Jump to content

Happy birthday jaga pathi babu


kakatiya

Recommended Posts

120216cinijaggub.jpg

ఇంటర్నెట్‌డెస్క్‌, ప్రత్యేకం: కుటుంబ కథా చిత్రాల హీరోగా ఓ ఇమేజ్‌ను సంపాదించుకున్న నటుడు జగపతిబాబు. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పక్కింటి కుర్రాడుగా ఉంటారు.. కాస్త సీరియస్‌గా కనిపిస్తారు.. ప్రేమికుడుగా, భర్తగా ఇలా ఏ పాత్ర పోషించినా అందులో రాణించి ప్రేక్షకుల్ని మెప్పించగలిగే నటుడాయన. మహిళా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఒకప్పుడు శోభన్‌బాబుకి ఓ ప్రత్యేక స్థానం ఉండేది. ఆయన చిత్రాలకు దూరమయ్యాక ఆ స్థానాన్ని జగపతిబాబు భర్తీ చేశారనే చెప్పాలి. ‘శుభలగ్నం’, ‘మావిచిగురు’, ‘సర్దుకుపోదాం రండి’ లాంటి చిత్రాలు జగపతిబాబుని కుటుంబ ప్రేక్షకులకు దగ్గర చేశాయి. ఆదివారం ఆయన పుట్టినరోజును జరుపుకొంటున్న సందర్భంగా శుభాకాంక్షలు చెబుదాం.

జగపతిబాబు 1962లో నిర్మాత, దర్శకుడు వి.బి.రాజేంద్ర ప్రసాద్‌ దంపతులకు మచిలీపట్నంలో జన్మించారు. చెన్నైలో పెరిగారు. తండ్రి సహాయంతో 1989లో ‘సింహస్వప్నం’ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. హిందీలో విడుదలైన ‘ఖత్రోంకే ఖిలాడీ’ సినిమాకి రీమేక్‌గా రాజేంద్రప్రసాద్‌ ఈ చిత్రాన్ని తీశారు. జగపతిబాబు ద్విపాత్రాభినయంలో నటించిన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఆ తర్వాత మలయాళంలో హిట్‌ అయిన కథతో ‘అడవిలో అభిమన్యుడు’ సినిమాను జగపతిబాబు రెండో సినిమాగా సిద్ధం చేశారు. ఈ చితాన్ని కూడా ఆయన తండ్రి రాజేంద్రప్రసాద్‌ అప్పు చేసి నిర్మించారు. సినిమా విడుదలైంది.. కానీ ఇదీ విజయం సాధించలేదు. ఇలాంటి సమయంలో నటుడు చలపతిరావు ‘జగన్నాటకం’ సినిమాలో జగపతిబాబుకు హీరో వేషం ఇచ్చారు. ఈ చిత్రం బాగా ఆడి.. ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. జనం కుర్రాడు కష్టపడ్డాడు అనుకున్నారు. సరిగ్గా అప్పుడే ఏఎం రత్నం ‘పెద్దరికం’ సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. మలయాళంలో పెద్ద హిట్‌ అయిన ‘గాడ్‌ఫాదర్‌’ సినిమాని తెలుగులో ఈ టైటిల్‌తో మొదలెట్టారాయన. ఈ సినిమాలో పాత్ర జగపతిబాబును వరించింది. సినిమా విడుదలై పెద్ద హిట్‌ సాధించింది. జగపతిబాబు, సుధాకర్‌ కలిసి నటించిన సన్నివేశాలు బాగా అలరించాయి. జగపతిబాబు కామెడీ, సెంటిమెంట్‌ చేయగలరని అర్థమైంది. అన్నింటికన్నా మించి ఆయన ఓ మంచి నటుడని అందరికీ తెలిసింది. ఈ సినిమా ఆయన నలుగురి దృష్టిలో పడేలా చేసింది.

ఇద్దరు గ్యాంగ్‌ల మధ్య గొడవల నేపథ్యంలో ‘శివ’ తర్వాత రామ్‌గోపాల్‌ వర్మ ‘గాయం’ తీయడానికి సిద్ధమయ్యారు. ఇందులో హీరోగా జగపతిబాబును ఎంచుకున్నారు. ‘సినిమా చేయగలవు కదా?’ అని వర్మ అడిగితే.. ‘నువ్వు వెనుక ఉంటావు కనుక చేయగలను’ అన్నారటజగపతిబాబు. ‘వెనకుంటాను ముందుంటానులాంటి మాటలు పక్కన పెట్టు, ఎవరున్నా లేకపోయినా చేయగలవు కదా’ అన్నారు వర్మ. ‘చేయడమే కాదు.. నువ్వే డబ్బింగ్‌ చెప్పాలి. నీ గొంతు నాకు కావాలి’ అన్నారు. ‘గాయం’ విడుదలైంది. మంచి హిట్‌ అందుకుంది. సినిమా వందరోజులు ఆడింది. ఆ తర్వాత ‘శుభలగ్నం’ చేశారు. ‘గాయం’ రఫ్‌ ఇమేజ్‌ నుంచి సాఫ్ట్‌ ఇమేజ్‌లోకి మారిపోయారు. సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో.. ఆయన కూడా సూపర్‌ హీరో అయ్యారు.

‘మావిచిగురు’, ‘శుభాకాంక్షలు’, ‘దొంగాట’, ‘పెళ్లి పందిరి’.. జగపతిబాబు కెరీర్‌లో బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ‘అంతఃపురం’ లాంటి మెరుపులున్నాయి. ‘బల రామకృష్ణులు’, ‘హనుమాన్‌ జంక్షన్‌’, ‘సందడే సందడి’ లాంటి మల్లీస్టారర్‌లూ ఉన్నాయి. ‘సామాన్యుడు’ లాంటి డీసెంట్‌ హిట్స్‌ ఉన్నాయి. జగపతిబాబును నిర్మాతల హీరో అంటారు. ఎందుకంటే.. నిర్మాత బాగుంటే జగపతిబాబు డబ్బు తీసుకుంటారు. నిర్మాత నష్టపోతాడని తెలిస్తే తనకు రావాల్సింది వదిలేస్తారు. అందుకేనేమో జగపతిబాబు తక్కువ కాలంలోనే వంద సినిమాలకుపైగా నటించారు.

మలుపు తిప్పిన ‘లెజెండ్‌’ 
సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. యువతరం దూసుకొస్తున్న తరుణంలో అగ్ర కథానాయకులూ వారికి దారివ్వాల్సిందే. అయితే అదే సమయంలో కొత్తదారి పట్టాల్సిందే. ఇదే చేశారు జగపతిబాబు. కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా పేరున్న ఆయన.. బాలకృష్ణ నటించిన ‘లెజెండ్‌’ చిత్రంతో ప్రతినాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. విలన్‌గా జగపతిబాబు నటనకు మరోసారి ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం తర్వాత ‘నాన్నకు ప్రేమతో’, ‘శ్రీమంతుడు’, ‘పిల్లా నువ్వులేని జీవితం’ లాంటి విజయవంతమైన చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారాయన. ఏదైనా సినిమాలో కీలక పాత్ర, అదీ ప్రతినాయక ఛాయలున్న పాత్ర అయితే దర్శక నిర్మాతల చూపు జగపతిబాబు వైపే పడుతోంది. ఇటీవల విడుదలైన ‘మన్యం పులి’లో డాడీ గిరిజ పాత్రలో ఒదిగిపోయారు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. ‘ఇజం’, ‘కత్తిసందాయ్‌’, ‘భైరవ’ చిత్రాల్లో ప్రధాన పాత్ర పోషించిన ఆయన ప్రస్తుతం ‘విన్నర్‌, ‘ఆక్సిజన్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆయన నటించిన ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కనిపించింది కొద్దిసేపైనా గుర్తుండిపోయే పాత్రను చేశారన. జగపతిబాబు ఇలాంటి మరిన్ని చిత్రాలతో వినోదం పంచాలని కోరుకుంటూ మరోసారి శుభాకాంక్షలు చెబుదాం.

120216cinijaggua.jpg

పర్సనల్‌ టచ్‌ 
* ముద్దుపేరు: చౌ 
* చదువు: బి.ఎ 
* అభిమాన నటులు: ప్రత్యేకించి ఎవరూ లేరు! 
* ఇష్టమైన ఆహారం: పప్పుచారు లాంటి స్వచ్ఛమైన ఆంధ్రా వంటకాలు 
* మెచ్చే డ్రింక్‌: కోక్‌ 
* ఇష్టపడే దుస్తులు: జీన్స్‌, కాటన్స్‌ 
* నచ్చే రంగు: నలుపు 
* ఉపయోగించే కారు: లాన్స్‌ క్రూయిజర్‌ 
* నచ్చే పెర్‌ఫ్యూమ్‌: కాసాబ్లాంకా 
* ఇతరుల్లో నచ్చే గుణాలు: ప్రతి మంచి లక్షణం 
* బలం: సహనం 
* బలహీనత: మారిపోయే మూడ్స్‌ 
* ధ్వేయం: నటుడిగా పదికాలాలపాటు కొనసాగాలి

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...