Jump to content

రాహుల్ చొక్కా చూసి ట్విటర్ నవ్వింది!


JANASENA

Recommended Posts

18brk-rahul1.jpg

దిల్లీ: కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై తరచూ ట్విటర్‌లో జోకులు పేలుతుంటాయి. తాజాగా మరోసారి ఆయన మాటలపై నెటిజన్లు తెగ ట్వీట్లు చేస్తున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్‌లో ఓ సమావేశంలో పాల్గొని ప్రసంగించిన రాహుల్‌ తను వేసుకున్న కుర్తా చిరిగిందని.. జేబులో చెయ్యి పెట్టి మరీ చిరుగును సభికులకు చూపించారు. సభలో మాట్లాడుతూ ‘నా కుర్తా జేబు చిరిగిపోయింది. కానీ ఇది నాకు పెద్ద విషయం కాదు. కానీ మీరు ఎప్పుడైనా మోదీజీ చిరిగిన బట్టలు వేసుకోవడం చూశారా. ఆయన పేదల ప్రతినిధి అని చెప్తుంటారు కానీ పేదలపై రాజకీయాలు చేస్తున్నారు’ అని అన్నారు.

ఇలాంటి మాటలు దొరికితే నెటిజన్లు వూరుకుంటారా. ఇక ఆయన మాటలపై జోకులే జోకులు.

‘కొత్త కుర్తా కొనుక్కోలేరు కానీ విదేశాల్లో సెలవులు గడపగలరా? డ్రామాలు ఆపండి’

‘మన ప్రియమైన రాహుల్‌గాంధీకి సరైన కుర్తా లేదు, పాతది వేసుకున్నారు. రూపాయి విరాళం ఇవ్వండి’

‘చార్టర్డ్‌ ప్లేన్‌లో వెళ్లేప్పుడు కుర్తా చిరిగిందా సర్‌?’

‘మనల్ని ఎంటర్‌టైన్‌ చెయ్యడానికి రాహుల్‌ హాలిడేస్‌ నుంచి వచ్చేశారు. వి లవ్‌ యు, వి మిస్‌ యు’

‘నేను పేదవాడిని అని చెప్పుకోవడం అసలు ఎలాంటి అబద్ధం, ఈ మనిషి స్టుపిడిటీకి హద్దే లేదు’

‘విదేశాల్లో చాలా రోజులు సెలవులు గడిపి వచ్చి వెంటనే మోదీ పేదలను పట్టించుకోవట్లేదు అని విమర్శలు మొదలుపెట్టారా?’

.. అంటూ రకరకాల వ్యాఖ్యలతో ట్విటర్‌ హోరెత్తుతోంది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...