Jump to content

samaja_varagamana uncle spotteed and his wife spotted in India


Crowley

Recommended Posts

న్యూఢిల్లీ: యువ దంపతుల కుటుంబ కలహాలు, కోర్టు కుమ్ములాటల మధ్య వారి పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటీవల ఈ తరహా కేసులు ఎక్కువ కావడంతో అమెరికా, భారత కోర్టుల్లో పోటాపోటీ యుద్ధవాతావరణం కనిపిస్తోంది. ప్రత్యేకించి మూడు కేసులు భారత, అమెరికా కోర్టులకు పెనుసవాలుగా మారాయి. బలవంతంగా తీసుకెళ్లిన పిల్లలను వెనక్కి తీసుకువచ్చేందుకు ఇరుదేశాల మధ్య చట్టపరమైన విధానం లేకపోవడమే దీనికి కారణమని చెబుతున్నారు. అమెరికాలో ఇంజినీరుగా పనిచేస్తున్న నాగరాజారావు అతడి భార్య పూజ ప్రీతల మధ్య కలహాలు తలెత్తడంతో... 18 నెలల బాబును తీసుకుని పూజ స్వస్థలమైన వరంగల్‌కి తిరిగి వచ్చేసింది. దీంతో తన పిల్లాడిని పూజ ‘అపహరించి’ తీసుకెళ్లిందంటూ నాగరాజారావు అమెరికా కోర్టులో కేసువేశాడు. తాను అమెరికా తిరిగి వెళ్లనని, బిడ్డ బాధ్యతలు తనకు అప్పగించాలని కోరుతూ పూజకూడా భారత కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజారావుతో విడాకుల కోసం దరఖాస్తు చేసినట్టు అమెరికా కోర్టుకు సైతం తెలిపింది. పిల్లాడు అమెరికాలో పుట్టినా భారత సంతతి గుర్తింపు కలిగి, హిందూ మైనర్ గార్డియన్ చట్టం కింద ఉండడంతో అమెరికా కోర్టు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఇదే తరహాలో అమెరికాలో నివసిస్తున్న సిమిందర్ కౌర్, ఆమె భర్తల మధ్య వివాదం తలెత్తడంతో విడాకులకు దారితీసింది. ఇప్పటికీ తన రెండేళ్ల కుమారుడి కోసం కౌర్ అమెరికా కోర్టులో పోరాడుతూనే ఉంది. నెదర్లాండ్స్‌లో నివసిస్తున్న నదియా రహీద్ అనే మహిళ తన కూతురిని భర్త ‘అపహరించుకుని’ భారత్ తీసుకెళ్లాడంటూ కోర్టును ఆశ్రయించింది. ఇలా కేవలం 2015లో ఒక్క ఏడాదిలోనే అమెరికా కోర్టుల్లో వివిధ దేశాలకు చెందిన 600 కేసులు నమోదయ్యాయి. అయితే దాదాపు 74 దేశాలతో అమెరికాకు ‘హాగ్ ఒప్పందం’ 1980 ఉండడంతో చాలావరకు కేసులు పరిష్కరించుకోగలిగింది. ఈ ఒప్పందం ప్రకారం బిడ్డ ఏ దేశంలో జన్మిస్తే ఆ దేశ చట్టాల ప్రకారం కోర్టుల్లో విచారణ జరుపుతారు. బలవంతంగా తీసుకెళ్లిన పిల్లలను ఇరుదేశాల మధ్య తిప్పి పంపుకునేందుకు వీలు కల్పించే ఒప్పందంపై భారత్ ఇప్పటి వరకు సంతకం చేయలేదు. దీంతో ఇరు దేశాల్లోనూ కోర్టుల ఆదేశాలు బుట్టదాఖలవుతుండడంతో పాటు పిల్లల పరిస్థితి గందరగోళంగా మారింది. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...