Jump to content

ROFL..


Widow_Queen

Recommended Posts

 
 
సిక్స్‌ ప్యాక్‌లు మన సంస్కృతి కాదు.... 
మోక్షజ్ఞతో ‘ఆదిత్య 999’ 
త్వరలో దర్శకత్వం చేస్తా 
18tollywood7a.jpg

జానపద చిత్రం కావాలా... భైరవద్వీపం ఉంది! సైన్స్‌ ఫిక్షన్‌ వైపు మనసు మళ్లిందా?... ఆదిత్య 369 చూడండి. ఫ్యాక్షన్‌ కథలకు కేరాఫ్‌ అడ్రస్‌... సమరసింహారెడ్డి! పౌరాణికం, జానపదం, సాంఘికం, సెంటిమెంట్‌, డ్రామా - ఇలా నందమూరి బాలకృష్ణ ఏ జోనరూ వదల్లేదు. మిగిలిపోయిన చారిత్రక గాథనీ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తో పూర్తి చేశారు బాలకృష్ణ. అలా వందో సినిమాతో ఆయన సినీ ప్రయాణం సంపూర్ణమైనట్టే! సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో నందమూరి బాలకృష్ణ విలేకరులతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే...

‘‘ఈ చిత్రానికి వస్తున్న స్పందన చూస్తుంటే సంతోషంగా ఉంది. చాలా కాలంగా సినిమాలు చూడని వాళ్లూ ఇప్పుడు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ని చూడ్డానికి థియేటర్లకు వస్తున్నారు. ఇది మా విజయం కాదు.. తెలుగువాళ్ల విజయం. తెలుగువాళ్లే కాదు... ఇది భారతీయులందరూ చూడాల్సిన సినిమా. ఎందుకంటే శాతకర్ణి తెలుగుజాతికే కాదు, భారతదేశానికే చక్రవర్తి. అందుకే ఇతర భాషల్లో ఈ చిత్రాన్ని సబ్‌ టైటిల్స్‌తో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’

అభిరుచులు కలిశాయి: ‘‘ఈ సినిమా సంక్రాంతికి విడుదలైంది. ఇది నా వందో చిత్రం. తెలుగువాళ్లు చూడని కథ. అన్ని విధాలుగా ఈ సినిమాకి కలిసొచ్చింది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తానని క్రిష్‌ నాతో ముందే చెప్పారు. సమన్వయంతో పనిచేశాం. కొన్ని షాట్లు నేను చెప్పి చేయించుకొన్నా. ‘ఇక్కడ కెమెరా పెడితే బాగుంటుంది’ అనుకొనేలోగా క్రిష్‌ అలానే ఫ్రేమ్‌ ఫిక్స్‌ చేసేవాడు. మా అభిరుచులూ అంత బాగా కలిసిపోయాయి’’

కిరీటం పక్కన పెట్టి:‘‘నాన్నగారు శాతకర్ణి కథతో సినిమా చేద్దామనుకొన్నారు. అందుకు సంబంధించిన నోట్సు కూడా రాసుకొన్నారు. ఆయుధాలు ఎలా ఉండాలి? ఎలాంటి దుస్తులు ధరించాలి? అనే విషయంలో క్షుణ్నంగా అధ్యయనం చేశారు. అవన్నీ నేనూ పరిశీలించా. ఈ సినిమాలో శాతకర్ణి కోసం ఓ కిరీటం తయారు చేయించాం. అయితే ఆ కాలం నాటికి కిరీటాలు ఇంకా రాలేదు. ఆ సంగతి తెలుసుకొని దాన్ని పక్కన పెట్టాం. ఏ భాష వాడాలి, ఏ మాండలికంలో మాట్లాడాలి? అనే విషయాల్లో చాలా కసరత్తులు చేశాం’’

నాన్నగారి స్కూలు: ‘‘సెట్‌కి వెళ్లే ముందు ప్రత్యేకంగా సిద్ధం అవ్వడం ఏమీ ఉండదు. మరీ పెద్ద పెద్ద డైలాగులు ఉన్నప్పుడు సీన్‌ పేపర్లు ముందే తీసుకొంటా. నాన్నగారు కూడా అదే చేసేవారు. నేనూ ఆ స్కూలు వాణ్నే కదా? ముందు పాత్రకి నన్ను నేను పరిచయం చేసుకొంటా. తొలి మూడు రోజులూ సెట్లో ఉన్న వాళ్లతో కలివిడిగా ఉంటా. దాంతో వాతావరణం తేలిక పడుతుంది. వేసుకొనే దుస్తుల్ని బట్టి, చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి, తోటి నటీనటుల్ని బట్టి్ట పాత్రలోకి త్వరగా లీనం అయిపోవచ్చు. ఒక్కోసారి ఆ పాత్రే మనల్ని ముందుకు నడిపిస్తుంటుంది. ‘..శాతకర్ణి’ అలాంటి పాత్రే’’

ఆ కథ ముట్టుకోను: ‘‘అన్ని రకాల జోనర్లలో సినిమాలు చేశా. భవిష్యత్తులో పౌరాణికాలూ చేస్తా. అప్పట్లో ‘నర్తనశాల’ చేయాల్సింది. సౌందర్య మరణంతో సాధ్యం కాలేదు. మళ్లీ ఆ కథ ముట్టుకోను. ఎవరి దగ్గరి నుంచైనా నేను నటనను రాబట్టుకోగలను. కానీ ఆహార్యం చాలా ముఖ్యం. పాత్రకు తగిన నటీనటులు దొరక్కపోతే అది పెద్ద తప్పు. కొన్ని పాత్రలు కొంతమందే చేయగలరు. మన కథకు తగ్గ నటీనటులు దొరక్కపోతే సినిమా చేయడం ఎందుకు? భవిష్యత్తులో దర్శకత్వం చేస్తా. ఓ సినిమా చేస్తున్నానంటే దానికి సంబంధించిన గ్రౌండ్‌ వర్క్‌ పకడ్బందీగా ఉండాలి. నేనే నోట్స్‌ రాసుకొంటుంటా. కొన్నిసార్లు దర్శకులకు కొన్ని సన్నివేశాలు చెప్పి ‘ఇప్పుడు దీనిపై కథ రాసుకొని రండి’ అంటుంటా. ‘అన్నీ మీరే చెప్పేశారు.. ఇక కథ రాసేదేముంది’ అంటుంటారు’’

ఒక్క డైలాగ్‌ తీస్తే..?:‘‘కొంతమంది మూడేసి గంటల సినిమాలు తీస్తుంటారు. ఆ తరవాత ఎడిటింగ్‌ రూమ్‌లో కట్‌ చేస్తుంటారు. ఇదంతా ఎందుకు? మేం ముందు ఎంత సినిమా అనుకొన్నామో.. అంతే తీశాం. ‘నర్తనశాల’కి నేను దర్శకత్వం చేస్తున్నప్పుడు ‘సార్‌.. ఈ మూడు పేజీల సీన్‌ అనవసరం అనిపిస్తోంది’ అని నా సహాయ దర్శకుడొకరు చెప్పారు. ‘ఆ సీన్‌ ఏదో నాక్కూడా చూపించకుండా చింపేయండి..’ అన్నాను. ఒక్క సీన్‌ కట్‌ చేసినంత మాత్రాన, ఒక్క డైలాగ్‌ లేకపోయినంత మాత్రాన ఆడే సినిమా ఆడకుండా ఉండదు’’

చొక్కా విప్పితే చూడరు: ‘‘నాకు కొన్ని కథలు సెట్‌ అవ్వవు. నేను రొమాన్స్‌ చేస్తే నప్పదు. చొక్కాలు విప్పి సిక్స్‌ప్యాక్‌ చేసినా చూడరు. అది మన సంస్కృతి కాదు. కొన్ని సినిమాలు కుటుంబంతో వెళ్లి చూసేందుకు బాగుంటాయి. కానీ అలాంటి కథ మనమూ చేయాలనుకోకూడదు. ‘దంగల్‌’, ‘సుల్తాన్‌’ అలాంటి సినిమాలే. మోక్షజ్ఞ కూడా తనదైన దారిలోనే వెళ్తాడు. తను ఎలాంటి కథలు చేయాలి అనేది ఇప్పుడే నిర్ణయించుకోకూడదు. ఓ సినిమా చేస్తే అప్పుడు అవగాహన వస్తుంది. ప్రస్తుతం నటనలో తర్ఫీదు తీసుకొంటున్నాడు. ఈ యేడాది తన ఎంట్రీ ఉంటుంది. ముహూర్తం ఏం అనుకోలేదు. నాకు ఎప్పుడు మూడ్‌ వస్తే అప్పుడు ‘కెమెరా ముందు నిలబడు’ అంటాను. మేమిద్దరం కలసి నటించాల్సివస్తే ‘ఆదిత్య 999’ అయితే బాగుంటుంది. అది తప్ప మా ఇద్దరికీ నప్పే కథలు లేవు. మల్టీస్టారర్‌ సినిమాలు చేస్తా. అది పౌరాణికం అయితే బాగుంటుంది’’

Link to comment
Share on other sites

mansion house 10gi taagi...diet lu cheyyataniki G baddakam vesi tuesday kaburlu cheptunna balio....

 

antey ippudu ethulu lothulu choodatam... nachithe kadupu cheseyyatam... intiki vachina vallani kalchi 10gatam mana sanskruthi sampradayala... mari maa nanna garu aa rojullooo....aaa...uuuu...ehe....@3$%

Link to comment
Share on other sites

Just now, punyavathi said:

Nslaves now Andaru workout apesi pottalu penchandi. Mansion house tagandi, boothulu nerchukondi

Andaru adey pani lo unnaru anukunta valla demi god cheppadu kada... okkadu kooda db lo kanipinchatla

Link to comment
Share on other sites

  • 1 year later...
On 1/18/2017 at 6:23 PM, Widow_Queen said:

mansion house 10gi taagi...diet lu cheyyataniki G baddakam vesi tuesday kaburlu cheptunna balio....

 

antey ippudu ethulu lothulu choodatam... nachithe kadupu cheseyyatam... intiki vachina vallani kalchi 10gatam mana sanskruthi sampradayala... mari maa nanna garu aa rojullooo....aaa...uuuu...ehe....@3$%

ROFL...ABBA DEBBA JABBA.. BALI GADU E JANMA LO KADU KADA MARO JANMA LO KUDA INTHE..Related image

Link to comment
Share on other sites

On 1/18/2017 at 9:23 PM, Widow_Queen said:

mansion house 10gi taagi...diet lu cheyyataniki G baddakam vesi tuesday kaburlu cheptunna balio....

 

antey ippudu ethulu lothulu choodatam... nachithe kadupu cheseyyatam... intiki vachina vallani kalchi 10gatam mana sanskruthi sampradayala... mari maa nanna garu aa rojullooo....aaa...uuuu...ehe....@3$%

@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...