Jump to content

ప్రధాని అయ్యే అవకాశాలు వదులుకున్నా ఏపీ సీఎం చంద్రబాబు


JANASENA

Recommended Posts

10brk110a.jpg

చెన్నై: చెన్నైలో ఇండియాటుడే నిర్వహించిన సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండియాటుడే సంపాదకులు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ అడిగిన పలు ప్రశ్నలకు సదస్సులో చంద్రబాబు సమాధానమిచ్చారు. ఆమరావతిని ప్రపంచ శ్రేణి ఉత్తమ నగరాలలో ఒకటిగా నిర్మించాలన్నదే తన ఆశయమని తెలిపారు. చంద్రబాబు నాయుడు రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వంలో కీలక భూమిక నిర్వహించే అవకాశముందా అని ప్రశ్నించగా.. యునైటెడ్‌ ఫ్రంట్‌ హయాంలో రెండు సార్లు తనకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందని తెలిపారు. కానీ రాష్ట్ర రాజకీయాలకే తన ప్రాధాన్యత అని ఆ అవకాశాన్ని తిరస్కరించినట్లు తెలిపారు. ఇప్పటికీ తన అభిప్రాయంలో మార్పు లేదని స్పష్టం చేశారు.

గత యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను సహేతుకంగా విభజించని కారణంగా పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయని తెలిపారు. రాజధానికోసం వేలాది ఎకరాలు ఇచ్చేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని తెలిపారు. తెలుగుదేశంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న వైకాపా వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. అవినీతి కేసులో జైలు జీవితం గడిపిన వారి వ్యాఖ్యలు పట్టించుకోనవసరం లేదని తెలిపారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...