Jump to content

భారత ఐటీ నెత్తిన అమెరికా పిడుగు


JANASENA

Recommended Posts

10ts-story1a.jpg

నుకున్నంతా అవుతోంది. దేశాధ్యక్షుడి కుర్చీలో ట్రంప్‌ కూర్చోకముందే ఆయన ఆలోచనలకు అనువైన విధానాలను అమలు చేయటానికి అక్కడి కాంగ్రెస్‌ సభ్యులు, విధాన నిర్ణేతలు సన్నాహాలు చేస్తున్నారు. ‘అమెరికాయే ముందు’ (అమెరికా ఫస్ట్‌) అని ట్రంప్‌ అన్నప్పుడు మనదేశంలో ఐటీ పరిశ్రమకు ఇబ్బంది తప్పదేమోననే అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి. అమెరికా ప్రభుత్వం ఇంతవరకు అమలు చేస్తున్న హెచ్‌ 1-బి వీసా ప్రోగ్రాం ‘చౌక కార్మికుల కార్యక్రమం’గా ఆయన అభివర్ణించారు. ఈ వీసాల వల్ల వివిధ దేశాల నుంచి మేధావులు, సాంకేతిక నిపుణులు అమెరికా వచ్చి చౌకగా పనిచేస్తుండం మొదలైంది. నిజానికి దానివల్ల అమెరికా ఎంతో లాభపడుతోందనేది సర్వత్రా ఉన్న అభిప్రాయం. ట్రంప్‌ మాత్రం ఇందుకు భిన్నంగా తమ ఉద్యోగాలన్నీ ఇతర దేశాలకు చెందిన వారు తన్నుకుపోతున్నారని, అవన్నీ తిరిగి అమెరికన్లకే లభించేలా నిబంధనలు మార్చాలనే వాదన చాన్నాళ్లుగా ఉంది. ట్రంప్‌ దీనిని తనకు అనుకూలంగా మలచుకుని విజయం సాధించాడు. తాజాగా హెచ్‌ 1-బి ప్రోగ్రాంలో మార్పులు చేయాలనే బిల్లును డరెల్‌ ఇస్సా, స్కాట్‌ పీటర్స్‌ అనే ఇద్దరు సభ్యులు కాంగ్రెస్‌లో మరోసారి ప్రవేశపెట్టారు.

10ts-story1b.jpg

ఈ బిల్లులో ఏం ఉంది? 
* అమెరికా పౌరుడు కాకుండా ఇతర దేశాల నుంచి అమెరికా వచ్చి ఉద్యోగాలు చేసేందుకు వీలుగా అమెరికా ప్రభుత్వం ఇచ్చే వీసానే హెచ్‌ 1-బి వీసా. నిపుణులు తమ దేశానికి రావాలనే ఉద్దేశంతో ఈ సదుపాయాన్ని కల్పించారు. 
* ‘ప్రొటెక్ట్‌ అండ్‌ గ్రో అమెరికా యాక్ట్‌’ పేరుతో రూపొందించిన కొత్త బిల్లులో హెచ్‌ 1-బి వీసా దుర్వినియోగాన్ని అడ్డుకునే ఉద్దేశంతో ప్రవేశపెట్టినట్లు కాంగ్రెస్‌ సభ్యులు చెబుతున్నారు. 
* డిస్నీ, సోకాల్‌ ఎడిసన్‌, మరికొన్ని ఇతర కంపెనీలు వీసా సదుపాయాన్ని దుర్వినియోగం చేసినట్లు వచ్చిన ఆరోపణలను వారు ప్రస్తావిస్తున్నారు. 
* అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే లభించేలా ప్రస్తుత బిల్లులో మార్పులు ప్రతిపాదించారు. ఇవి అమల్లోకి వస్తే అక్కడి కంపెనీలు విదేశీయులకు ఉద్యోగాలు ఇవ్వటం కష్టంగా మారుతుంది. 
* హెచ్‌ 1-బి వీసా ఉన్న వారికి కనీస వార్షిక వేతనాన్ని 60,000 డాలర్ల నుంచి 100,000 డాలర్లకు పెంచాలనేది ప్రతిపాదిత మార్పుల్లో ప్రధానమైనది. అలాగే ‘మాస్టర్స్‌ డిగ్రీ కోటా’ తీసివేయాలని ప్రతిపాదించారు. దీనివల్ల విదేశాల నుంచి వచ్చిన వారికి కూడా అమెరికన్లతో సమానంగా జీతభత్యాలు, అర్హత నిబంధనలు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో అమెరికన్లకే ఉద్యోగాలు ఇచ్చేందుకు స్థానిక కంపెనీలు మొగ్గుచూపుతాయని భావిస్తున్నారు.

అమెరికాకు కూడా నష్టమే!
హెచ్‌ 1-బి వీసా కార్యక్రమాన్ని అమెరికా ప్రభుత్వం ఇతర దేశాల మీద ప్రేమతో నిర్వహించటం లేదు. అత్యాధునిక శాస్త్ర- సాంకేతిక నిపుణులను ఇతర దేశాల నుంచి ఆకర్షించటమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. దీనివల్ల పలు దేశాలు మేథో వలస (బ్రెయిన్‌ డ్రెయిన్‌) సమస్యను కూడా ఎదుర్కొంటున్నాయి. అదే సమయంలో అమెరికా, ఇతర దేశాల నుంచి నిపుణులను (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమ్యాటిక్స్‌ - స్టెమ్‌ స్కిల్స్‌) ఎందరినో తమ దేశానికి రప్పించుకుంటోంది. వీరిలో పలువురు శాశ్వతంగా అక్కడే స్థిరపడి అమెరికా ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారు. వీసాలను కట్టడి చేసి నిపుణుల రాకను అడ్డుకుంటే అది దీర్ఘకాలంలో అమెరికాకే నష్టం చేస్తుందనేది మరికొందరి వాదన.
ఉన్న ఉద్యోగాలకూ ఎసరు!
వీసా ఆంక్షలు అమల్లోకి వస్తే ఇక్కడి ఐటీ కంపెనీలు కొత్త ప్రాజెక్టులు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల కొత్తగా ఐటీ నిపుణులకు ఉద్యోగాలు దొరకటం కష్టం అవుతుంది. మనదేశంలో ప్రధానంగా బెంగళూరు, ముంబయి- పుణె, దిల్లీ, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో ఐటీ రంగం కేంద్రీకృతమై ఉంది. దేశవ్యాప్తంగా దాదాపు 30 లక్షలమంది ఈ రంగంలో పనిచేస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే 3 లక్షలమంది ఉంటారు. అమెరికాలో పరిణామాలను పరిగణలోకి తీసుకుంటే కొత్త ఉద్యోగాలు లభించకపోవటంతో పాటు ఉన్న ఉద్యోగాలు సైతం కొంతమేరకు కోల్పోయే పరిస్థితి వస్తుందని నిపుణులు అంటున్నారు.
ఐటీయేతర నిపుణులకూ సమస్యే
హెచ్‌ 1-బి వీసా నిబంధనల్లో మార్పులు తీసుకువచ్చేందుకు అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు చేస్తున్న ప్రయత్నాలు సఫలికృతం అయితే.. అది కేవలం ఐటీ నిపుణులకే కాదు.. ఇతర రంగాల నిపుణులకూ ఇబ్బందికరం కానుంది.

‘అమెరికాలో హెచ్‌ 1-బి వీసాలతో పనిచేసే నిపుణుల్లో ఆర్థిక సలహాదారులు, టీచర్లు, ఆర్టిస్టులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది.. ఇలా రకరకాల వృత్తులవారు ఉంటారు. వీసా నిబంధనలు మారితే వారందరికీ కష్టకాలం తప్పనట్లే’ అని ఇమిగ్రేషన్‌ వ్యవహారాల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హెచ్‌ 1-బి వీసాతో పనిచేసే వారికి కనీస వార్షిక వేతనాన్ని 1,00,000 డాలర్లకు పెంచాలని ప్రతిపాదిస్తున్నారు. ఐటీ నిపుణుల విషయంలో ఈ నిబంధన ఇబ్బంది కాకపోవచ్చు. కానీ టీచర్లు, నర్సులు.. వంటివారికి ప్రస్తుతం అక్కడ లభించే వార్షిక వేతనం ఎంతో తక్కువ, వారికి లక్ష డాలర్ల వేతనం అనేది కలలోని మాట, అటువంటి వారందరికీ అమెరికా దారులు మూసుకుపోతాయని సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చిన టీచర్లు ఎంతోమంది అమెరికాలో స్కూళ్లు, కాలేజీల్లో పనిచేస్తున్నారు. 
ప్రత్యామ్నాయం ఉందా?  
నిబంధనలు మారి హెచ్‌ 1-బి వీసా పొందటం కష్టమైన పక్షంలో ఎల్‌ 1, ఒ 1, ఈబీ 5 వీసాలు పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కళలు, సంగీతం, విద్య, సైన్స్‌, క్రీడల్లో నిష్టాతులైన వారు ఓ 1 వీసా పొంది అమెరికాలో అడుగుపెట్టవచ్చు. ఇతర దేశాలకు చెందిన కంపెనీలు అమెరికాలోని తమ కార్యాలయాలు, అనుబంధ కంపెనీలకు సిబ్బందిని పంపాలనుకుంటే ఎల్‌ 1 వీసా సౌకర్యం ఉంటుంది. అమెరికాలో 10 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు, అక్కడి వారికి ఉద్యోగాలు కల్పించటానికి సిద్ధమయ్యే వ్యాపారస్తులకు ఈబీ 5 వీసా తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ వీసాల అర్హత నిబంధనలను కొంచెం కఠినంగా ఉంటాయి.

భారతీయ కంపెనీలకు కనా కష్టం 
10ts-story1c.jpg
ప్రతిపాదిత బిల్లును అమెరికా కాంగ్రెస్‌, అధ్యక్షుడు ఆమోదిస్తే భారతీయ నిపుణులకు హెచ్‌ 1-బి వీసాలు లభించటం కష్టసాధ్యం. ప్రస్తుతం మనదేశానికి చెందిన ఐటీ కంపెనీలు అమెరికా కంపెనీల నుంచి పెద్దఎత్తున ఐటీ ప్రాజెక్టులు సంపాదిస్తున్నాయి. వీటికి సంబంధించి తమ నిపుణులను హెచ్‌ 1-బి వీసాలపై అమెరికా పంపుతాయి. ఆయా ప్రాజెక్టులకు అమలు చేయటానికి పెద్ద సంఖ్యలో వీసాలు కావలసి వస్తుంది. నిబంధనలు మారితే నిపుణులను పంపటం కష్టసాధ్యమై కొత్త ప్రాజెక్టులు తీసుకోవటం వీలుకాకపోవచ్చు. ఏటా లక్షమంది హెచ్‌ 1 - బి వీసాలతో అమెరికాలో అడుగుపెడుతూ ఉంటారు. ఇందులో మనదేశానికి చెందిన వారే ఎక్కువ. ఇక్కడి ఐటీ కంపెనీలు నిర్వహించే విదేశీ ప్రాజెక్టుల్లో అమెరికా వాటా ఎంతో అధికం. వీసా నిబంధనల్లో మార్పులు వచ్చి వీసాలు పొందటం కష్టమయ్యే పరిస్థితుల్లో భారతీయ ఐటీ కంపెనీలు ఇతర దేశాల వైపు చూడాల్సి వస్తుంది. కానీ ఇతర దేశాల్లో అమెరికాలో ఉన్నంత అతిపెద్ద ఐటీ సేవల మార్కెట్‌ లేకపోవడం గమనార్హం. 
- ఈనాడు ప్రత్యేక విభాగం

  
  

Link to comment
Share on other sites

3 minutes ago, alpachinao said:

AG ga sessions thatha control immi chattalu thella valaki anukulam ga chattam chesthadu ani agraharam lo talk

@~`

Link to comment
Share on other sites

10 hours ago, perugu_vada said:

Asalu future lo em chestado trump thaatha telidu kani, india lo news channels ki mathram thaatha fone chesi chepinatlu telecast chesestunaru

indian media comedy teliyanidemundi bro %$#$

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...