Jump to content

ఐబీఎం మీద ట్రంప్ ఎఫెక్ట్


JANASENA

Recommended Posts

25brk-ibm.jpg

వాషింగ్టన్‌: అమెరికా టెక్‌ జెయింట్‌ ఐబీఎం కూడా అధ్యక్షుడు ట్రంప్‌ దెబ్బకు హడలిపోయింది. ప్రచారం సందర్భంగా ఐబీఎం పేరుతోనే ట్రంప్‌ నేరుగా హెచ్చరికలు జారీ చేయడంతో ఆ సంస్థ వెంటనే ఉద్యోగాల్లో కోత మొదలుపెట్టింది. నవంబర్‌ నాటికి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. ఈ సంఖ్య వేలల్లోనే ఉంటుందని కంపెనీ అంతర్గత వర్గాలు అంటున్నాయి. దీనికి తోడు అప్పట్లో జరిగిన ఓ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌ల సమావేశంలో ఐబీఎం సీఈవో గిన్నీ రొమెట్టీ 25,000 మంది అమెరికన్లను ఉద్యోగాల్లోకి తీసుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. అంతేకాకుండా వచ్చే నాలుగేళ్లలో వారికి బిలియన్‌ డాలర్ల వ్యయంతో శిక్షణ కూడా ఇప్పిస్తానని తెలిపారు. దీనిలో భాగంగా గత నవంబర్‌ చివర్లో ఐబీఎం మూడో రౌండ్‌ ఉద్యోగాల తొలగింపును కూడా పూర్తి చేసింది. కానీ ఆ సంఖ్యను మాత్రం ఇప్పటికీ బయటకు చెప్పటంలేదు. వీటిల్లో ఎక్కువగా తూర్పు యూరోప్‌, ఆసియా తరలించినవి కూడా ఉన్నాయి. తొలగింపులు కొత్త సంవత్సరంలో కూడా కొనసాగే అవకాశం ఉంది.. కానీ వేగం మాత్రం కొంచెం తగ్గవచ్చు. దీనిని కంపెనీ అంతర్గతంగా రిసోర్స్‌ యాక్షన్‌గా వ్యవహరిస్తోంది. ఈ నెల ఐబీఎం అమెరికా నుంచి వెళ్లిపోవాల్సిన ఉద్యోగులపై దృష్టిపెట్టిందని ఆ సంస్థలోని ఓ ఉద్యోగి అంటున్నారు.

వచ్చే నాలుగేళ్లలో 25,000 ఉద్యోగాలు 
ఐబీఎం ఆదాయంలో మూడింట రెండు వంతులు విదేశాల నుంచి వస్తున్నదే అని ఐబీఎం ప్రతినిధి డగ్‌ షెల్టన్‌ ఓ ఈ మెయిల్‌లో పేర్కొన్నారు. వచ్చే నాలుగేళ్లలో అమెరికాలో 25,000 మంది ఉద్యోగులను నియమించుకుంటామన్నారు. ఇక్కడే ఆయన ఒక చిన్న మెలికపెట్టారు. ఇదంతా తాము ఉద్యోగులను నియమించుకునే పరిస్థితిలో ఉంటేనే సుమా.. అని పేర్కొన్నారు.

కంపెనీ సీఎఫ్‌వో మార్టిన్‌ స్కార్టర్‌ మాట్లాడుతూ కంపెనీ ఆర్థిక పరిస్థితి ఈ ఏడాది మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఉద్యోగులకు చెల్లింపుల్లో మిగులు ఏర్పడుతుందని పేర్కొన్నారు.

ఉద్యోగుల్లో అసహనం.. 
రొమెట్టీ ప్రతిజ్ఞపై ప్రస్తుత, మాజీ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీనిపై వారు ఫేస్‌బుక్‌, ఇతర సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌ల్లో బాహాటంగానే మాట్లాడుతున్నారు. రొమెట్టీ దేశీయ ఉద్యోగాలను ఏమీ విదేశాలకు తరలించలేదని వారు పేర్కొంటున్నారు. కొందరు మరో అడుగు ముందుకేసి ఐబీఎం తొలగింపుల, అవుట్‌సోర్సింగ్‌ చరిత్రపై ట్రంప్‌ బృందానికి అవగాహన కల్పించాలని కోరుతున్నారు. దీనిపై ఫ్లొరిడాలోని లాయర్‌ సారా బ్లాక్‌ విల్‌ అనే లాయర్‌ మాట్లాడుతూ ‘వేలకొద్దీ ఉద్యోగులను తొలగించి.. 25,000 మందిని కొత్తగా నియమించుకొని ఆమె తనను తాను హీరోగా చిత్రీకరించుకుంటోంది’ అని విమర్శించారు.

Link to comment
Share on other sites

14 minutes ago, metalhanger said:

Bongu bhayya.. contractors andariki only 35 hrs cheysindru .. increase cheyaru anta 

antey 40Hrs ivvara ? 

Link to comment
Share on other sites

53 minutes ago, JANASENA said:

antey 40Hrs ivvara ? 

1 hour ago, metalhanger said:

Bongu bhayya.. contractors andariki only 35 hrs cheysindru .. increase cheyaru anta 

 

 

40 hrs concept tesi dobi 2 years ayindhi@3$%

Link to comment
Share on other sites

5 minutes ago, metalhanger said:

September varaku 40 vundey taruvatha 35 cheysi ippudu ivvandi ra ante dobbey antunaru. Monna chepparu only 35 . Me savu meru savandi ani 

chudu march nudi 30 anta.... @3$%  sachipondi..or 1 year lo CeeepppTTtttt laga 20 chestharu  @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...