Jump to content

యువీ-మహీ జోరు.. భారత్ 304/4


JANASENA

Recommended Posts

10brk-128-akd1.jpg

ముంబయి: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వార్మప్‌ మ్యాచ్‌లో కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని, ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ మెరుపు బ్యాటింగ్‌ చేశారు. దూకుడుగా ఆడుతూ అర్ధశతకాలు బాదారు. ముందే చెప్పినట్లు ఈ జోడీ స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేసి ప్రత్యర్థి బౌలింగ్‌పై దాడికి దిగింది. సిక్సర్లు, బౌండరీలతో అభిమానులను అలరించింది. ఇక తెలుగు ఆటగాడు అంబటి రాయుడు శతకంతో, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ సమయోచిత బ్యాటింగ్‌తో ఆకట్టుకోవడంతో భారత్‌-ఏ 2 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది.

అంబటి అదుర్స్‌ 
ముంబయి బ్రాబౌర్నె వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడిన భారత్‌-ఏ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. జట్టు స్కోరు 25 పరుగుల వద్దే ఓపెనర్‌ మన్‌దీప్‌ సింగ్‌ (8) వికెట్‌ కోల్పోయినా శిఖర్‌ధావన్‌ (63; 84 బంతుల్లో 8×4, 1×6) నిలకడగా బ్యాటింగ్‌ చేశాడు. 136 పరుగుల వద్ద శిఖర్‌.. జే.బాల్‌ బౌలింగ్‌లో బట్లర్‌ చేతికి చిక్కడంతో యువరాజ్‌ సింగ్‌ (56; 48 బంతుల్లో 6×4, 2×6) రంగంలోకి దిగాడు. తొలి పది బంతులు నిలకడగా ఆడినా యువీ ఆ తర్వాత సిక్సర్లతో రెచ్చిపోయాడు. అంతకు ముందే అర్ధశతకం సాధించిన అంబటి రాయుడు (100 రిటైర్డ్‌; 97 బంతుల్లో 11×4, 1×6) యువీ అర్ధశతకం చేసిన వెంటనే శతకం పూర్తిచేశాడు.

10brk-128-akd2.jpg

ధోని ధనాధన్‌ 
రాయుడు రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరగడంతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ ధోని (68 నాటౌట్‌; 40 బంతుల్లో 8×4, 2×6) స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేశాడు. ప్రత్యర్థి బౌలర్లను ఆడుకొన్నాడు. కేవలం 35 బంతుల్లో అర్ధశతకం బాదాడు. ఆఖరి ఓవర్‌లో 6, 4, 4, 2, 6, 1తో అదరగొట్టడంతో ఇంగ్లాండ్‌కు భారత్‌ 305 పరుగుల లక్ష్యం నిర్దేశించింది.

 

bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...