Jump to content

భారత్లో ‘అలీబాబా’ ఫ్రీ ఇంటర్నెట్


JANASENA

Recommended Posts

9brk68a.jpg

భారత్‌లో ఉచిత ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించేందుకు చైనా టెక్‌ దిగ్గజం ‘అలీబాబా’ కసరత్తులు చేస్తోంది. స్మార్ట్‌ఫోన్లలో పాపులరవుతున్న తన ‘యూసీ బ్రౌజర్‌’ సేవలను మరింత విస్తరించే దిశగా.. అలీబాబా ఈ ప్రయత్నం చేస్తోందట. ఇందుకోసం ఇప్పటికే దేశీయ టెలికాం ఆపరేటర్లు.. వైఫై ప్రొవైడర్లతో చర్చలు జరుపుతున్నట్లు ఆ సంస్థ అధికారి జాక్‌ హాంగ్‌ తాజాగా వెల్లడించారు.

‘‘చౌక ధరలతో భారతీయ వినియోగదారులకు మెరుగైన ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలన్న ప్రయత్నాల్లో ఉన్నాం. ఉచిత కనెక్షన్లూ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నాం. దీనికోసం దేశంలోని వైఫై ప్రొవైడర్లతోపాటు ఇతర వర్గాలతో మాట్లాడుతున్నాం’’ అని తెలిపారు.

ఈ సంస్థ అందించే డేటాతో యూసీ బ్రౌజర్‌ సేవలను ఉచితంగా వినియోగించుకునే వీలుంటుందన్న వూహాగానాలు వస్తున్నాయి.

అయితే.. అలా పరిమిత అప్లికేషన్లకే ఉచితం అంటే మాత్రం ఆ సంస్థకు భారత టెలికాం నియంత్రణ మండలి(ట్రాయ్‌) వద్ద చిక్కులు తప్పకపోవచ్చు. ఎందుకంటే.. గతేడాది ‘ఫ్రీబేసిక్స్‌’ పేరుతో సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ చేసిన ప్రయత్నానికి ట్రాయ్‌ ఒప్పుకోలేదు. అలా ఇవ్వడం నెట్‌ న్యూట్రాలిటీని దెబ్దతీయడమేనంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. మరి అలీబాబా చేసే ప్రయత్నం కూడా అలాంటిదేనా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...