Jump to content

దేశంపై ప్రేమా? ద్వేషంపై వ్యామోహమా?


sri_india

Recommended Posts

విద్వేష విషం అమెరికా సమాజానికి నిలువెల్లా పాకుతోంది. అక్కడ అంతర్లీనంగా ఉన్న శ్వేత జాత్యహంకారాగ్నికి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలు, విధానాలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. దానికి పరాకాష్ఠే తాజాగా తెలుగు యువకుడి హత్య. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన నాటి నుంచి ట్రంప్‌ నమ్ముకున్న విధానం విద్వేషమే. జాతీయ అభిమానం మాటున జాత్యహంకారాన్ని నూరిపోస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు అమెరికాలోని శ్వేతజాతీయుల్లో నిద్రాణంగా ఉన్న విద్వేష భావాలకు ఇనుప రెక్కలు తొడిగాయి. ఫలితం.. ఇప్పుడు విదేశీయులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి. ఎప్పుడు తమను వెళ్లగొడతారో.. అసలు ప్రాణాలతో వెళ్లనిస్తారో లేదో అన్నంత భయం ఇప్పుడు అమెరికాలోని ఇతర దేశస్థులందరినీ వెంటాడుతోంది.

విద్వేషానికి మూలాలెక్కడ..? 
విద్వేషానికి మూలం వివక్షే. జాతి, కులం, మతం, వైకల్యం, లింగభేదం, భాష, ప్రాంతం, రంగు, రూపం ఇలా ఎన్నో రకాలైన వివక్ష కనిపిస్తుంది. దీని తీవ్ర రూపమే విద్వేషం. భౌతిక దాడులు, ఆస్తి నష్టం కలిగించడం, లైంగిక దాడులు, బెదిరించడం, దూషించడం, అవమానించడం వంటివన్నీ దీని ఫలితాలే.

అమెరికా సమాజంలో విద్వేష నేరాలు ఈనాటివి కావు. వీటిని అరికట్టడానికి, ఇలాంటి నేరాలకు పాల్పడినవారిని శిక్షించడానికి 1871లోనే తొలిసారి చట్టం చేసినా, ఆ తరువాత మరింత పదునైన చట్టాలు తీసుకొచ్చినా సమస్య మాత్రం ఇంతవరకు పూర్తిగా సమసిపోలేదు. పైగా ఇప్పుడు మరింత తీవ్రరూపం దాల్చుతోంది. నల్లజాతీయులపై వివక్షతో మొదలైన ఈ దురహంకారం ఇప్పుడు ఏకంగా మిగతా ప్రపంచాన్నే ద్వేషించే స్థాయికి చేరింది.

24hyd-story1d.jpg

ట్రంప్‌ పాత్రేమిటి? 
దేశమంటే అభిమానం.. దేశ ప్రజల ప్రయోజనాలకే పెద్దపీట అంటూ ట్రంప్‌ ఎత్తుకున్న విధానం జాతీయతా భావంలా కనిపిస్తూనే అతివాదంగా మారిపోయింది. ‘‘అమెరికా అమెరికావాళ్లదే’’ అన్న ఆయన నినాదం రణనాదమైపోయింది. ఉద్యోగాల కోసం వచ్చే ఇతర దేశస్థులు ఇప్పుడు వారికి శత్రువులు. ఛీత్కరింపులతో మొదలై బెదిరింపులు.. ఇప్పుడు ఏకంగా ప్రాణాలు తీసేవరకు వచ్చింది. అధ్యక్షుడే విద్వేషాగ్ని చిమ్ముతుంటే ఇక అడ్డేముంది అన్నట్లుగా తయారైంది.

న్యాయస్థానాలకే హెచ్చరికలు 
ఏడు దేశాల నుంచి వలసలను నిషేధిస్తూ తీసుకొచ్చిన అత్యవసరాదేశాలను నిలిపివేసిన ఉన్నత న్యాయస్థానాలనే అధ్యక్షుడు ట్రంప్‌ బెదిరించడం శ్వేతఅతివాదులకు మరింత బలమిచ్చింది. న్యాయస్థానాలు ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్తు పర్యవసానాలకు వారిదే బాధ్యత అంటూ ట్రంప్‌ చేసిన బాధ్యతారహిత వ్యాఖ్యలు విద్వేషనేరగాళ్లు బరితెగించడానికి పరోక్ష కారణమయ్యాయి.

24hyd-story1b.jpg

24hyd-story1c.jpg



ఎందుకీ ధోరణి 
* తామే అధికులమన్న అహంకారం 
* ఇతర దేశస్థులు వచ్చి తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న ఆగ్రహం 
*రాజకీయ ప్రేరేపిత విపరీత భావజాలం 
*అమెరికా సమాజంలో వేళ్లూనుకుపోయిన నేర స్వభావానికి విద్వేషం తోడవడం.. ట్రంప్‌ ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించడం

ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక.. 
*అమెరికా ఎన్నికలు జరిగిన గత ఏడాది నవంబరు 8 తరువాత ట్రంప్‌ విజయం ఖరారు కావడంతో విద్వేషం జడలు విప్పింది. కేవలం 10 రోజుల్లోనే 867 విద్వేష నేరాలు నమోదయ్యాయి. ఇందులో ముస్లింలు లక్ష్యంగా జరిగినవి 301. 
*నెల రోజుల్లో మొత్తం 1094 ఘటనలు పోలీసుల వరకు రాగా అందులో 13 తప్ప మిగిలినవన్నీ వాస్తవాలని తేలాయి. 
*అమెరికాలోని ప్రతి రాష్ట్రం ఇలాంటి ఘోరాలకు వేదికైంది.

వేధింపులు, బెదిరింపులు 
*ముఖ్యంగా ముస్లింలు, మెక్సికోవారు, ఆసియా దేశాలకు చెందినవారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. 
*ఆసియాదేశాలవారు నివసించే చాలాచోట్ల ఇళ్ల ముంగిట ‘మీరు మీ దేశం పొండి’ అంటూ బెదిరింపు లేఖలు ఉంచారు. 
*‘ట్రంప్‌ బోధించే విద్వేషమంటే మాకు ప్రేమ’ అంటూ ఇతర దేశస్థులకు చెందిన కార్లు, ఇంటి గోడలపై రాతలు రాయడం అధికమైంది. 
* అకారణంగా దాడి చేసి కొట్టిన ఘటనలు చాలా ఉన్నాయి. 
*మొరాకోకు చెందిన ముస్లిం కారు డ్రైవరుపై న్యూయార్క్‌లో స్థానికులు కొందరు దారుణంగా దాడి చేశారు.



ట్రంప్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

* అమెరికాను చైనా, జపాన్‌, భారత్‌, వియత్నాం వంటివన్నీ దోచుకుంటున్నాయి. వాటినుంచి మన ఉద్యోగాలను వెనక్కు తెచ్చుకుందాం. 
* మెక్సికో నుంచి ఎవరూ రాకుండా గోడ కట్టేస్తా.. 
* అమెరికాపై చైనా అత్యాచారానికి పాల్పడుతోంది. మనకు ఇబ్బందులు కలిగిస్తోంది.

Link to comment
Share on other sites

5 minutes ago, KalyanBabu said:

enti antha scene ledu?

Yooh.............k.#4$.......USA is known for racist attacks before thata.....sorry for the loss of a good man......but I love USA as a citizen......stop exaggerating in Indian news channels

Link to comment
Share on other sites

2 hours ago, Spell_Hunter said:

ade vere country vaadu vocchi india lo indians ki job lekunda cheste etta untadi hypocrisy at peaks  damn

udhyamam antaaru ani KCR uncle, thackery uncle PM chesaaru naaku

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...