Jump to content

మోదీ నివాసంలో ఆరుగురు రహస్యంగా..


JANASENA

Recommended Posts

9brk-modi.jpg

దిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు నవంబర్‌ 8వ తేదీ రాత్రి ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన ఒక్క నిర్ణయం యావత్‌ భారతదేశాన్ని కుదిపేసింది. నల్లధనం ఉన్న వాళ్లకు వెన్నులో వణుకు పుట్టించింది. ఈ నిర్ణయమంతా ఎంతో గోప్యంగా జరిగిందని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. ప్రధాని మోదీ నివాసంలోని రెండు గదుల్లో ఆరుగురు సభ్యులున్న బృందం ఎంతో రహస్యంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టింది. మరో యువపరిశోధక బృందం వారికి సహాయపడింది. అందులో మోదీకి అత్యంత విశ్వాసపాత్రుడైన ప్రభుత్వాధికారి హస్‌ముఖ్‌ అధియా కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.

ఒకవేళ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ముందుగానే సమాచారం బయటికి వస్తే నల్లధనాన్ని బంగారం, స్థలాలు, ఇతర రూపాల్లోకి మార్చుకునే అవకాశం ఉందని నిర్ణయాన్ని గోప్యంగా ఉంచారు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఎదుర్కొనే పరిణామాలను ప్రధాని ముందుగానే వూహించారని, దీనికి తగినట్లు నివారణ చర్యలు చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు ఈ నివేదికలు పేర్కొంటున్నాయి.

నవంబర్‌ 8న నిర్ణయం ప్రకటించడానికి ముందు.. దీనిపై అన్ని విధాలుగా పరిశోధన జరిపామని, ఇందులో ఏదైనా తప్పిదం ఉంటే దానికంతటికీ పూర్తి బాధ్యత తానే వహిస్తానని మోదీ కేబినెట్‌ సమావేశంలో అన్నట్లు సమావేశానికి హాజరైన ముగ్గురు మంత్రులు వెల్లడించారు.

2003-06 మధ్య గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోదీ పనిచేసినపుడు అధియా కార్యదర్శిగా పనిచేశారు. ప్రధాని మోదీతో నేరుగా ఫోన్‌లో మాట్లాడే వ్యక్తుల్లో అధియా ఒకరు. 2015 సెప్టెంబర్‌లో రెవెన్యూ అధికారిగా అధియా నియమితులయ్యారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ దగ్గరే ఆయన విధి నిర్వహణ అయినా ప్రధానితో మాట్లాడేందుకు ఆయనకు డైరెక్ట్‌ లైన్‌ ఉంది. ఏ విషయంగురించైనా వివరంగా మాట్లాడాల్సి వస్తే ప్రధానితో ఆయన గుజరాతీలో మాట్లాడేవారట.

పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే దీనిపై అధియా ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న అతి పెద్ద, సాహసోపేత నిర్ణయంగా అభివర్ణించారు. ఎంత తక్కువ సమయంలో కొత్త నోట్లు ముద్రించి తీసుకొస్తాం, వాటిని ఎలా పంపిణీ చేయాలి, ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ఎటువంటి చర్యలు చేపట్టాలనే పలు ప్రశ్నలపైనా మోదీ చర్చించినట్లు సమాచారం. ఈ నిర్ణయం గురించి ఎటువంటి సమాచారం బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే కొత్త సిరీస్‌లో నోట్లను ముద్రిస్తున్నట్లు, కొత్త రూ.2వేల నోటు డిజైన్‌ చేస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ గతంలో ప్రకటించింది. దేశంలో ఉన్న నాలుగు కరెన్సీ ముద్రణా సంస్థల్లో కొత్త రూ.500, రూ.2000 నోట్ల ముద్రణ జరిగింది. దాదాపు మూడు నెలల్లో వీటిని పూర్తి స్థాయిలో ముద్రించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని భావించారు.

Link to comment
Share on other sites

2 hours ago, tom bhayya said:

braces_1 monna chennai lo okadi daggara 70 crores new currency ela vachaayo cheppagalaara ee experts 6

avi cheppaleru, also yesterday 10 cr new currency and 140 kg gold ela vocchayo kuda cheppaleranukunta, also normal ppl ki day ki 4k cash dorakatam kuda kashtam aipoindi daani gurinchi assalu cheppaleranukunta @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...