Jump to content

Dollar Kallolam !!!!

TampaChinnodu

Recommended Posts

డాలర్‌ కల్లోలం! 
ఐటీ ఉద్యోగులు, తల్లిదండ్రుల్లో కలవరం 
అమెరికాలోని హైదరాబాదీల్లో భయం 
hyd-top1a.jpg

హైదరాబాద్‌: అమెరికాలో తుమ్మితే హైదరాబాద్‌కు సర్ది చేస్తుందంటారు. ఇప్పుడు ప్రత్యక్ష్యంగా చూస్తున్నాం కూడా. అగ్రరాజ్యం అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకొంటున్న నిర్ణయాలు అక్కడి మన విద్యార్థులు, ఉద్యోగులను, ఇక్కడుంటున్న వారి తల్లిదండ్రులను.. అన్నింటికి మించి ఐటీ కంపెనీలను కలవర పెడుతున్నాయి. మరోవైపు అక్కడుండే విద్యార్థులకు బెదిరింపు హెచ్చరికలు జారీ అవుతున్నాయి. టెక్సాస్‌లో చదువుతున్న వారిని అమెరికా వదిలి వెళ్లకపోతే వేధింపులు తప్పవంటూ బెదిరింపులు వచ్చాయి. ఆ లేఖలను అక్కడి విద్యార్థులు ఇక్కడి మీడియాకు అందించారు.

విద్య, ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో నగరం నుంచి యువత అమెరికా వెళ్లింది. పైగా మధ్యతరగతి వాసుల్లో ఎక్కువ మంది ఇంజినీరింగ్‌ చదువు పూర్తి కాగానే హెచ్‌1బి వీసాతో అమెరికా వెళ్లాలని కలలు కంటుంటారు. ఈ వీసాపై అక్కడ ఆరేళ్లు ఉద్యోగం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆలోపు గ్రీన్‌కార్డు పొందేవారు. ఒకసారి రాకపోతే మరోసారి ప్రయత్నించేవారు. అక్కడ కంపెనీలు సైతం వీరికి స్పాన్సర్‌ చేసేవి. అలా అక్కడే స్థిరపడిపోయేవారు. ఇప్పుడా పరిస్థితి ఉండకపోవచ్చనేది ఎక్కువ మంది ఆందోళన. హెచ్‌1బి వీసా ముగిస్తే తిరిగి హైదరాబాద్‌ వచ్చేయాల్సిందే అన్న గుబులు మొదలైంది.

తాజా పరిణామాల్లో ముఖ్యంగా మూడు రకాల పరిస్థితులు మన వారిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. 
1 ఇమ్మిగ్రేషన్‌ హెచ్‌1బి వీసా: ఉద్యోగులు అమెరికా వెళ్లి పని చేసేందుకు వీలు కల్పించే వీసా ఇది. వీటి సంఖ్యను తగ్గించాలని ట్రంప్‌ చూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 85 వేలకు అవకాశం ఉంటే.. ఒక్క భారత్‌ నుంచే 70 శాతం మందికిపైగా వెళుతుంటారు. ఆ సంఖ్య తగ్గిస్తే వెళ్లే వారి సంఖ్యా తగ్గుతుంది. వార్షిక వేతనం భారీగా పెంచే బిల్లు సిద్ధం అవుతోంది. దీంతో ఇక్కడి నుంచి ఉద్యోగులను అక్కడికి తీసుకెళ్లి భారీ వేతనాలు ఇచ్చే బదులుగా అక్కడ స్థానికులను తీసుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా అక్కడి ఉద్యోగాల్లో మన వారికి అవకాశాలు తగ్గుతాయి.

2. బోర్డర్‌ అడ్జస్ట్‌మెంట్‌ ట్యాక్స్‌(బీఏటీ): భారతీయ సేవలపై 20 శాతం వరకు పన్ను వేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మన ఐటీ సేవలు తక్కువకు అందుబాటులోకి వస్తున్నాయనే మన కంపెనీలకు కొత్త ప్రాజెక్ట్‌లు వస్తున్నాయి. దిగుమతి పన్ను పడితే మన సేవలకు డిమాండ్‌ ఉండకపోవచ్చు.

3. అనిశ్చితి: ప్రస్తుతం ట్రంప్‌ ఒకటి మాట్లాడితే.. రిపబ్లికన్లు మరోటి అంటున్నారు. స్పష్టత లేకపోవడంతో ఎవరూ కొత్త ప్రాజెక్ట్‌లు ఇవ్వడం లేదు. దీంతో మన ఐటీ విక్రయాలు తగ్గిపోతాయని నిపుణులు అంటున్నారు. ఆ కంపెనీలు ప్రకటించిన మూడో త్రైమాసిక ఫలితాలే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. రెండంకెల వృద్ధి నుంచి చాలా కంపెనీలు సింగిల్‌ డిజిట్‌లోకి వచ్చాయి.

కంపెనీలు ముందుకు రాకపోవచ్చు 
ప్రస్తుతం దేశీయంగానూ ఐటీ కంపెనీల పరిస్థితి ఆశాజనకంగా లేదు. మన కంపెనీలు ఎక్కువగా ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌ రంగంలో ఐటీ సేవలను అందిస్తున్నాయి. బ్రెగ్జిట్‌ అనంతరం లండన్‌ కేంద్రంగా సాగే ఫైనాన్స్‌ ఐటీ సేవలపై ప్రభావం పడింది. ఇటువంటి పరిస్థితుల్లో అమెరికా నుంచి తిరిగొచ్చే వారికి ఆ స్థాయిలో వేతనాలు చెల్లించి తీసుకునే అవకాశాలు స్వల్పమే. ఇటీవల పరిణామాలతో అమెరికా నుంచి తిరిగిచ్చే వారు పెద్ద సంఖ్యలో నిరుద్యోగులుగా మారే ప్రమాదం ఉంది. ప్రస్తుతం యు.ఎస్‌., యూరోప్‌ మార్కెట్లే ఐటీ సంస్థలకు 60 శాతంపైగా ఉంటుంది.. ఐటీ సంస్థలు దేశీయంగా మార్కెట్‌ను పెంచుకోగలిగితే ఇబ్బందుల నుంచి గట్టెక్కుతాయి. ప్రభుత్వాలు అంకుర సంస్థలను ప్రోత్సహించాలి.

- శశి పొలవరపు, సహ వ్యవస్థాపకులు, లెగ్జిస్‌ ల్యాబ్స్‌

ప్రాజెక్ట్‌ ముగిసే వరకు... 
బంజారాహిల్స్‌: మిగతా దేశాల మాదిరి ఇప్పటికిప్పుడు భారతీయ ఉద్యోగులకు వచ్చిన ఇబ్బందేమి లేదు. హెచ్‌1బీ వీసా గడువు ముగిస్తే పొడిగించే అవకాశం ఉండదు. ఆలోపు గ్రీన్‌కార్డు పొందగలిగితే సరి. ఇప్పటి వరకు హెచ్‌1బీ వీసా ఆరేళ్ల గడువు ఉండేది. దీన్ని మూడేళ్లకు కుదిస్తున్నారు. కొత్త ప్రాజెక్ట్‌లు కష్టమే. ఇవన్నీ మనవారికి ఇబ్బందే. అమెరికాలోని ఉద్యోగాల్లో మొదటి ప్రాధాన్యం వారికే దక్కేలా ట్రంప్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మేం వెళ్లి ఆరేళ్లు అవుతోంది. గ్రీన్‌కార్డు ప్రాసెసింగ్‌లో ఉంది. వస్తుందనే ఆశాభావంతో ఉన్నాం.

- సీహెచ్‌.కవిత, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, సిన్సినాటి, యూఎస్‌ఏ
Link to comment
Share on other sites

Just now, TampaChinnodu said:

  • 1 month later...
29 minutes ago, micxas said:

:(

జనాదరణ.. నెటిజనాదరణ.. రెండూ జగన్ కే..

Tue Mar 28 2017 15:57:08 GMT+0530 (IST)

Jagan-Is-Top-Searched-Leader-As-Per-Google-Trends-1490694846-1813.jpg

పాలక టీడీపీ నేతలు సీఎం చంద్రబాబు ఎంతగా దుష్ప్రచారం చేస్తున్నా వైసీపీ అధినేత జగన్ కు మాత్రం జనాదరణ కొంచెంకూడా తగ్గడం లేదు. జనుల్లో ఆదరణతో పాటు నెటిజనుల్లోనూ జగన్ కే ఎక్కువ ఆదరణ ఉందని తాజాగా తేలింది. గూగుల్ ట్రెండ్స్ ప్రకారం టాప్ సెర్చ్ డ్ లీడర్ గా జగన్ నిలవడం విశేషం.
    
ఏపీలో నెటిజన్లు పెద్దపెద్ద నాయకులందరినీ పక్కనపెట్టి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని గూగుల్ ట్రెండ్సులో తేలింది. మరో రెండేళ్లలో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో జగన్ గ్రాఫ్ హై రేంజిలో ఉండడంతో టీడీపీ నేతలు షాక్ తింటున్నారు.
    
గడిచిన 90 రోజులలో గూగుల్ ట్రెండ్స్ సమాచారాన్ని సేకరించి వాటిని సగటున చూడగా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తో సమానంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాపులారిటీ పెరిగినట్లు గూగుల్ తెలిపింది. 
    
మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాత్రం అసలు పెద్దగా నెటిజన్లు పట్టించుకోవడం లేదు. వాళ్లిద్దరికీ చాలా తక్కువ సంఖ్యలోనే సెర్చ్లు వచ్చాయట. మోదీ గురించి సెర్చ్ చేసినవారిలో సగం మంది కేజ్రీవాల్ గురించి సెర్చ్ చేసినవారిలో మూడింట రెండొంతుల మంది ఏపీ నుంచి జగన్ కోసం సెర్చ్ చేశారు. విజయవాడ విశాఖపట్నం లాంటి నగరాల్లో అయితే రాష్ట్ర నాయకుల కంటే జాతీయ స్థాయి నాయకుల గురించే ఎక్కువగా సెర్చ్ చేయడం గమనార్హం. అలాగే హైదరాబాద్ లో కూడా ఎక్కువమంది నరేంద్రమోదీ - అరవింద్ కేజ్రీవాల్ గురించి సెర్చ్ చేశారు. మరోవైపు వైఎస్ ఆర్ సీపీ ఫేస్ బుక్ పేజీకి 10 నెలల్లోనే 3 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఈ విషయాన్ని పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.
    
మరో విశేషం ఏంటంటే జగన్ కోసం ఏపీ  - తెలంగాణలోనే కాకుండా కర్ణాటక - మహారాష్ట్ర - తమిళనాడు - ఢిల్లీ నుంచి సెర్చ్ చేసినవారున్నారు. అయితే.. గూగుల్ ట్రెండ్సు కంటే ముందే జనం ట్రెండును చంద్రబాబు గుర్తు పట్టేసినట్లుగా ఉంది.. అందుకే జగన్ పేరు వినిపిస్తే చాలు ఆయన ఉలిక్కిపడుతుంటారు.
 
Link to comment
Share on other sites

Just now, Kontekurradu said:

@3$%

Link to comment
Share on other sites

55 minutes ago, nrikittu said:

H1b 3 yrs ki kudhincharani evaru chepparu vayya, aa news evaro annatu undhi.

after 6 yrs.. even after approved I-140 for every extension companies has to prove that they don't have equivalent local talent.. and they tried recruiting local talent to replace the applicant. or else NO EXTENSIONS ...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...