Jump to content

రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో సంక్రాంతి రద్దీ


JANASENA

Recommended Posts

 11brk157b.jpg

హైదరాబాద్‌: సంక్రాంతి పండుగకు తమ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో అయితే రైళ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సరిపడా సీట్లు లేకపోవడంతో ప్రయాణికులు ఫుట్‌బోర్డులపైనే నిలబడి ప్రయాణం చేస్తున్నారు. సరిపడా రైళ్లు లేకపోవడంపట్ల వారంతా అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మూడు నెలల క్రితమే తాము వెయిటింగ్‌ జాబితాలో రిజర్వేషన్లు చేసుకున్నప్పటికీ సీట్లు దక్కడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పిల్లలతో తమ సొంతూళ్లకు ఎలా వెళ్లాలని వారు ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లోని పలు బస్టాండ్లన్నీ సందడిగా మారాయి. సంక్రాంతి పండుగకు నగరం నుంచి బయల్దేరే ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండటంతో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ 2400పైగా ప్రత్యేక బస్సు సర్వీసుల్ని నడుపుతోంది. నగర శివారు ప్రాంతాలైన శంషాబాద్‌, ఆరాంగఢ్‌, ఎల్బీనగర్‌, ఈసీఐఎల్‌ క్రాస్‌రోడ్స్‌, తార్నాక, తదితర చోట్ల నుంచి సైతం బస్సుల్ని నడుపుతున్నారు. ప్రయాణికుల్ని సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయితే రేపటి వరకు ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే సంక్రాంతి అనంతరం తిరిగి వచ్చే ప్రయాణికుల కోసం ఆయా ప్రాంతీయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

11brk157a.jpg 
11brk157c.jpg

11brk157d.jpg 
11brk157f.jpg

11brk157e.jpg

            

                        
Link to comment
Share on other sites

3 minutes ago, perugu_vada said:

Prices full penchestaru ga private buses vi e time lo ;) veetini regulate cheyali fixed price ani peti

adhe hand tho flight tickets kuda seyamani sepu vuncle

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...