Jump to content

ఈ యేడాది ఈ రెండు సినిమాల్నీ మొదలుపెట్టబోతున్నా - చిరంజీవి


JANASENA

Recommended Posts

bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st 

 

200117sit1a.jpg

మాస్‌... అనే మాటకి కొత్త నిర్వచనం చెప్పిన కథానాయకుడు చిరంజీవి. తనదైన శైలి డ్యాన్సులతో... నటనతో ప్రేక్షకులపై ఓ ప్రత్యేకమైన ముద్ర వేశారు. దశాబ్దాలపాటు తెలుగు సినిమా బాక్సాఫీసుపై తిరుగులేని ప్రభావం చూపించారు. ఎప్పటికప్పుడు తన సినిమాల్నే తాను అధిగమిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచిన ఘనత కూడా ఆయనకి దక్కుతుంది. చిరు సినిమా విడుదల అనగానే పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ ఓ ప్రత్యేకమైన కోలాహలం. ‘ఖైదీ నంబర్‌ 150’తో తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ఆ కోలాహలం స్పష్టంగా కనిపించింది. చిరు పునః ప్రవేశం విజయవంతంగా జరిగిపోయింది. ‘ఇదే వూపులో మరిన్ని సినిమాలు చేస్తాన’ంటున్న చిరంజీవితో ‘ ఓ చిన్న ఇంటర్వ్యూ..

‘తొమ్మిదేళ్ల తర్వాత నటిస్తున్నాను, తెరపై ఎలా కనిపిస్తానో ఏంటో అనే ఓ సంశయం మధ్యే కెమెరా ముందుకు అడుగుపెట్టా. కానీ సెట్‌లో వాతావరణం చూసేసరికి అన్నీ మరిచిపోయి నటించా. సినిమా విడుదలకి ముందు మాత్రం ఎప్పటిలాగా కాస్త ఆందోళన, కాస్త ఆత్రుత. బహుశా అది మరో వంద సినిమాలు చేసినా అలాగే ఉంటుందేమో. కానీ ఈ సినిమా అందించిన ఆనందం అంతా ఇంతా కాదు. మా ఇంట్లోవాళ్లు కూడా చాలా సందర్భాల్లో అన్నారు. ‘ఈ పదేళ్ల కాలంలో ఇంత ఉత్సాహంగా ఇప్పుడే చూస్తున్నాం’ అని. సెట్‌కి వెళ్లినా, అక్కడ రోజంతా పనిచేసి సాయంత్రం ఇంటికొస్తున్నా ఆయా సందర్భాల్లో కలిగే సంతృప్తే వేరు. ఈ వూపులో మరో రెండు మూడు సినిమాలైనా చేస్తా’’.

ఆలస్యమైనా.. 
‘‘నా నుంచి ప్రేక్షకులు ఏం కోరుకొంటారో నాకు బాగా తెలుసు. దానికితోడు తొమ్మిదేళ్ల తర్వాత వస్తున్నాను కాబట్టి అంచనాలు మరింతగా పెరిగిపోతాయి. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొనే కథ విషయంలో తర్జనభర్జనలు పడ్డా. చివరికి వినోదంతో పాటు సందేశం ఉండే ‘కత్తి’ సినిమాని ఎంచుకొని రీమేక్‌ చేశాం. మా నిర్ణయం వందశాతం సరైనదే. ‘ఠాగూర్‌’, ‘స్టాలిన్‌’ చిత్రాల తరహాలో నా నుంచి ప్రేక్షకులు మంచి సందేశాన్ని కోరుకొంటారు. అలాంటి చిత్రం చేయడం నా బాధ్యత కూడా. అందుకే ‘కత్తి’ చేశా. కొద్దిమంది ‘మీరు సాధించని రికార్డులంటూ లేవు, అలాంటిది మళ్లీ కమర్షియల్‌ అంశాల్ని దృష్టిలో ఉంచుకొని సినిమా చేయాలా?’ అన్నారు. నా సినిమాలో సందేశంతో పాటు, ప్రేక్షకుల్ని అలరించే అంశాలు కూడా తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే పరిపూర్ణంగా ఆస్వాదిస్తారు. అందుకే ఆలస్యమైనా ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా కథలు విని ఎంపిక చేసుకొన్నా’’.

అమితాబ్‌ గురించి ఆలోచించాం.. 
‘‘అభిమానులతో పాటు... రజనీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్‌లాంటి ప్రముఖులు కూడా పలు సందర్భాల్లో ‘చిరంజీవి 150వ సినిమా చేయాల్సిందే’ అంటూ స్వాగతం పలికారు. వాళ్ల మాటలు నాకెంతో ప్రోత్సాహకరంగా అనిపించాయి. ‘ఎస్‌... నేను చేయాలి’ అనే ఉత్సాహం నాలో కలిగింది. ఆ ఉత్సాహమే నన్ను మళ్లీ ఇలా మార్చేసింది. ఎందుకో తెలీదు కానీ... మునుపటిలా మళ్లీ డ్యాన్సులు వేయగలనా? ఫైట్లు చేయగలనా? అనే విషయాల గురించి నాకెప్పుడూ ఆలోచన వచ్చేది కాదు. సెట్‌లోకి వెళ్లి సంగీతం వినగానే మళ్లీ డ్యాన్స్‌ చేయాలనే ఉత్సాహం కలిగింది. అమితాబ్‌ బచ్చన్‌ ఓ సందర్భంలో మాట్లాడుతూ ‘చిరంజీవి 150వ సినిమా చేస్తే అందులో ఓ అతిథి పాత్ర చేస్తా’ అన్నారు. మేం కూడా ఆయనతో ఓ పాత్ర చేయించాలని ఆలోచించాం కానీ... మళ్లీ ఆగిపోయాం. అమితాబ్‌లాంటి నటుడికి దీటైన పాత్ర అయితేనే బాగుంటుందని, అలాంటి పాత్ర మన కథలో లేనప్పుడు ఆ ప్రయత్నం విరమించుకోవడమే ఉత్తమం అనుకొన్నాం. మంచి పాత్ర ఉండుంటే మాత్రం తప్పనిసరిగా అమితాబ్‌ని సంప్రదించేవాళ్లం’’.

మార్పులు కనిపించాయి 
‘‘నటుడిగా నేను మరో కొత్త అధ్యాయం మొదలుపెట్టానేమో అనిపిస్తోంది. తొమ్మిదేళ్ల క్రితం పరిశ్రమలో పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. సాంకేతికత మొదలుకొని, ప్రేక్షకులు సినిమాని చూసే విధానం వరకు చాలా మార్పులొచ్చాయి. అందుకే కొన్ని విషయాలు కొత్తగా అనిపించాయి. పరిశ్రమకి నేనెప్పుడూ దూరంకాలేదు. మా ఇంట్లోనే బోలెడుమంది హీరోలు ఉన్నారు కాబట్టి, వాళ్ల చిత్రాలకి సంబంధించిన చర్చల్లో తరచుగా పాలు పంచుకొనేవాణ్ని. కానీ స్వయంగా నేనే మేకప్‌ వేసుకొని సెట్‌కి వెళ్లి, ఆ వాతావరణాన్ని ప్రత్యక్షంగా అనుభవించేసరికి మార్పులన్నీ కొట్టొచ్చినట్టు కనిపించాయి. బాక్సాఫీసు దగ్గర ఫలితాల్ని కూడా మేం అప్పట్లో రోజుల్లో మాట్లాడుకొనేవాళ్లం. కానీ ఇప్పుడు లెక్కల్లో మాట్లాడుకొంటున్నారు. తప్పదు... ఇలాంటి మార్పుని స్వీకరించాల్సిందే. సినిమాని చూసే ప్రేక్షకుల పరిధితో పాటు, నిర్మాణ వ్యయం కూడా బాగా పెరిగింది. అందుకు తగ్గట్టుగానే వసూళ్లూ వస్తున్నాయి’’.

అనుభవాలు.. అనుభూతులు 
‘‘150 సినిమాల సుదీర్ఘ ప్రయాణం. ఎలా సాగిందో చెప్పాలంటే మాటలు చాలవు. ఎన్నో అనుభవాలు, మరెన్నో అనుభూతుల సంగమం ఆ ప్రయాణం. ఇమేజ్‌ వచ్చినప్పట్నుంచి కథల విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతీ కథనీ ఆచితూచి ఎంపిక చేసుకోవాలి. ప్రేక్షకులకు నచ్చదేమో అని ఏమాత్రం అనుమానం కలిగినా ఒకటి రెండు మార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు నుంచి ప్రేక్షకులు సినిమా గురించి ఎదురు చూస్తుంటారు. ఇలాంటి క్లిష్టమైన సమస్యల్ని అధిగమించి 150 సినిమాలు చేశానంటే ఎంతో ఆనందంగా ఉంది. ఇకపై ఎన్ని సినిమాలు చేస్తాను, ఎన్ని చేయాలి అని లెక్కలేమీ వేసుకోలేదు. ప్రేక్షకులు స్వీకరిస్తున్నంతవరకు ఎవ్వరికైనా నటించాలనే ఉంటుంది. నేనూ అంతే’’.

వయసుకు తగ్గట్టుగా.. 
‘‘నేను, నా తోటి కథానాయకులవైపు నుంచి పరిశ్రమ వాతావరణం చూస్తుంటే పదిహేనేళ్ల కిందటి రోజులే గుర్తుకొస్తున్నాయి. నేను, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున... మేమంతా కూడా ఒకప్పుడు వరుసగా సినిమాలు చేశాం. ఇప్పుడు కూడా మేం నలుగురం సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాం. మా చిత్రాలు వరుసగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. అందుకే ఆ రోజుల్లోనే ఉన్నట్టుగా అనిపిస్తోంది. వయసుకు తగ్గ పాత్రల్లో నటించానికి నేను కూడా సిద్ధమే. మంచి కథ కుదిరితే ఎలాంటి ప్రయత్నాలు చేయడానికైనా సిద్ధమే’’.

స్రిక్స్‌ప్యాక్‌కి రెడీ 
‘‘మీలో మార్పులేం కనిపించలేదు. ఇదివరకటి సినిమాలోలాగే ఉన్నారంటున్నారంతా. తెరపై నేనలా కనిపించడానికి కారణం నా జీవన శైలి. మనసులో ఏమీ పెట్టుకోకుండా, ప్రశాంతంగా గడుపుతుంటా. అలా ఉన్నప్పుడు ఆ ప్రభావం ఫేస్‌పై కూడా కనిపిస్తుంటుంది. రామ్‌చరణ్‌ ఇచ్చిన సలహాలు, సూచనలతో 9 కిలోల బరువు కూడా తగ్గా. ఇప్పుడు కుర్రాళ్లతో పోటీ పడటానికైనా నేను సిద్ధమే. ఒకవేళ ఎవరైనా సిక్స్‌ప్యాక్‌ చేయమన్నా అందుకు ఏమాత్రం వెనకాడను. కొన్నాళ్లపాటు కష్టపడితే అది అసాధ్యమేమీ కాదు’’.

పోటీ లేదు.. 
‘‘మా ఇంట్లోని కథానాయకులందరిపైనా నా ప్రభావం తప్పకుండా ఉంటుంది, వాళ్లలో నేనూ కనిపిస్తుండొచ్చు. అయితే వాళ్లల్లో ఒకొక్కరూ ఒక్కో శైలి ఏర్పాటు చేసుకొన్నారు. ఆ శైలికి తగ్గ కథల్లో నటిస్తూ ప్రయాణం చేస్తున్నారు. అందరూ కలివిడిగా ఉంటారు తప్ప, ఒకరికి ఒకరు పోటీగా అస్సలు భావించరు. ఆ వాతావరణం చూసినప్పుడు నాక్కూడా ముచ్చటగా అనిపిస్తుంటుంది. ఏదైనా చెప్పాల్సి వస్తే అందుకు ఏమాత్రం వెనకాడకుండా చెప్పేస్తుంటా. వాళ్లూ అంతే జాగ్రత్తగా వింటుంటారు’’.

నాగ్‌కి ఫోన్‌ చేశా 
‘‘సినిమాకి సంబంధించిన ఒత్తిడి ఎలాగూ తొలగిపోయింది. ఇక ఇప్పుడు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంతో ప్రేక్షకుల్ని ఎలా అలరించగలననే విషయంపై దృష్టిపెట్టా. ఆ షోతో ప్రేక్షకులకి మరింత చేరువవుతానన్న నమ్మకం నాకుంది. ఈ అవకాశం నాకు వచ్చిన వెంటనే నాగార్జునకి ఫోన్‌ చేశా. ‘మీరు చాలా బాగా చేశారు, నేను అతిథిగా కూడా వచ్చా. ఈసారి అవకాశం నాకు వచ్చింది’ అని చెప్పగానే... ‘మీరు చేయండి, చాలా బాగుంటుంది. చేస్తూ చేస్తూ మీరూ ఆస్వాదిస్తారు’ అని చెప్పారు’’.

రెండూ మొదలుపెడతా 
‘‘150వ చిత్రం కోసం బోలెడన్ని కథలు విన్నా. అందులో రెండు మూడు కథలు బాగా నచ్చాయి. వాటిపై ఇప్పుడు కసరత్తులు చేస్తున్నాం. నా 151వ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తారు. ఆయన తెరకెక్కించబోయే కథ ఎలాంటిదన్నది తెలియాలంటే మాత్రం ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. 152వ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్నా. ఈ యేడాది ఈ రెండు సినిమాల్నీ మొదలుపెట్టబోతున్నా’’.

Link to comment
Share on other sites

1 minute ago, Hyper said:

100 tho ballaya tough fight ichindu next...ma venki babu 75 tho...Nag 100 tho istahru chudu 

evadi market vadikundi adi fight ela avuthundi. sankranthi ki release ayyina K150 & GPSK renditini choosaru janalu. 

Link to comment
Share on other sites

1 hour ago, Hyper said:

100 tho ballaya tough fight ichindu next...ma venki babu 75 tho...Nag 100 tho istahru chudu 

IND team tho edaina week team like Zim adi reasonable ga adi odipothe cheptaru Zim fight ichindhi ani..alagaundhi nuvvu cheppedhi bro..Chiru gadi market range veru vadu entha errifuk ayina..venki, nbk, nagarjuna market chala takkuva comapred to chiru..

Link to comment
Share on other sites

44 minutes ago, fact_of_the_matter said:

IND team tho edaina week team like Zim adi reasonable ga adi odipothe cheptaru Zim fight ichindhi ani..alagaundhi nuvvu cheppedhi bro..Chiru gadi market range veru vadu entha errifuk ayina..venki, nbk, nagarjuna market chala takkuva comapred to chiru..

ezgif-231807171.gif?1437556466

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...