Jump to content

ఒక్క కామెంట్తో 3 ఉద్యోగాలు ఉఫ్


JANASENA

Recommended Posts

26brk128a.jpg

సోషల్‌మీడియా.. ప్రతీ వ్యక్తి తన ఆలోచనల్ని.. అనుభవాల్ని ఇతరులతో పంచుకోవడానికి ఒక వేదికగా మారింది. అయితే.. అందులో మనం పెట్టే పోస్టులు.. కామెంట్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించి పెట్టాలి. తోచింది పెడితే మొదటికే మోసం వస్తుందన్న విషయం చెప్పడానికి చైనాకి చెందిన ఓ ప్రొఫెసర్‌ ఉదంతమే ఉదాహరణ. తాను చేసిన కామెంట్‌కి తానే బలై ఉన్నతమైన ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది.

షాండాంగ్‌ ప్రావిన్స్‌లోని జియాంజు యూనివర్సిటీ ఆర్ట్‌ విభాగంలో 60ఏళ్ల డెంగ్‌ క్జియాంగ్‌చావొ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల చైనా దివంగత నేత మావో జెడాంగ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి తాను చేస్తున్న మూడు ఉద్యోగాలు వదులుకోవాల్సి వచ్చింది. గత నెల 26న ఫాదర్‌ ఆఫ్‌ ది పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనాగా పిలుచుకునే మావో జెడాంగ్‌ 123వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తుంటే.. డెంగ్‌ మాత్రం తన మైక్రోబ్లాగ్‌లో మావోకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు.

చైనాలో కరవు వల్ల 30లక్షల మంది మరణించగా.. సాంస్కృతిక విప్లవం వల్ల 20లక్షలమందికి పైగా మరణించారు. అందుకు మావోనే బాధ్యుడంటూ ఆయన్ను విమర్శిస్తూ.. తన బ్లాగులో రాసుకొచ్చాడు. ఆ తర్వాత పోస్టును తొలగించినా.. అప్పటికే ఆ పోస్టు చైనా సోషల్‌మీడియా వీబోలో వైరల్‌ అయింది. నెటిజన్లు ఆ పోస్టును షేర్‌ చేయడంతో విషయం కాస్త సీరియస్‌ అయింది. మావో మద్దతుదారులు డెంగ్‌కి వ్యతిరేకంగా నిరసనలు.. ర్యాలీలు నిర్వహించారు. దీంతో మావోపై చేసిన వ్యాఖ్యలు సమాజంపై దుష్ప్రభావం చూపుతాయని.. అతను తప్పుగా వ్యవహరించాడని ప్రొఫెసర్‌ విధుల నుంచి జియాంజు యూనివర్సిటీ డెంగ్‌ను తొలగించింది. ఇకపై క్యాంపస్‌లోగానీ.. బయట గానీ పాఠాలు చెప్పడానికి వీల్లేదని తేల్చిచెప్పింది.

అంతేకాదు.. చైనీస్‌ పీపుల్స్‌ పొలిటికల్‌ కన్సల్టేటీవ్‌ కాన్ఫరెన్స్‌కి చెందిన షాండాంగ్‌ ప్రొవిన్షియల్‌ కమిటీలో సభ్యుడు కాగా ఆ కమిటీలోంచి కూడా బహిష్కరించారు. అతన్ని మెచ్చి.. కౌన్సిలర్‌ పదవి ఇచ్చిన ప్రభుత్వమే ఆ పదవిని వూడగొట్టింది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...