Jump to content

నష్టంలేదు.. మన కోసం కష్టపడుతున్నారు.. వారెన్ బఫెట్


JANASENA

Recommended Posts

brk128.jpg

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం : అమెరికాలో కొద్ది రోజులుగా ఇతర దేశస్థులపై జరుగుతున్న దాడులపై ప్రముఖ వ్యాపారవేత్త వారెన్‌ బఫెట్‌ స్పందించారు. అమెరికాకు ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి వలసలు రావడంతో నష్టం ఏం జరగలేదని పైగా మరింత మేలు జరుగుతోందని తన కంపెనీ బెర్క్‌షైర్‌ హాత్‌వే వాటాదారులకు రాసిన లేఖలో వెల్లడించారు. అమెరికన్ల తెలివితో పాటు మార్కెట్‌ విధానం, కష్టించి పనిచేసే వలస ప్రజలు, పటిష్టమైన న్యాయవ్యవస్థ... తదితర అంశాలతో అమెరికన్‌ స్వాతంత్య్రయోధులు, ప్రజాస్వామ్యనిర్మాతలు ఆశించిన దాని కంటే ఎక్కువగా అభివృద్ధిని సాధించామన్నారు. విదేశాల నుంచి వచ్చే వృత్తి నిపుణుల అడ్డుకోవడానికి హెచ్‌1 బీ వీసాలను తగ్గించాలన్న యోచనలో ట్రంప్‌ ప్రభుత్వం ఉండటం తెలిసిందే. ఈ సమయంలో బఫెట్‌ లేఖ ట్రంప్‌ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగిస్తుందని అంతర్జాతీయ ప్రజాస్వామ్యవాదులు అభిప్రాయపడుతున్నారు.

భారతీయుల ముందంజ... 
కష్టించి పనిచేసే తత్వంతో పాటు ఏ దేశంలో ఉన్నా ఆ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడంలో భారతీయులు ముందుంటారు. గూగుల్‌కు సుందర్‌ పిచ్చై, మైక్రోసాఫ్ట్‌కు సత్యా నాదెళ్ల, పెప్సీ కంపెనీకి ఇంద్రా నూయి, మాస్టర్‌కార్డ్‌ సీఈవోగా అజయ్‌ బంగా, అడోబ్‌ సీఈవోగా శంతను నారాయణ్‌... తదితరులు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసింది.

అమెరికన్‌ ఆర్థికవ్యవస్థకు చేయూత 
భారతీయులు ఎక్కువమంది అమెరికాకు వెళ్లి ఉద్యోగాలు చేయడం ద్వారా అమెరికన్‌ ఆర్థికవ్యవస్థకు చేయూతనిస్తున్నారని ‘నాస్‌కామ్‌’ తన నివేదికలో పేర్కొనడం గమనార్హం. భవిష్యత్తులో అమెరికాకు లక్షల సంఖ్యలో కంప్యూటర్‌ నిపుణులు అవసరమవుతారని తెలిపింది. అమెరికాలో నాలుగు లక్షలకుపై కొత్త ఉద్యోగాల కల్పనకు భారతీయ ఐటీ కంపెనీలు సాయపడినట్టు తెలుస్తోంది. 2011 నుంచి 2013 వరకు రెండు బిలియన్‌ డాలర్లను భారత ఐటీ కంపెనీలు అమెరికాలో పెట్టుబడులు పెట్టిన అంశాన్ని నివేదిక ఉదహరించింది. 2011 నుంచి 2015 వరకు పన్నుల రూపంలోనే భారతీయ ఐటీ కంపెనీలు 20 బిలియన్‌ డాలర్లను అమెరికాకు చెల్లించాయి. కార్పోరేట్‌ సాంఘిక భద్రత కింద అమెరికాలో ఆరోగ్య పరిరక్షణ, సమాజ సంక్షేమం... తదితర పథకాలకు భారతీయ కంపెనీలు భారీ మొత్తంలో విరాళాలను అందజేశాయి. అమెరికాకు ఇతర దేశాలనుంచి వచ్చి ఉద్యోగాలు చేసేవారి కంటే భారతీయ కంపెనీల్లో పనిచేస్తున్న స్థానిక అమెరికన్లకే ఎక్కువగా వేతనాలు చెల్లిస్తున్నట్టు నాస్‌కామ్‌ వెల్లడించింది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...