Jump to content

ఆఖరు సారి.. ఆమెను చూడాలి.. ఓ వృద్ధుడి చివరి కోరిక


JANASENA

Recommended Posts

29brk-feng1aa.jpg

 

ఇంటర్నెట్‌డెస్క్‌: భాష, జాతి, మతం, దేశం.. ఏదైనా సరే వివాహ బంధానికి అర్థం మారదు. ఏ పద్ధతిలో చేసుకున్నా పెళ్లికి అర్థం కలకాలం కలిసి జీవించడమే. వాళ్లు అలాగే ఏకంగా 66 ఏళ్లు కలిసి జీవించారు. అందుకే భార్యను చూడకుండా తుదిశ్వాస విడవలేకపోయాడాయన. ఆయన కోరిక మన్నించి భార్యను చూపిస్తే.. ఆ తర్వాత రెండు గంటలకే ప్రశాంతంగా కన్నుమూశాడు. ఆస్పత్రి మంచాల మీద ఆ వృద్ధజంట చివరి చూపుల ఈ ఫొటో కొన్నాళ్లుగా నెటిజన్ల కళ్లు చెమర్చేలా చేస్తోంది.

చైనాలోని నింగ్బో ప్రాంతానికి చెందిన ఫెంగ్‌(92) దంపతుల కథ ఇది. ఫెంగ్‌(92) తీవ్ర అనారోగ్యానికి గురై ఇంగ్‌జు పీపుల్స్‌ ఆస్పత్రిలో చేరారు. అదే సమయంలో ఆయన భార్యకు ఎముక విరగడంతో అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఫెంగ్‌ 3వ ఫ్లోర్‌లోని ఐసీయూలో, ఆయన భార్య 14వ ఫ్లోర్‌లో చికిత్స పొందుతున్నారు. సుమారు నెల రోజుల పాటు ఇద్దరూ ఒకే ఆస్పత్రిలో ఉన్నా చూడటానికి, మాట్లాడుకోవడానికి వీలు పడలేదు.

ఫెంగ్‌ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వృద్ధాప్యంతో శరీరంలోని పలు భాగాలు పని చేయడమే మానేశాయి. దీంతో ఫెంగ్‌.. తాను ఎక్కువ కాలం బతకనని అర్థమైందని, ఇంక తనకు ఎలాంటి చికిత్సలూ వద్దని, శేష జీవితాన్ని ఇంటి వద్ద గడుపుతానని కుటుంబసభ్యులకు చెప్పాడు. వెంటనే కుటుంబసభ్యులు డాక్టర్లతో సంప్రదింపులు జరిపి ఫెంగ్‌ను ఇంటికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేపట్టారు.

29brk-feng1ab.jpg

అయితే ఆస్పత్రి నుంచి ఇంటికెళ్లేముందు చూస్తే ఆయన ముఖం చిన్నబోయి ఉంది. గమనించిన కుమార్తె చికిత్స కొనసాగించమంటావా నాన్నా అని తండ్రిని మళ్లీ అడిగింది. అందుకు ఆయన తల అడ్డంగా వూపి.. భార్యను చూసి చాలా కాలమైందని, ఆమెను ఎంతో మిస్సవుతున్నానని, చివరిగా ఆమెను చూడాలని ఉందని చెప్పాడు. ఆమె వైద్యులతో సంప్రదింపులు జరపగా వారు అంగీకరించడంతో అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫెంగ్‌ భార్యను స్ట్రెచర్‌ మీద ఐసీయూకి తీసుకొచ్చారు. వారిద్దరూ కలుసుకున్నప్పుడు ఓ నర్సు తీసిన ఫొటో ఇది. 2016 అక్టోబరు 24న ఫెంగ్‌ ఉన్న వార్డులోకి ఆయన భార్యను తీసుకొచ్చారు. వృద్ధ దంపతులు ఇద్దరూ చూసుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఆ వృద్ధురాలు భర్త చేతిని తన చేతిలోకి తీసుకుని... నా ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటాను. ఇంటికి వచ్చిన తర్వాత నేను నిన్ను వెతుక్కోవాలి అంటూ భోరున విలపించింది. అనంతరం ఫెంగ్‌ను కుటుంబసభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఫెంగ్‌ మృతి చెందాడు.

29brk124add1aa.jpg

తాజాగా ఆ నర్సు అప్పటి ఫొటోను సోషల్‌ మీడియాలో ఉంచింది. కొద్దిసేపటికే ఆ ఫొటో మీద 34వేల మంది కామెంట్లు రాశారు. ఇప్పటి యువత వీరిని ఆదర్శంగా తీసుకోవాలని, ఈ ఫొటో తనని ఎంతో కదిలించిందని, వారి ప్రేమ అద్భుతమని, తమ బాధను ఆపుకోలేకపోతున్నామని పలువురు పేర్కొన్నారు.

29brk124add1ab.jpg
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...