Jump to content

Socialtrade.biz scam


TampaChinnodu

Recommended Posts

NOIDA:  Three persons alleged to have duped nearly 6.5 lakh people of Rs. 3,700 crore through an online portal have been arrested by the Uttar Pradesh police. Busting one of the biggest internet frauds, the Special Task Force (STF) of the police arrested the trio of Anubhav Mittal, Sridhar Prasad and Mahesh Dayal from Sector 63 in Noida on Wednesday and seized nearly Rs. 500 crore.
 
 
"The accused used to run a portal 'socialtrade.biz' under which an investor had to pay anything between Rs. 5,750 to Rs. 57,500 in the company's account to become the member and earn Rs. 5 per click.

"Registered under the name of Ablaze Info Solutions Pvt Ltd in Noida, they used to constantly change the portal's name. So far, they defrauded over 6.5 lakh people collecting around Rs. 3,700 crore," Superintendent of Police (Uttar Pradesh, STF) Triveni Singh, told IANS.

Mittal, said to be the kingpin, holds a B Tech degree and hails from Ghaziabad. Prasad is from Andhra Pradesh's Visakhapatnam and Dayal is from Mathura in Uttar Pradesh.

Launched in August 2015, the portal offered four different 'packages' to the investors to earn money. After paying the money to the company, the investors were asked to like pages and click on the links they were sent.
 
 

"The company claimed it earned Rs. 6 for every click and gave Rs. 5 of it to the investors. However, the links sent by the company were fake," said the officer, adding that they were looking for other people suspected to be involved in the fraud.

Besides seizing Rs. 500 crore from a bank, police have seized various documents including the balance sheet of the company, list of directors and other officials and list of investors.

The STF has also informed the Reserve Bank of India (RBI), the Income Tax department and market regulator SEBI about the case.
Link to comment
Share on other sites

హైదరాబాద్‌లో సోషల్‌ట్రేడ్‌ ప్రకంపనలు 
ప్రధానికి ఆన్‌లైన్‌లో 4,500 మంది ఫిర్యాదు 
వేల మంది సభ్యులు.. రూ.300 కోట్లకు పైగా పెట్టుబడులు

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ ప్రకటనలు క్లిక్‌ చేస్తే రూ.లక్షల ఆదాయం వస్తుందంటూ మోసాలకు పాల్పడిన సోషల్‌ట్రేడ్‌ సంస్థ హైదరాబాద్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. డిజిటల్‌ మార్కెటింగ్‌ పేరుతో మోసపోయామంటూ ఒక సాఫ్ట్‌వేర్‌ సంస్థలోని ఇంజినీర్లు, ఉద్యోగులు, వారి బంధువులు 4,500 మంది ప్రధాని మోదీకి ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. ఒక్క క్లిక్‌కు రూ.5 చొప్పున రోజుకు రూ.500, రూ.1000 వరకూ లాభం వస్తుందని నమ్మిన సభ్యులు హైదరాబాద్‌లో వేల సంఖ్యలో ఉన్నారని పోలీసులు అంచనా వేశారు. సోషల్‌ట్రేడ్‌ (3డబ్ల్యూ డిజిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌) డైరెక్టర్‌ అనుభవ్‌ మిట్టల్‌ను రెండు రోజుల క్రితం ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు అరెస్ట్‌ చేయడంతో ఈ కంపెనీలో సభ్యులు ఆందోళనకు లోనయ్యారు. సోషల్‌ట్రేడ్‌లో హైదరాబాద్‌వారు రూ.300 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారని అంచనా. సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు, కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ సోషల్‌ట్రేడ్‌ బృందాలున్నాయి. సోషల్‌ట్రేడ్‌ వెబ్‌సైట్‌ శుక్రవారం నుంచి పనిచేయకపోవడంతో రాచకొండ పోలీసులకు ఐదుగురు, సైబరాబాద్‌లో ఇద్దరు ఫిర్యాదు చేశారు. సోషల్‌ట్రేడ్‌, బాధితులకు మధ్య లావాదేవీల సాక్ష్యాలను తీసుకున్నాక కేసులు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు.

ఫ్రెండ్జ్‌అప్‌గా కంపెనీగా పేరు మార్పు 
సోషల్‌ట్రేడ్‌ పేరుతో కంపెనీని నిర్వహిస్తున్న అనుభవ్‌మిట్టల్‌ తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారన్న అనుమానంతో జనవరి 25న ‘ఫ్రెండ్జ్‌అప్‌’గా కంపెనీ పేరు మార్చాడు. సోషల్‌ట్రేడ్‌లో ఉన్న సభ్యులందరూ ‘ఫ్రెండ్జ్‌అప్‌’ కంపెనీకి మారిపోవాల్సిందిగా అభ్యర్థించాడు. ఇకపై ప్రకటనలు కాకుండా ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ తరహాలో వస్తువులను తక్కువ ధరకే విక్రయిస్తామని, వస్తువులు కొనుగోలు ద్వారా వచ్చే పాయింట్లను నగదుగా మార్చుకోవచ్చని వెబ్‌సైట్‌లో పేర్కొన్నాడు. ఈ-కామర్స్‌ వ్యాపారంగా మారిపోతున్న నేపథ్యంలో సభ్యులకు ప్రస్తుతం కన్నా ఎక్కువ లాభాలొస్తాయంటూ వివరించారు. సోషల్‌ట్రేడ్‌ ద్వారా నష్టపోయిన వారే ఎక్కువ మంది ఉన్నారని పోలీసుల అంచనా. ప్రైవేటు సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగుల్లో చాలామంది రూ.2 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. క్లిక్‌లు కొట్టిన మొత్తం సోమ, మంగళవారాల్లో బ్యాంకు ఖాతాల్లో పడుతుండడం, రెండు, మూడు నెలల్లోనే సభ్యత్వం మొత్తంలో 20 నుంచి 30 శాతం వరకూ తిరిగివస్తుండడంతో రోజూ కొత్తగా చేరుతున్నారు. హైటెక్‌సిటీలోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో 500 మంది ఇంజినీర్లు, సిబ్బంది ఆరు నెలల క్రితం సభ్యులుగా చేరారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమైనందున ప్రకటనలు క్లిక్‌ చేయడాన్ని కూడా విధుల్లో భాగంగా మార్చుకున్నారు. ఏడాది ప్రీమియం రూ.57,500 చెల్లించి సభ్యులుగా చేరిన వారికి వారం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడుతుండడంతో కుటుంబసభ్యుల పేరుతో కూడా సభ్యులుగా చేరారు. ఇలా ఆరునెలల వ్యవధిలోనే ఐదు వేల మంది సభ్యులయ్యారు. స్నేహితుల బలవంతంతో జనవరి 3న రూ.57,500 చెల్లించి సభ్యుడిగా చేరానని, అనుభవ్‌ మిట్టల్‌ను అరెస్ట్‌ చేశారన్న సమాచారంతో ఏం చేయాలో అర్ధంకావడం లేదని ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ‘ఈనాడు’కు చెప్పారు. శనివారం ఆన్‌లైన్‌ అభ్యర్థనను ప్రధానమంత్రికి పంపించాం. సోమ, మంగళవారాల్లో సైబరాబాద్‌ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...