minute ago, sri_india said:

avi babu vi kadhu bro ..... Shashikala vi ani inner circle talk ... center shashikala ki chinna jalak ichindi antaa so she will be in good terms with BJP ani talk undi 

CBN kutra @3$% 

Link to comment
Share on other sites

11 minutes ago, sri_india said:

avi babu vi kadhu bro ..... Shashikala vi ani inner circle talk ... center shashikala ki chinna jalak ichindi antaa so she will be in good terms with BJP ani talk undi 

In TTD members..how come Tamilnadu person nominated.???

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...