Jump to content

భారతీయుడి హత్యపై ట్రంప్ మాట్లాడాలి హిల్లరీ డిమాండ్


JANASENA

Recommended Posts

28brk-hillary1.jpg

హ్యూస్టన్‌: అమెరికాలో జాత్యహంకార దాడిలో తెలుగు యువకుడు శ్రీనివాస్‌ కూచిభొట్ల మరణించిన నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్‌ స్పందించారు. అమెరికాలో పెరుగుతున్న విద్వేషపూరిత నేరాలపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించాలని ఆమె డిమాండ్‌ చేశారు. బెదిరింపులు, జాత్యహంకార నేరాలు పెరుగుతున్నందున ట్రంప్‌ బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉందని హిల్లరీ ట్వీట్‌ చేశారు. శ్రీనివాస్‌ భార్య సునయన విలేకరులతో ఉద్వేగంగా ‘మైనార్టీల రక్షణకు ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు సమాధానం కావాలంటూ’ ఇటీవల అమెరికాలో మాట్లాడినప్పటి వార్తను హిల్లరీ ట్వీట్‌తో పాటు పోస్ట్‌ చేశారు.

కేన్సస్‌ ఘటనపై అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటివరకు స్పందించలేదు. ఓలెత్‌ నగరంలోని బార్‌లో శ్వేతజాతీయుడు జరిగిన కాల్పుల్లో శ్రీనివాస్‌ మరణించగా, అలోక్‌ అనే తెలుగు యువకుడు, మరో శ్వేతజాతీయుడు ఇయాన్‌ గ్రిల్లాట్‌ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ట్రంప్‌ నేరుగా స్పందించలేదు. కానీ వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ సీన్‌ స్పైసర్‌ మాట్లాడారు. కేన్సస్‌ ఘటన చాలా బాధ కలిగించిందని అన్నారు. అయితే ఇది జాత్యహంకార నేరమని ఇంత తక్కువ సమయంలో చెప్పలేమన్నారు. అమెరికాలో వారి వారి సంప్రదాయాలు, పద్ధతులు పాటించడానికి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని, అమెరికా ప్రధాన సూత్రమైన దీన్ని కాపాడడానికి అధ్యక్షుడు కట్టుబడి ఉన్నారని స్పైసర్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అధ్యక్షుడు ట్రంప్‌ త్వరలోనే ఈ ఘటనను బలంగా ఖండిస్తారని ఆయన తెలిపారు.

28brk-hillary2.jpg

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...