Jump to content

రూ.1200 కోట్ల విలువైన ‘పొరపాటు’


JANASENA

Recommended Posts

19brk97a.jpg

మన దేశంలో పెద్దనోట్ల రద్దు తర్వాత పలు ఆశ్చర్యపర్చే సంఘటనలు జరిగాయి. కొన్ని చోట్ల పెద్దనోట్లను కాల్చేస్తే.. కొన్నిచోట్ల చించేసి చెత్తకుప్పల్లో పారేశారు. మరికొన్ని చోట్ల పేదల బ్యాంకు అకౌంట్లలో కోట్ల రూపాయలు డిపాజిట్‌ అయ్యాయి. అయితే ఇలాంటి సంఘటనే చైనాలో జరిగింది. ఓ వ్యక్తి బ్యాంకు అకౌంట్‌లో ఏకంగా రూ. 1200కోట్లు డిపాజిట్‌ అయ్యాయి.

చైనాలోని వాంగ్‌చెంగ్‌కి చెందిన ఓ వ్యక్తి స్థానిక రూరల్‌ కమర్షియల్‌ బ్యాంక్‌లో కొత్తగా ఖాతా తెరిచేందుకు వెళ్లాడు. తర్వాత తన ఖాతా చూసుకొని షాకయ్యాడు. ఖాతా తెరిచిన కొద్దిసేపటికే అతని అకౌంట్‌లో 1.2బిలియన్‌ యాన్‌(రూ.1200కోట్లు) జమ అయ్యింది. అయితే ఈ విషయం అతను బయటకు వెళ్లిపోయాక బ్యాంకు అధికారులు గుర్తించారు.

ఖాతాదారుడు డిపాజిట్‌ చేసే మొత్తం వివరాలు తెలిపే చోట బ్యాంక్‌ ఉద్యోగి పొరపాటుగా 10 అంకెల ఖాతా నంబరును నింపాడు. దీంతో ఖాతా నంబరే డబ్బుగా మారి 1.2బిలియన్‌ యాన్‌ (సుమారు రూ. 1200 కోట్లు) డిపాజిట్‌ అయింది. పొరపాటు తెలుసుకున్న వెంటనే బ్యాంకు అధికారులు ఆ ఖాతాదారుడిని పిలిపించారు. బ్యాంకు పనివేళలు ముగిసినా.. అతను వచ్చే వరకు ఎదురుచూసి అతని అనుమతితో లెక్క సరి చేశారు.

Link to comment
Share on other sites

  • 1 year later...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...