Jump to content

పోలీసులకు చుక్కలు చూపించిన లవర్స్!


JANASENA

Recommended Posts

22brk-kerala-lovers.jpg

తిరువనంతపురం: సాధారణంగా పార్కులో ప్రేమజంటలు పోలీసులు కనిపిస్తే పరుగులంకించుకుంటారు. లేదా అంతో ఇంతో ముట్టజెప్పే ప్రయత్నం చేస్తారు. కేవలం కూర్చున్నంత మాత్రాన తప్పేమీ లేకపోయినా పోలీసులకు భయపడి ఇలా చేస్తుంటారు కొందరు. ఆ ప్రేమ జంట మాత్రం అలా చేయలేదు. పోలీస్‌స్టేషన్‌కు రావాలంటూ కోరిన పోలీసులను తామేం తప్పు చేశామో ముందు చెప్పాలంటూ ఎదురు ప్రశ్నించారు. అంతేకాదు దీన్నంతా ఫేస్‌బుక్‌ లైవ్‌లో ప్రసారం చేశారు. ఆ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్‌ అయ్యింది.

కేరళలోని తిరువనంతపురంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఓ పబ్లిక్‌ పార్కులో విష్ణు, ఆర్తి అనే ప్రేమజంట ఉండగా ఇంతలో ఓ మహిళా కానిస్టేబుల్‌ వారి వద్దకు వచ్చింది. ‘పోలీస్‌స్టేషన్‌కు పదండి’ అంటూ హుకుం జారీ చేసింది. అందుకు ఆ ప్రేమజంట నిరాకరించింది. తొలుత ఎందుకు పోలీస్‌స్టేషన్‌కు రావాలని ఆ ప్రేమ జంట ప్రశ్నించింది. ‘బహిరంగ ప్రదేశాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు మీరు ముందు పోలీస్‌స్టేషన్‌ పదండి’ అంటూ మరోసారి మహిళా కానిస్టేబుల్‌ వారిని కోరింది. దీంతో విష్ణు ఫేస్‌బుక్‌ లైవ్‌ సాక్షిగా సదరు మహిళా కానిస్టేబుల్‌పై ప్రశ్నల వర్షం కురిపించాడు. ‘ఇక్కడ ఏం అసభ్యకర దృశ్యాలు కనపడ్డాయో చెప్పండి? ముద్దు పెట్టుకున్నామా? కౌగిలించుకున్నామా? కేవలం ఒకరి భుజంపై ఒకరు చేయి వేసుకున్నాం అంతే కదా!’ అంటూ సమాధానమిచ్చాడు. ఇలా కొంతసేపు పోలీసులకు ప్రేమజంటకు వాగ్వాదం నడిచిన తర్వాత సదరు మహిళా కానిస్టేబుల్‌ తన సహచరులతో కలిసి వాళ్లిద్దరినీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారికి రూ.200 జరిమానా విధించారు. తామేమీ తప్పు చేయనప్పటికీ పోలీసులు తమకు జరిమానా విధించారని, తమ ప్రశ్నలకు మాత్రం వారు సమాధానమివ్వలేదని ప్రేమికురాలు ఆర్తి పేర్కొంది. తాము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని తెలిపింది. 

 
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...