Jump to content

యూఎస్లో జాబ్ పోయేవారి పరిస్థితేంటి?


JANASENA

Recommended Posts

అయిదు ప్రముఖ కంపెనీల సలహా తీసుకోనున్న ట్రంప్‌ 
23brk122-trump1.jpg

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి పాలనకు సంబంధించి తనదైన శైలిలో అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు తమ వ్యాపారాన్ని ఇతర దేశాలకు ముఖ్యంగా భారత్‌, మెక్సికో, చైనాలకు తరలించేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఇప్పటికే ఆయా కంపెనీల్లో పనిచేస్తున్న అమెరికన్లు ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఉపాధి ఎలా కల్పించాలి? అనే దానిపై అయిదు ప్రముఖ కంపెనీల నుంచి అధ్యక్షుడు ట్రంప్‌ సలహా తీసుకోనున్నారు.

క్యాటర్‌ పిల్లర్‌, యునైటెడ్‌ టెక్నాలజీస్‌ కార్ప్‌, డానా, 3ఎం కో, జనరల్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీలు తమ వ్యాపారాన్ని మెక్సికో, చైనా, ఇండియా ఇతర దేశాలకూ తరలించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో యూఎస్‌ కార్మికశాఖ రికార్డులను ఓ ప్రముఖ వార్తా సంస్థ సేకరించి విశ్లేషించింది. అయిదు కంపెనీలకు చెందిన ఎగ్జిక్యూటివ్‌లు గురువారం అధ్యక్షుడు ట్రంప్‌ను కలవనున్నారు. కంపెనీలు విదేశాలకు తరలిపోవడంతో ఉపాధి కోల్పోయే వారికి ఉద్యోగులను కల్పించే విషయంపై ఆయా కంపెనీలు ఇచ్చే సలహాలను ట్రంప్‌ తీసుకోనున్నారు.

అమెరికాలో ఉన్న ఆ కంపెనీలను తరలించడం ద్వారా వచ్చే రెండేళ్లలో ఈ అయిదు కంపెనీలకు చెందిన మొత్తం 2,300మంది కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు. కంపెనీలు సైతం విషయాన్ని స్పష్టం చేశాయి. అయితే ఈ విషయంపై చర్చించేందుకు ట్రంప్‌ను కలవడానికి ప్రస్తుతం వెళ్లే వారిలో ఉన్న 19మంది ఎగ్జిక్యూటివ్‌లు ఆఫ్‌షోరింగ్‌కి వెళ్తున్నారా అన్నది స్పష్టంకాలేదు. సమావేశానికి వస్తున్న కంపెనీలు కల్పించిన ఉద్యోగాలను బట్టి చూస్తే కోల్పోయే ఉద్యోగాల సంఖ్య చాలా స్వల్పమేనని తెలుస్తోంది. ఎందుకంటే ఒక్క జనరల్‌ ఎలక్ట్రిక్‌లోనే మొత్తం 125,000 మంది అమెరికన్లు ఉద్యోగులుగా ఉన్నారు.

ఎన్నికల ప్రచారంలోనూ తర్వాత వైట్‌హౌస్‌కి వచ్చాక కూడా ట్రంప్‌ గ్లోబలైజేషన్‌ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. దాని వల్ల తక్కువ జీతాలిచ్చే దేశాలు లబ్ధిపొందాయని, వదిలేసిన, తక్కువ ఉద్యోగులున్న కంపెనీలతో అమెరికా చెత్తకుప్పలా తయారైందని వ్యాఖ్యానించారు. అమెరికా ఉద్యోగాలను కాదని విదేశాలకు వెళ్లే కంపెనీలపై పన్నులు విధిస్తానని భయపెట్టారు.

ప్రస్తుత సమావేశంలో వ్యాపారాలను ఇతర దేశాలకు తరలించే అంశంపై వారి కారణాలను తెలుసుకోవడానికి ట్రంప్‌ వ్యాపారవేత్తలతో మాట్లాడతారని శ్వేతసౌధం అధికారులు తెలిపారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...