Jump to content

ఎవరెస్ట్ ఎత్తును మళ్లీ కొలుస్తారు


JANASENA

Recommended Posts

23hyd-general2a.jpg

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్‌ శిఖరం ఎత్తును తిరిగి కొలవనున్నారు. మరో మూడు నెలల్లో ఎవరెస్ట్‌ ఎత్తు ఎంత ఉందో నిర్ధారించనున్నారు. ఎవరెస్ట్‌ శిఖరం ఎత్తును కొలవడానికి జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) సిద్ధమైంది. ఈ బృహత్‌కార్యక్రమాన్ని మరో రెండు నెలల్లో ప్రారంభించనున్నట్లు సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా డాక్టర్‌ స్వర్ణ సుబ్బారావు తెలిపారు. ఎత్తును కొలవడానికి సుమారు నెల రోజులు సమయం తీసుకునే అవకాశం ఉందన్నారు.

నేపాల్‌ భూకంపం నేపథ్యంలో: హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఎవరెస్ట్‌ శిఖరం 8,848 మీటర్లు(29,029 అడుగులు)తో ప్రపంచంలోనే ఎత్తైన శిఖరంగా కొనసాగుతోంది. నేపాల్‌లో రెండేళ్ల క్రితం సంభవించిన తీవ్ర భూకంప నేపథ్యంలో ఎవరెస్ట్‌ ఎత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2015 ఏప్రిల్‌ 25న నేపాల్‌లో 7.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇంత తీవ్రభూకంపం నేపథ్యంలో భూగర్బంలోని టెక్టానిక్‌ పలకల్లో మార్పులు వచ్చి ఉంటాయని ఎవరెస్ట్‌ ఎత్తుపై ఇది ప్రభావం చూపి ఉంటుందని ఒక అంగుళం (2.54 సెంటీమీటర్ల) మేర తగ్గి ఉంటుందని కొంతమంది శాస్త్రవేత్తలు సందేహాలను వ్యక్తం చేశారు. కొంతకాలంగా శాస్త్రవేత్తల్లో ఇది చర్చనీయాంశంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎవరెస్ట్‌ ఎత్తును కొలిచే అత్యంత ప్రధాన బాధ్యతను 250 ఏళ్ల చరిత్ర ఉన్న సర్వే ఆఫ్‌ ఇండియా చేపట్టనుంది. ఇప్పటికే ఇందుకు అవసరమైన కార్యాచరణను ప్రారంభించింది. అన్ని హంగులను సమకూర్చుకుని ఎవరెస్ట్‌ ఎత్తును కొలిచి అత్యంతం శాస్త్రీయంగా నిర్ధారించనుంది. సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఉంచిన నమూనా ఎవరెస్టు శిఖరం సందర్శకులను ఎంతో ఆకట్టుకుంది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...