Jump to content

42కోట్ల ఆఫర్ని తిరస్కరించిన టీనేజర్


JANASENA

Recommended Posts

బెడ్‌రూమ్‌లో వెబ్‌సైట్‌ డిజైన్‌ 
25brk-123boy1.jpg

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుత డిజిటల్‌ యుగంలో అద్భుతాలు సృష్టించడానికి వయసుతో సంబంధం లేదు. ముఖ్యంగా పిల్లలు ఇంట్లో ఉండే కంప్యూటర్‌, స్మార్ట్‌ ఫోన్ల ద్వారా అంతర్జాలాన్ని ఉపయోగించుకొని గేమ్‌లు, యాప్‌లు, వెబ్‌సైట్లను డిజైన్‌ చేస్తూ తమ సృజనాత్మకతను చాటుకుంటున్నారు. తాజాగా ఓ 16ఏళ్ల బాలుడు తయారు చేసిన వెబ్‌సైట్‌కి ప్రపంచస్థాయి కంపెనీ నుంచి రూ.42కోట్ల ఆఫర్‌ వచ్చిందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ.. అతను రూపొందించిన దానికి అంత ప్రాముఖ్యం ఉండబట్టే సదరు సంస్థ అంత మొత్తాన్ని ప్రకటించిందంట. అయితే అతను మాత్రం ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు!

ఇంగ్లాండ్‌లోని యార్క్‌షైర్‌ డ్యూస్‌బర్రీకి చెందిన మహ్మద్‌ అలీ వయసు 16ఏళ్లు. ఇంకా పాఠశాలలోనే చదువుతున్నాడు. ఇంట్లో తన గదిలోనే కంప్యూటర్‌తో ఆడుతూ పాడుతూ ధరలను పోల్చే (ప్రైస్‌ కంపారిజన్‌) ‘వీనీడ్‌1.కామ్‌’ వెబ్‌సైట్‌ను రూపొందించేశాడు. ఆ వెబ్‌సైట్‌కి ఓ ప్రపంచస్థాయి సంస్థ రూ. 42 కోట్ల ఆఫర్‌ ఇస్తే అలీ దాన్ని తిరస్కరించాడు. ఈ సందర్భంగా ఓ వార్తాసంస్థతో అలీ మాట్లాడుతూ..

అందుకే తిరస్కరించా..

‘మేము లండన్‌లో పెట్టుబడిదారులను కలిశాం. వారిచ్చిన ఆఫర్‌ను నేను తిరస్కరించాను. వెబ్‌సైట్‌కి అవసరమైన టెక్నాలజీ అంతా నేనే తయారుచేసుకున్నానంటే వారు నమ్మలేదు. పైగా ఈ వెబ్‌సైట్‌కి ఇప్పుడే ఇంత విలువ ఉంటే అది వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన తర్వాత దాని విలువ ఎంత ఉంటుందో వూహించుకోవచ్చు.. అందుకే వారి ఆఫర్‌ తిరస్కరించా’ అని ఆ బాలుడు పేర్కొన్నాడు. 60ఏళ్ల క్రిస్‌ తార్పే ఈ వెబ్‌సైట్‌ రూపకల్పనలో అలీకి వ్యాపార భాగస్వామిగా వ్యవహరించారు. ఈ నెల 28న ఈ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించనున్నారు. అలీకి ఇదే కొత్త కాదు, గతంలో ‘ప్రాజెక్టు 2006’తో రూపొందించిన వీడియోగేమ్‌కు 30వేల యూరోలను అలీ గెలుచుకున్నాడు.

25brk-123boy2.jpg
Link to comment
Share on other sites

  • 5 years later...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...