Jump to content

అవమానిస్తే.. అందనంత ఎత్తు ఎదిగాడు - లంబొర్గిని సంస్థ యజమాని ఫెర్రుకియో లంబొర్గిని


JANASENA

Recommended Posts

26brk95a.jpg

ప్రపంచంలోని విలాసవంతమైన కార్ల తయారీ కంపెనీల్లో లంబొర్గిని ముందువరుసలో ఉంటుంది. అత్యంత ఖరీదైన కార్లను మాత్రమే ఈ కంపెనీ తయారు చేస్తోంది. రోడ్డుపై రివ్వున దూసుకెళ్లే లంబొర్గిని కార్లు చాలా మందికి ఫేవరేట్‌ అంటే అతిశయోక్తి కాదు. అలాంటి లంబొర్గిని సంస్థ ఒకప్పుడు ట్రాక్టర్లను తయారు చేసేది. నెలకు ఒక్క ట్రాక్టర్‌ను కూడా సరిగా తయారు చేయలేని చిన్న సంస్థగా ఉండేది. ఇప్పుడు కార్ల తయారీ రంగంలో అగ్రగామి సంస్థగా నిలిచింది. ఇందుకు కారణం లంబొర్గిని సంస్థ యజమానికి ఎదురైన అవమానం.

లంబొర్గిని సంస్థ యజమాని ఫెర్రుకియో లంబొర్గిని రెండో ప్రపంచ యుద్ధం సమయంలో వైమానిక సిబ్బందితో పరిచయం ఏర్పడటంతో వాహనాల ఇంజన్లు.. మెకానికల్‌ సిస్టమ్‌పై ఆసక్తి పెరిగింది. యుద్ధం ముగిశాక లంబొర్గిని ఉత్తర ఇటలీలో కార్లు.. బైకులు రిపేర్‌ చేసే మెకానిక్‌ షాపు ప్రారంభించాడు. అప్పుడే లంబొర్గినికి ఓ ఆలోచన వచ్చింది. యుద్ధం సమయంలో ఉపయోగించి వదిలేసిన వాహనాల భాగాలను తీసుకొని ట్రాక్టర్లు తయారు చేసి విక్రయించాలనుకున్నాడు. వెంటనే కర్మాగారం ప్రారంభించి ట్రాక్టర్లు తయారు చేయడం మొదలుపెట్టాడు. కానీ నెలకు ఒక్కటి మాత్రమే తయారుచేయగలిగేవారు. వ్యవసాయంలో ట్రాక్టర్ల వినియోగం పెనగడంతో లంబొర్గిని ట్రాక్టర్లకు డిమాండ్‌ పెరిగింది. దీంతో వ్యాపారం లాభాసాటిగా సాగింది. 1960లో లంబొర్గిని ఆయిల్‌ బర్నింగ్‌ హీటర్లు.. ఏసీలు తయారు చేసే కంపెనీలను స్థాపించాడు.

26brk95b.jpg

కార్లంటే మోజుపడే లంబొర్గిని చాలా రకాల స్పోర్ట్స్‌ కార్లను కొన్నాడు. అప్పటికే విలాసవంతమైన లగ్జరీ కార్ల కంపెనీ ఫెరారీ 250 జీటీ కారును కూడా సొంతం చేసుకున్నాడు. అయితే.. ఆ ఫెరారీ కారులో క్లచ్‌ సరిగా పడక సమస్య ఏర్పడింది. దాన్ని గుర్తించి ఫెరారీ యజమాని ఎంజో ఫెరారీ వద్దకు వెళ్లి క్లచ్‌ సమస్య గురించి ఫిర్యాదు చేశాడు. దానికి ఎంజో ఫెరారీ సరైన సమాధానం చెప్పకపోగా.. కారులో ఎలాంటి సమస్యాలేదు. డ్రైవర్‌తోనే సమస్య. తమరు కారును కాకుండా ట్రాక్టర్‌ని నడపడమే మంచిదంటూ అవహేళన చేశాడు. అది లంబొర్గిని ఎంతో బాధించింది.

ఆ బాధలో నుంచే తానే ఒక సొంత కారును రూపొందిచుకోవాలన్న ఆలోచన వచ్చింది. 1963లో శాంటాగటా ప్రాంతంలో చిన్న కర్మాగారం ఏర్పాటు చేశాడు. ఫెరారీలో పని చేసిన మాజీ ఉద్యోగులను తన సంస్థలో నియమించుకున్నాడు. అన్ని కార్ల కంటే.. విలాసంతవమైన అత్యధిక జీటీ.. గంటకు 240కి.మీ వేగంతో వెళ్లే కారును రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అనుకున్న ప్రమాణాలతో లంబొర్గిని 350 జీటీ కారును ఆవిష్కరించాడు. వృషభ రాశిలో జన్మించాడని తన కారు పేరుకు ఎద్దునే చిహ్నంగా ఉపయోగించాడు. అప్పటి నుంచి లంబొర్గిని వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఫెర్రుకియో లంబొర్గిని 1993లో మరణించడంతో ప్రస్తుతం ఈ కార్ల తయారీ సంస్థను ఆడీ.. ఫోక్స్‌వ్యాగన్‌ సంస్థలు నడిపిస్తున్నాయి.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...