Jump to content

Please donot scratch us


Jai_MegaStar

Recommended Posts

అమెరికా వెళ్లనున్న భారతీయ ఐటీలాబీ 

ముంబయి: కీలకమైన భారతీయ ఐటీ సంస్థలు అన్నీ కలిసి లాబీగా ఏర్పడి వచ్చే 24వ తేదీన అమెరికాను సందర్శించనున్నాయి. అమెరికాలో హెచ్‌1బీ వీసాలపై నిబంధనలను కఠినతరం చేసే ప్రతిపాదన ఉండడంతో వీరు అమెరికా వెళ్లాలని నిశ్చయించుకున్నారు. వీరు ట్రంప్‌ కార్యవర్గాన్ని కలుసుకొని ఇరుదేశాల మధ్య నైపుణ్యం ఉన్న మానవవనరుల రాకపోకలకు అవకాశాలపై చర్చించనున్నారు. భారతీయ ఐటీ రంగం అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగ సృష్టికి, ఉద్యోగ రక్షణకు చేస్తున్న కృషిని వివరిస్తామని నాస్‌కామ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శివేందర్‌ సింగ్‌ తెలిపారు. దీనిపై నాస్‌కామ్‌ అధ్యక్షుడు ఆర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ‘భారతీయ ఐటీ పరిశ్రమ అమెరికా ఆర్థిక వ్యవస్థలోకి ఎంతో మేధోసంపత్తిని తీసుకొస్తోంది అనే విషయం అక్కడి వారికి వివరిస్తా’మని తెలిపారు.

భారతీయ ఐటీ రంగం అమెరికా నుంచి 65శాతం(155బిలియన్‌ డాలర్ల)ఆదాయాన్ని పొందుతోంది. మొట్టమొదటి సారి భారతీయ ఐటీ రంగం అనిశ్చితి కారణంగా 2017-18లో మందకొడిగా ఉంటుందని ఇప్పటికే నివేదికలు వస్తున్నాయి.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...