Jump to content

అమెరికా కాంగ్రెస్లో కీలక బిల్లు.. కలలన్నీ చెదిరిపోవడం ఖాయం


spider_reddy

Recommended Posts

మళ్లీ తెరపైకి హెచ్‌-1బీ వీసా బిల్లు 

కనీస వేతనం ఏడాదికి లక్ష డాలర్ల ప్రతిపాదన 

మాస్టర్‌ డిగ్రీ మినహాయింపు ఎత్తివేత 

‘ప్రొటెక్ట్‌ అండ్‌ గ్రో అమెరికన్‌ జాబ్స్‌ యాక్ట్‌’ను అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన ప్రతినిధులు 

‘ఒబామా కేర్‌’ కోసం పోరాడండి 

 డెమోక్రాట్లకు ప్రస్తుత అధ్యక్షుడి పిలుపు 

వాషింగ్టన్‌, జనవరి 5: అమెరికా కలలుగనే భారతీయ నిపుణులకు దుర్వార్త. హెచ్‌-1బీ వీసాల దుర్వినియోగాన్ని అరికట్టే ‘ప్రొటెక్ట్‌ అండ్‌ గ్రో అమెరికన్‌ జాబ్స్‌ యాక్ట్‌’ మళ్లీ తెరపైకి వచ్చింది. రిపబ్లికన్‌ ప్రతినిధి డారెల్‌ ఇస్సా, డెమొక్రాటిక్‌ ప్రతినిధి స్కాట్‌ పీటర్స్‌ ఈ బిల్లును బుధవారం అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. వీరిద్దరూ అమెరికాలో భారతీయులు ఎక్కువగా ఉండే కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన ప్రతినిధులు కావడం గమనార్హం.

ఏమిటీ బిల్లు?

అత్యున్నత స్థాయి నైపుణ్యాలు అవసరమై ఉద్యోగాలకు అర్హులైన స్థానికులు దొరకనప్పుడు.. అమెరికా కంపెనీలు విదేశాల నుంచి అలాంటి ఉద్యోగులను నియమించుకోవడానికి వీలు కల్పిస్తూ యూఎస్‌ కాంగ్రెస్‌ హెచ్‌-1బీ వీసా ప్రోగ్రామ్‌ను రూపొందించింది. తమ దేశ ఆర్థికాభివృద్ధికి మానవ వనరుల కొరత అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఈ వీసాను ప్రవేశపెట్టారు. అయితే, ఈ వీసా లొసుగుతో అనేక కంపెనీలు.. తమ సంస్థల్లో పలు సాధారణ ఉద్యోగాలకు సైతం చౌకగా దొరికే విదేశీయులను నియమించుకోవడం మొదలుపెట్టాయి. దీనివల్ల అమెరికన్ల ఉపాధిపై దెబ్బ పడుతోందని పలువురు ప్రజాప్రతినిధులు చాలాకాలంగా ధ్వజమెత్తుతున్నారు. గత ఏడాది జూలైలో సైతం ఈమేరకు ఒక బిల్లు ప్రవేశపెట్టారు. తాజాగా ప్రవేశపెట్టిన బిల్లులో.. హెచ్‌-1బీ వీసాపై వచ్చేవారి కనీస జీతం ఏడాదికి లక్ష డాలర్లుగా ఉండాలని(ప్రస్తుతం ఆ పరిమితి 60 వేల డాలర్లు), మాస్టర్‌ డిగ్రీ మినహాయింపును ఎత్తివేయాలని సవరణలు ప్రతిపాదించారు. ‘ప్రపంచానికి నాయకత్వం వహించే క్రమంలో అత్యుత్తమ నైపుణ్యానికి మనం భరోసా ఇస్తాం. కానీ, అదే సమయంలో మన కంపెనీలు అమెరికన్‌ ఉద్యోగులకు బదులుగా చౌకగా దొరికే విదేశీ ఉద్యోగులను నియమించుకోకుండా అడ్డుకోవాలి. అందుకే ఈ బిల్లు ప్రవేశపెట్టాం’’ అని ఇస్సా పేర్కొన్నారు.

అబ్బే.. లాభం లేదు! 

ఈ బిల్లు వల్ల హెచ్‌-1బీ వీసాల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడే అవకాశంలేదని కాలిఫోర్నియాకే చెందిన డెమొక్రాట్‌ జో లాఫ్‌గ్రెన్‌ అభిప్రాయపడ్డారు. దాదాపు దశాబ్దకాలంగా ఆమె ఇమిగ్రేషన్‌ సంస్కరణలపై అధ్యయనం చేస్తున్నారు. బిల్లులో ప్రతిపాదించిన ప్రకారం.. వార్షిక వేతనం పరిధిని లక్ష డాలర్లకు పెంచినా పెద్ద ఉపయోగం ఉండదని ఎందుకంటే సిలికాన్‌ వ్యాలీలో అలాంటి ఉద్యోగాల సగటు వార్షిక వేత నం లక్షా పదిహేను వేల డాలర్లుగా ఉందని ఆమె చెబుతున్నారు. కొంత మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లయితే 1.4 లక్షల డాలర్లు సైతం డిమాండ్‌ చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. హెచ్‌-1బీ వీసాల జారీకి ప్రస్తుతం ఉన్న లాటరీ పద్ధతి కాకుండా ఎవరు అత్యధిక జీతాలు ఇవ్వడానికి సిద్ధపడతారో ఆ కంపెనీలకు మాత్రమే ఆ వీసాలు జారీ చేస్తామంటే వాటి దుర్వినియోగం తగ్గుతుందని లాఫ్‌గ్రెన్‌ పేర్కొంటున్నారు. అయితే.. వైట్‌హౌ్‌సలో అడుగుపెట్టిన తొలిరోజే తాను చేపట్టే ఐదు కార్యనిర్వాహక చర్యల్లో ఇమ్మిగ్రేషన్‌ సంస్కరణలు కూడా ఒకటని డోనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజా బిల్లుపై సర్వత్రా ఆసక్తి, భారతీయుల్లో ఆందోళన నెలకొంది.

రద్దు వల్ల ఇబ్బంది వద్దు.. 
అమెరికన్ల ఆరోగ్య సంరక్షణకు సంబంధించి బరాక్‌ ఒబామా ప్రవేశపెట్టిన ‘ఒబామా కేర్‌’ను తాను అధికారంలోకి రాగానే రద్దు చేస్తానని ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఒకవేళ దాన్ని రద్దు చేసినా వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని వైస్‌ ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ మైక్‌ పెన్స్‌ డోనాల్డ్‌ ట్రంప్‌కు సూచించడం గమనార్హం. మరోవైపు.. రెండు వారాల్లో వైట్‌హౌ్‌సను వీడి ‘మాజీ’ కానున్న ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా బుధవారం కాంగ్రెస్‌ను సందర్శించారు. ఒబామా కేర్‌ రద్దు కాకుండా గట్టిగా పోరాడాలని తమ పార్టీ ప్రతినిధులకు సూచించారు. ఇక.. భారత్‌తో సంబంధాల వల్ల అమెరికాకు జాతీయ భద్రత, దౌత్యపరమైన, ఆర్థికపరమైన ప్రయోజనాలు ఉంటాయని ఒబామా భావించారని, అందుకే ఇండియాతో సంబంధాల బలోపేతానికి గట్టిగా కృషి చేశారని వైట్‌హౌస్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...