Jump to content

ఎనిమిదేళ్లుగా ఎయిర్పోర్టులోనే నివాసం


JANASENA

Recommended Posts

8brk1-changi.jpg
ర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు డబ్బులు ఆదా చేయడానికి అందరూ అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. దుబారా ఖర్చులు తగ్గిస్తారు.. ఓవర్‌ డ్యూటీలు చేస్తారు. పెద్ద ఇంట్లో అద్దెకుండేవాళ్లు తక్కువ అద్దె ఉన్న చిన్న ఇంట్లోకి మారిపోతారు. కానీ.. ఓ మహిళ మాత్రం భిన్నమైన పని చేసింది. తనకున్న ఇంటిని అద్దెకిచ్చి ఏకంగా ఎయిర్‌పోర్టుకి మకాం మార్చేసింది. అద్దెతో వచ్చిన డబ్బులతో ఎనిమిదేళ్లుగా ఎయిర్‌పోర్టులోనే కాలం వెళ్లదీస్తున్న ఆమెను ఇటీవల అధికారులు గుర్తించారు.

సింగపూర్‌కి చెందిన 50 ఏళ్ల ఓ మహిళ 2008లో వచ్చిన సంక్షోభంతో ఉద్యోగం కోల్పోయింది. ఆదాయం లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోని ఆమె తాను ఉంటున్న ఇంటిని అద్దెకిచ్చి ఎక్కడైనా తాత్కాలికంగా ఆశ్రయం పొందాలని భావించింది. వెంటనే అనుకున్న పనిని అమలు చేసింది. తన ఇంటిని అద్దెకిచ్చి చాంగీ ఎయిర్‌పోర్టులో తలదాచుకుంది. చాంగీ ఎయిర్‌పోర్టు ప్రపంచంలోనే పేరున్న ఎయిర్‌పోర్టు. ఇక్కడ కిరణా దుకాణం నుంచి పెద్ద షాపింగ్‌ కాంపెక్స్‌ల వరకు సకల సౌకర్యాలుంటాయి. దీంతో ఆమెకు వచ్చిన అద్దె డబ్బులతో ఎయిర్‌పోర్టులోని హోటళ్లలో తింటూ అక్కడే విశ్రాంతి గదుల్లో పడుకోవడం మొదలుపెట్టింది. మొదట్లో తొందరగా అక్కడి నుంచి మకాం మార్చాలనుకున్నా.. సౌకర్యవంతమైన వాతావరణం చూసి అక్కడే ఉండిపోయింది. అలా ఎనిమిదేళ్లుగా ఆమె ఎయిర్‌పోర్టులోనే నివసిస్తోంది. ఇటీవల ఆమెను గుర్తించిన ఎయిర్‌పోర్టు సిబ్బంది అదుపులోకి తీసుకొని సాంఘిక.. కుటుంబాభివృద్ధి మంత్రిత్వశాఖకు అప్పగించారు. అయితే ఇప్పుడు ఆ మహిళ తన ఇంటిని అమ్మేసి చిన్న ఇల్లు కొనుక్కొని అందులోనే ఉండాలని భావిస్తోందట.

8brk2-changi.jpg
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...