Jump to content

కోహ్లికి ధోనీ చెప్పిన ‘విజయ’ రహస్యం


JANASENA

Recommended Posts

02brk-crivirt1.jpg

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత సుదీర్ఘ పర్యటన ఇంగ్లాండ్‌ను భంగపాటుకు గురిచేసింది. ఆతిథ్య జట్టుతో జరిగిన టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లు కోల్పోయి క్లీన్‌స్వీప్‌ అయింది. పర్యటనలో చిట్టచివరి నిర్ణయాత్మక టీ20 మ్యాచ్‌లోనైనా నెగ్గి ఒక్క సిరీస్‌నైనా చేజిక్కించుకొని సంతోషంతో వెనుదిరగాలన్న ఆశను సైతం కోహ్లిసేన బుధవారం అడ్డుకుంది.

బెంగళూరు చిన్నస్వామి వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్‌ 75 పరుగుల తేడాతో అద్భుత విజయంతో చిరునవ్వులు చిందిస్తూ టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌తో పాటు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాజీ కెప్టెన్‌ ధోనీ ఇచ్చిన సలహాలపై కోహ్లీ స్పందించాడు.

పరిమిత ఓవర్ల క్రికెట్‌కు సారథ్యం వహించడం కొత్తైనప్పటికీ సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడంలో మహీ అపార అనుభవం తనకు ఉపయోగపడిందని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. తాను టెస్టు జట్టుకు నాయకత్వం వహించినప్పటికీ వన్డే, టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు వేగంగా ముగుస్తాయన్నాడు. మ్యాచ్‌ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు చెత్త నిర్ణయాలు తీసుకోవడం కన్నా సారథిగా ఎక్కువ అనుభవం ఉన్న ధోనీ సూచనలు తీసుకోవడం మంచిదని కోహ్లీ పేర్కొన్నాడు.

02brk-crivirt2.jpg

అక్కడే మలుపు.. 
‘ఇంగ్లాండ్‌ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టిన యుజవేంద్ర చాహల్‌ (6/25) ఓవర్లు ముగిసిన తర్వాత హర్దిక్‌ పాండ్యను బౌలింగ్‌కు దించాలనుకున్నాను. కానీ ధోనీ, సీనియర్‌ బౌలర్‌ ఆశీష్‌ నెహ్రా యువ సంచలనం బుమ్రాకు బంతినివ్వాలని సూచించారు. 19వ ఓవర్‌ వరకు అతణ్ని పక్కకు పెట్టడం అనవసరమని తెలిపారు. బంతి అందుకున్న బుమ్రా కేవలం మూడు బంతుల్లోనే రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను ముగించాడు’ అని కోహ్లీ అన్నాడు. కీలకమైన ఈ మ్యాచ్‌లో ధోనీ, నెహ్రాను చాలా సలహాలు అడిగినట్లు విరాట్‌ నిర్మొహమాటంగా చెప్పాడు. అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన సారథికి చాలా ఉపయోగపడతాయని కోహ్లీ వెల్లడించాడు.

సంతృప్తికరం.. 
‘ప్రస్తుతం టీమిండియాలో ఎక్కువ మంది యువ క్రికెటర్లు ఉన్నారు. అంతే వేగంగా జట్టు కూడా పురోగతి సాధించింది. మేము కోరుకున్నట్లుగానే ఫలితాలూ వచ్చాయి. మూడు సిరీసుల్లో విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. టీ20ల్లో ఓపెనర్‌గా రావడం సంతృప్తినిచ్చింది. మధ్య ఓవర్లలో చాహల్‌ వికెట్లు తీయడంతో విజయం సులువైంది’ అని కోహ్లి పేర్కొన్నాడు.

02brk-crivirt3.jpg
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...