Jump to content

AP Development Updates - విశాఖలో హైస్పీడు ఇంజన్లు, రైలు పెట్టెల కర్మాగారం


sarkaar

Recommended Posts

vizag-rail-factory-16012017.jpg

 

అమెరికా, రష్యా సహ 13 దేశాల్లో ఉత్పత్తి కేంద్రాలు కలిగివున్న ‘ప్రతిష్ఠాత్మక స్టాడ్లర్ రైల్ మేనేజ్‌మెంట్ ఎ.జి’ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో రైలింజన్లు, రైలు పెట్టెల తయారీ కర్మాగారాన్ని ప్రారంభించేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే పశ్చిమ బంగలోని కాంచరపారా (Kancharapara) లో ఉత్పత్తి కర్మాగారాన్ని కలిగి ఉన్న ‘స్టాడ్లర్ రైల్’ కంపెనీ తన తదుపరి యూనిట్‌ను విశాఖ జిల్లాలో నెలకొల్పాలని నిశ్చయించింది.

హైస్పీడ్, మెట్రో, ఇంటర్ సిటీ రైలు బోగీల తయారీలో 75 ఏళ్ల అనుభవం ఉన్న ప్రపంచస్థాయి అగ్రశ్రేణి కంపెనీగా ఉన్న ‘స్టాడ్లర్’ తన కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించగా ఆ సంస్థ ప్రతినిధులు తమకు సమ్మతమేనని, అనుకూలాంశాలపై అధ్యయనం చేస్తున్నామని వివరించారు. దావోస్‌లో మంగళవారం నుంచి జరగనున్న ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సుకు వెళుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూరిచ్‌లో సోమవారం ఒక రోజు పర్యటనకు ఆగారు. అనేక విశ్వశ్రేణి కంపెనీల ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలతో బిజీగా గడిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ద్వైపాక్షిక చర్చల్లో ‘స్టాడ్లర్ రైల్ మేనేజ్‌మెంట్ ఏజీ’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పీటర్ జెనెల్టన్ (Peter Jenelten), బిజినెస్ ఎనలిస్ట్ స్టెఫాన్ రుటిషాసర్ (Stefan Rutishauser), ప్రాజెక్ట్ మేనేజర్ థామస్ జ్వీఫెల్ (Thomas Zweifel) లు పాల్గొన్నారు.

కర్మాగార సందర్శనకు చంద్రబాబుకు ఆహ్వానం
స్టాడ్లర్ రైలు బోగీలు, ఇంజన్ల తయారీ కర్మాగారాన్ని సందర్శించాల్సిందిగా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పీటర్ జెనెల్టన్ (Peter Jenelten) ముఖ్యమంత్రిని కోరగా ఆయన అంగీకారం తెలిపారు.

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భారత్ అవసరాలు తీర్చగల హైస్పీడ్ రైల్ బోగీలను తాము అందించగలమని ఆయన ముఖ్యమంత్రితో అన్నారు. తమది 2.2 బిలియన్ డాలర్ల టర్నోవర్‌తో 12 దేశాలలో విస్తరించిన అతిపెద్ద రైలు ఇంజెన్లు, రైలు పెట్టెల ఉత్పత్తి కర్మాగారమని వివరించారు.
భారత్, అమెరికాలలో విస్తరణకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. భారత్‌ను తాము కేవలం ఒక మంచి మార్కెట్‌గా మాత్రమే చూడటం లేదని, అక్కడ వేలాదిమందికి ఉపాధికల్పించే ఉత్పత్తియూనిట్లను ప్రారంభించాలని నిశ్చయించామని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పీటర్ జెనెల్టన్ (Peter Jenelten) ముఖ్యమంత్రితో అన్నారు.

భారత్‌ను రైలింజన్లు, రైలు బోగీల తయారీలో ఆగ్నేయాసియాకు హబ్‌గా రూపొందించాలన్న ప్రణాళికలున్నాయని పీటర్ జెనెల్టన్ చెప్పారు. అల్యూమినియంతో రైలు బోగీలు తయారు చేయటం తమ ప్రత్కేకత అని, ఇందుకు అవసరమైన ప్రత్యేక సాంకేతిక నైపుణ్యాలు తమకు ఉన్నాయని పీటర్ వివరించారు. తమకు పశ్చిమ బెంగాల్ లోని కాంచరపారా(Kancharapara) లో ఇప్పటికే ఉత్పత్తికేంద్రం ఉందని, విశాఖలో అన్ని విడిభాగాల తయారీకి మరో ఉత్పాదక కేంద్రాన్ని నెలకొల్పుతామన్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా తయారీ, ఆకృతుల రూపకల్పన, ఉత్పత్తి, సరఫరాల గొలుసుకట్టుగా ఉండాలన్నదే తమ ప్రణాళిక అని వివరించారు.

 

సముద్రానికి సామీప్యత, భూ లభ్యత, రవాణా సదుపాయాలు, సాంకేతిక నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, అనుకూలమైన పన్ను విధానాలు కలిగి ఉండే చోట యూనిట్ నెలకొల్పాలని ఆలోచిస్తున్నట్లు పీటర్ ముఖ్యమంత్రితో అన్నారు. విశాఖలో రైలు ఇంజన్లు, బోగీల ఉత్పాదక కేంద్రం నెలకొల్పితే 3,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కోచ్, లోకోమోటివ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఓడరేవు దగ్గరగా ఉండాలని, ఇందుకు విశాఖ తమకు అనువైనదిగా భావిస్తున్నామని చెప్పారు. విశాఖలో ఉత్పాదక కేంద్రం స్థాపిస్తే ఎగుమతి, దిగుమతులకు అనువుగా ఉంటుందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ నవ్యాంధ్రప్రదేశ్‌లో తాము రెండు నగరాల్లో మెట్రోరైలు వ్యవస్థలను నెలకొల్పుతామన్నారు. ప్రపంచస్థాయి హైస్పీడు రైళ్లను ప్రవేశపెడతామని చెప్పారు.

రైల్వే మంత్రి కూడా తమ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కారణంగా ఉత్పాదక కేంద్రం నెలకొల్పటానికి సానుకూలాంశాలే అధికంగా ఉన్నాయని, మౌలిక సదుపాయాలను తాము కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. తమ రాష్ట్రం దేశంలో సుదీర్ఘ సముద్రతీరం కలిగిన రెండో రాష్ట్రమని, లోతైన సముద్రం దగ్గర నెలకొల్పిన ఓడరేవులున్నాయని తెలిపారు. విద్యుత్తు, నీరు, మౌలిక సదుపాయాల కల్పనలో ఆంధ్రప్రదేశ్‌కు తిరుగులేదని అన్నారు. రోడ్డు, విమాన రవాణా వ్యవస్థలతో ఆంధ్రప్రదేశ్ అనుసంధానమై ఉందని వివరించారు.

దేశానికే గుండెకాయలా తమ రాష్ట్రం ఉందని, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలకు వెళ్లడానికి అనువుగా అనుసంధాన వ్యవస్థ ఉందని చంద్రబాబు తెలిపారు. ప్రపంచబ్యాంక్ ఇచ్చిన ర్యాంకింగ్స్ ప్రకారం దేశంలో వ్యాపార అనుకూలతలున్న నెంబర్-1 రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి స్టాడ్లర్ కంపెనీ ప్రతినిధులకు చెప్పారు. తమ రాష్ట్రం 10.99 శాతం వృద్ధిరేటు సాధించిందని, ఈ అర్ధ వార్షిక సంవత్సరంలో ఏపీ 12% వృద్ధిరేటు సాధించిందని, పరిశ్రమల ఏర్పాటుకు తగినంత భూమి బ్యాంకు ఏపీకి ఉందని చంద్రబాబు వివరించారు. తమ రాష్ట్రంలోనైపుణ్యం కలిగిన మానవ వనరులకు కొదవలేదన్నారు.

ఇదిలా ఉంటే స్టాడ్లర్ రైల్ మేనేజిమెంట్ ఏజీ 1942లో ఎర్నెస్ట్ స్టాడ్లర్ ‘Ingeneieurburo Stadler Engineering’ కంపెనీ పేరుతో ప్రారంభించారు. కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని తూర్పు స్విట్జర్లెండ్‌లోని బుస్నాంగ్ ( Bussnang) లో నెలకొల్పారు. అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లెండ్, జర్మనీ, స్పెయిన్, పోలాండ్, హంగరీ, జెక్ రిపబ్లిక్, ఇటలీ, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, బైలారస్, అల్జీరియా దేశాల్లో స్టాడ్లర్ కంపెనీకి ఉత్పత్తి కేంద్రాలున్నాయి. తాజాగా ఈ సంస్థ అమెరికా, భారత్‌లతో విస్తరణకు నిశ్చయించింది.

ప్రయాణీకుల రైళ్లు, రైళ్లకు సంబంధించిన విడిభాగాలను స్టాడ్లర్ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. హైస్పీడ్, ఇంటర్‌సిటీ, భూగర్భరైళ్లు,ట్రాములు, ట్రామ్ రైళ్ల తయారీలో స్టాడ్లర్ రైల్ కంపెనీకి సుదీర్ఘ అనుభవం ఉంది. ఇంతే కాకుండా స్టాడ్లర్ రైల్ కంపెనీ మెయిన్ లైన్ డ్యూయల్ మోడ్ లోకోమోటివ్‌ల తయారీలో కూడా అనుభవం గడించింది.

షంటింగ్ లోకో ఇంజన్లు, ప్యాసింజర్ రైలు బోగీలు, ఐరోపాలో అత్యంత శక్తిమంతమైన డీజిల్ ఎలక్ర్టిక్ లోకో ఇంజన్లను ఈ సంస్థ తయారు చేస్తోంది. ర్యాక్ అండ్ పినియన్ (rack and pinion) రైలు స్టీరింగ్ తయారీలో స్టాడ్లర్ సంస్థ ప్రపంచ శ్రేణి సంస్థగా పేరుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు బృందంలో ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు డా. పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి జి. సాయిప్రసాద్, ఇంధనవనరులు, ఐ&ఐ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్, ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈఓ జాస్తి కృష్ణకిశోర్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ అరోకియారాజ్ తదితరులు ఉన్నారు.

Link to comment
Share on other sites

Swiss firm Stadler to set up rail coach unit in Vizag, says Andhra Pradesh CMO

 

Switzerland-headquartered Stadler Rail AG has come forward to set up a locomotive and rail coach manufacturing unit in Visakhapatnam district, the Andhra Pradesh Chief Minister's Office today said.

Switzerland-headquartered Stadler Rail AG has come forward to set up a locomotive and rail coach manufacturing unit in Visakhapatnam district, the Andhra Pradesh Chief Minister’s Office today said. Chief Minister Chandrababu Naidu, who is on a visit to Switzerland, met Stadler executives in Zurich.

The CMO, in a release on Chandrababu’s visit to Zurich, however, came out with a misleading statement that Stadler already has a manufacturing unit in Kanchrapara, West Bengal and that the proposed Visakhapatnam unit would be its second in India.

“The Chief Minister, during his talks with Stadler executives, invited them to set up their manufacturing unit in AP and they consented to it,” the release claimed.

It quoted Stadler Executive Vice-President Peter Jenelten as telling the Chief Minister that they already have a manufacturing unit in West Bengal and another one would be set up in Visakhapatnam for manufacturing spare parts.

“We have plans to expand (our operations) in India and the USA. We plan to make India the southeast Asian hub for manufacturing rail coaches and locomotives,” the release quoted Peter as telling Chandrababu.

Stadler is an established company in manufacture of rail coaches and locomotives but it doesn’t have any unit in India as claimed by the CMO. Even the company’s website does not contain any mention of its Indian operations so far.

It is one of the major global players that evinced interest in the manufacture of EMU/MEMU coaches at the proposed Kanchrapara facility under the ambitious Rs 20,000 crore joint venture project of the Railways.

Railways is expected to award the contract only in May and Stadler is not the only player in contention.

 

 

Link to comment
Share on other sites

Actually to say that Stadler doesn't have operations as yet in India but mentioned as WB is having a unit already!!!!!

"It is one of the major global players that evinced interest in the manufacture of EMU/MEMU coaches at the proposed Kanchrapara facility under the ambitious Rs 20,000 crore joint venture project of the Railways.

Railways is expected to award the contract only in May and Stadler is not the only player in contention"

Also thing to note is that main unit may come up in WB & Spare parts unit in Vizag if Stadler gets project in WB..... More over these projects are under look out of Indian Railways & states can't take decision on this...

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...