Jump to content

నిద్రపుచ్చే యాప్లు


JANASENA

Recommended Posts

8brk109a.jpg

స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాక తమకు నిద్ర కరువైంది అని చాలామంది చెబుతుంటారు. అది నిజమే. అర్ధరాత్రి దాటినా.. ఈమెయిల్స్‌.. సోషల్‌ మీడియా.. చాటింగ్‌లు అంటూ ఫోన్‌ తెరలకు అతుక్కుపోయి నిద్రను నిర్లక్ష్యం చేసేస్తున్నారు. అయితే ఆ నిందను పూర్తిగా ఫోన్లపై వేయడం మానుకుని.. వాటిలో ఈ యాప్‌లను వినియోగించుకుంటే మాత్రం కంటినిండా నిద్రపోవచ్చు. నిద్రను మెరుగుపరచడమే కాదు.. కొన్ని శ్వాస సంబంధ రుగ్మతులపైనా ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచే వీలుంటుంది. అలా ఉపయోగపడే యాప్‌లను కొన్నింటిని చూద్దాం..

1. క్లాక్‌(ఐఓఎస్‌) 
ఐఓఎస్‌ 10 వెర్షన్‌లో కొత్తగా ఈ యాప్‌ అందుబాటులోకి వచ్చింది. దీనితో నిద్రను షెడ్యూల్‌ చేసుకోవచ్చు. రోజూ ఏ సమయానికి నిద్రపోవాలి? ఎన్నిగంటలకు లేవాలి? అన్న విషయాలను సెట్‌ చేయాలి. ఆ షెడ్యూల్‌ ప్రకారం నిద్ర పోవాల్సిన సమయం దగ్గరపడగానే ఈ యాప్‌ గుర్తు చేస్తుంది. అలాగే.. ఇందులోని స్మార్ట్‌ అలారమ్‌ పొద్దున్నే చక్కని మ్యూజిక్‌తో నిద్ర లేపుతుంది. రోజూ ఎంతసేపు నిద్ర పోతున్నారో కూడా రికార్డు చేసి ఫోన్‌లోని హెల్త్‌ యాప్‌కి పంపిస్తుంది. ఈ యాప్‌ను ఉచితంగా వాడుకోవచ్చు.

8brk109b.jpg

2. స్లీప్‌బోట్‌(ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌) 
ఈ యాప్‌తో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిద్ర పోవాలో షెడ్యూల్‌ చేసుకోవచ్చు. నిద్రలో ఉన్నప్పుడు గురక పెట్టినా.. మూలిగినా.. కదిలినా ఈ యాప్‌ రికార్డు చేసేస్తుంది. ఎంతసేపు గాఢ నిద్రలో ఉంటున్నాం? రోజురోజుకు ఎలాంటి మార్పు వస్తోంది? అన్న విషయాలనూ గ్రాఫ్‌ రూపంలో చూపిస్తుంది. దీన్ని ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

8brk109c.jpg

3. గో టూ బెడ్‌(ఐఓఎస్‌) 
నిద్ర పోవాల్సిన సమయానికి అరగంట ముందుగానే ఈ యాప్‌ గుర్తు చేస్తుంది. దీంతో ఆ అరగంటలో ఏదైనా పనుంటే పూర్తి చేసుకోవచ్చు. సెన్సర్ల ద్వారా నిద్ర నాణ్యతను రోజూ రికార్డు చేస్తూ హెల్త్‌యాప్‌కు సింక్‌ చేస్తుంది.

8brk109d.jpg

4. నాయిస్లి(ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌) 
సన్నని రాగాలు చెవిన పడుతుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. చాలామంది సంగీతం వింటూ నిద్రలోకి జారుకుంటారు. ఈ యాప్‌తో అలాంటి సంగీతాన్ని మనమే తయారు చేసుకోవచ్చు. వివిధ రకాల ట్యూన్‌లను మిక్స్‌ చేసుకోవచ్చు. గాఢ నిద్రలోకి వెళ్లగానే మ్యూజిక్‌ ఆగిపోయేందుకు ఈ యాప్‌లోనే టైమర్‌లో సెట్‌ చేసుకోవచ్చు. అయితే దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే రూ.120 చెల్లించాల్సి ఉంటుంది.

8brk109e.jpg

5. స్లీప్‌ జీనియస్‌(ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌) 
నాసా వ్యోమగాములకు సాయపడేలా ఈ యాప్‌ను రూపొందించారట. నిద్రలోకి జారుకునే వరకు మధురమైన మ్యూజిక్‌ను ప్లే చేస్తుంది. అలాగే ఒకేసారి మోగకుండా.. మెల్లమెల్లగా చప్పుడు చేస్తూ నిద్రలోంచి మేల్కొనేలా చేస్తుంది. ఎలా నిద్రపోతున్నామన్న విషయాలనూ రికార్డు చేస్తుంది. ప్రీమియం వెర్షన్‌లో కొన్ని అదనపు ఫీచర్లు ఉన్నాయి.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...