Jump to content

శ్రీలంక పర్యటనలో అరుదైన గౌరవం దక్కించుకున్న చంద్రబాబు!


trent

Recommended Posts

ఒక ముఖ్యమంత్రికి ఓ దేశాధ్యక్షుడు స్వాగతం పలకటమా? ముఖ్యమంత్రి చేసే ప్రసంగానికి దేశాధ్యక్షుడితోపాటు ప్రధానమంత్రి, ఆ దేశ ప్రతిపక్షనేత హాజరు కావడమా? సీఎం ప్రసంగం పూర్తయిన వెంటనే తమతమ స్ధానాల్లోంచి లేచి నిలబడి హర్షధ్వానాలు చేయడమా? ఇలాంటి అపురూప దృశ్యాలు చూడాల్సిందే కానీ, వర్ణించడానికి మాటలు చాలవు. ఇటువంటి అరుదైన గౌరవం ఎప్పుడు, ఎవరికి దక్కిందో ఈ స్టోరీ చూస్తే మీకే తెలుస్తుంది.
 
 
 
శ్రీలంక..! మ్యాప్‌లో భారతదేశం కింద కనిపించే ఓ చిన్న దేశం. ఒకప్పుడు ఎల్‌టీటీఈ తీవ్రవాదంతో అట్టుడికిన దేశం. తీవ్రవాదాన్ని తుదముట్టించిన తర్వాత శ్రీలంక ఇప్పుడు ప్రజాస్వామ్య పాలన అనే రాగాన్ని ఆలపిస్తోంది. ఆ దేశాధ్యక్షుడుగా మైత్రీపాల సిరిసేన బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో పేదరికాన్ని రూపుమాపే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. పేదరికాన్ని రూపుమాపేందుకు వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టి ఆర్ధిక స్వావలంభన కోసం కృషిచేసిన వ్యక్తులకు కోసం అన్వేషించారు. ముఖ్యంగా మహిళలకి ఆర్ధిక సమృద్ధి, స్వయం ఉపాధి వంటి అంశాలపై శిక్షణ ఇచ్చి, వారిని పొదుపు సంఘాలుగా ఏర్పాటుచేసింది ఎవరనే అంశంపై నిశిత పరిశీలన చేశారు. శ్రీలంక అధికార యంత్రాంగం రూపొందించిన నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు అందులో ప్రథమస్థానంలో ఉంది. గతంలో ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రపంచబ్యాంక్ సాయంతో పేదరికాన్ని రూపుమాపేందుకు చంద్రబాబు వెలుగు ప్రాజెక్ట్‌కి శ్రీకారంచుట్టారు. ఇందులో భాగంగా డ్వాక్రా సంఘాలను ఏర్పాటుచేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ సంఘాలను కొనసాగించక తప్పలేదు. తిరిగి ఇప్పుడు ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు మళ్ళీ డ్వాక్రా సంఘాలను పరిపుష్టం చేయటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో శ్రీలంక అధికారులు పేదరిక నిర్మూలన అంశంపై మాట్లాడేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని తమ దేశానికి ఆహ్వానించారు.
 
 
 
ఇదంతా ఒక ఎత్తయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో శ్రీలంక వెళ్లిన చంద్రబాబుకి అక్కడ అపూర్వమైన స్వాగతం లభించింది. ఆయనను స్వాగతించేందుకు శ్రీలంకకు చెందిన నలుగురు కేంద్ర మంత్రులు కొలంబో విమానాశ్రయానికి వచ్చారు. ఈ పరిణామం చూసి ఏపీ నుంచి వెళ్ళిన ప్రతినిధి బృందం ఆశ్చర్యపోయింది. ట్రాఫిక్ మొత్తాన్ని నిలిపివేసి, ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను తీసుకువెళ్ళారు. పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు బృందాన్ని మైత్రీపాల సిరిసేన తన ఇంటికి విందుకు ఆహ్వానించారు. ఆ విందులో ప్రధాని విక్రమసింగే, క్యాబినెట్ సహచరులు, ఆరు ప్రావిన్స్‌ల ముఖ్యమంత్రులు, త్రివిధ దళాధిపతులు, శ్రీలంక ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వారందరినీ అధ్యక్షుడే స్వయంగా చంద్రబాబుకు పరిచయం చేశారు. శ్రీలంక అధ్యక్షుడు తన పట్ల ప్రదర్శించిన గౌరవాదరాలను చూసి చంద్రబాబు మురిసిపోయారు. చంద్రబాబు వెంట వెళ్ళిన ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అయితే ఉబ్బితబ్బిబ్బయ్యారు.
 
 
 
మరుసటి రోజు "ప్రాస్పరిటీ ఫర్ ఆల్'' అనే అంశంపై సీఎం చంద్రబాబు గంటా పది నిముషాల సేపు ప్రసంగించారు. ఆ సమావేశానికి శ్రీలంక అధ్యక్షుడు, ప్రధానితోపాటు శ్రీలంక ప్రతిపక్షనేత చంద్రికా కుమారతుంగ, అన్ని ప్రావిన్సుల గవర్నర్లు, ముఖ్యమంత్రులతోపాటు క్యాబినెట్ మంత్రులు హాజరయ్యారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో సాగిన చంద్రబాబు ప్రసంగాన్ని విని ఆ సమావేశంలో ఉన్న మూడు వేలమంది హర్షధ్వానాలు చేశారు. కష్టాలు వచ్చాయని బాధపడే కంటే సానుకూల దృక్పథంతో వ్యవహరించి ముందుకు వెళ్ళాలని బాబు వారికి సూచించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి కూడా అనేక ఇబ్బందులు వచ్చాయనీ, అయినా అన్నింటిని అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతున్నామనీ ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. దేశం సంపద అందరికీ దక్కాలనీ, దేశ సమగ్రత, సంపదను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందనీ సూచించారు. ఇలా ఆద్యంతం చంద్రబాబు ప్రసంగం స్ఫూర్తిదాయకంగా సాగింది.
 
 
 
శ్రీలంక పర్యటన సందర్భంగా ఏపీ సీఎంని అక్కడి పాలకులు మరోరకంగా కూడా గౌరవించారు. ఆ దేశంలో యూనివర్సిటీలు, మెగా పోలీస్‌, హోటళ్లు, పర్యాటక, గృహనిర్మాణ రంగాల్లో శ్రీలంక పశ్చిమప్రాంత అభివృద్ధిశాఖ అమలుచేస్తున్న ఉత్తమ అంశాలను పరిశీలించేందుకు రెండు ప్రత్యేక హెలికాఫ్టర్‌లను ఏర్పాటుచేశారు. వాటిలో చంద్రబాబు బృందం ఆయా ప్రాంతాలకు వెళ్లి జరుగుతున్న పథకాలను నిశితంగా పరిశీలించింది. ఇదండీ శ్రీలంకలో ఏపీ సీఎం టూర్‌లో ఇంట్రస్టింగ్‌ కోణం..!
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...