Jump to content
People were interested in these podcasts

Orey Jaffa JAgan - First know about the Collector in Krishna Distrcit


sarkaar

Recommended Posts

కృష్ణా జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబుది సెంట్రల్ జైలుకు వెళ్ళే చరిత్ర కాదు... ప్రెసిడెన్షియల్ అవార్డు తీసుకునే చరిత్ర... ప్రధాన మంత్రి దగ్గర అవార్డు తీసుకునే చరిత్ర... సాంకేతికి విజ్ఞానానిన అందిపుచ్చుకుని ‘ఇ’ పరిపాలనలో సిద్ధహస్తుడు ఆయన... కూల్‌గా కనిపించినా కరకుదనం పాళ్ళు కాస్త ఎక్కువ ఉన్న ఈ ఐఏఎస్‌ అధికారి అంటే అధికారులు హడలెత్తిపోవాల్సిందే... చంద్రబాబు ఈయన్ని రిలీవ్ చేస్తే, ఇప్పటికిప్పుడు సెంట్రల్ కు తీసుకుపోవాటానికి కేంద్రం రెడీ గా ఉన్నారు... అలాంటి ఈ అధికారిని పట్టుకుని, "గుర్తుపెట్టుకో నిన్ను సెంట్రల్ జైలుకు పంపిస్తా" అని అంటున్నారు అంటే....

కేరళ రాష్ర్టానికి చెందిన అహ్మద్‌ బాబు 2003 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన వారు. ఐఏఎస్‌ల బదిలీలలో ఆంధ్రకు కేటాయింపు అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా, ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. అహ్మద్‌ బాబుకు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఎక్కువ. ఆన్‌లైన్‌ సేవలు, ఆన్‌లైన్‌ పరిపాలన సాగించడంలో దిట్ట. ఏది చేసినా ప్రభుత్వానికి సొమ్ము ఆదా చేయడం, ప్రజలకు సౌకర్యాలు సక్రమంగా అందేలా చేయడమే పరమావధి పని చేస్తారు కృష్ణా కలెక్టర్ అహ్మద్ బాబు.

కలెక్టర్ అహ్మద్ బాబు చేసిన కొన్ని పనులు, ఆంద్ర రాష్ట్రానికే కాదు, దేశానికే ఆదర్శం అయ్యాయి... ఆ స్థాయిలో గుర్తింపు కూడా వచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా, నీతి ఆయోగ్ లాంటి వారు కూడా కలెక్టర్ అహ్మద్ బాబుని అభినందించారు. ఎంతో మంది ట్రైనీ ఐఏఎస్ లకు ఆదర్శం ఈయన... దేశంలో చాలా రాష్ట్రాల ఐఏఎస్ లు, కలెక్టర్ బాబు దగ్గరకు వచ్చి, ఆయన చేసిన పనులు అధ్యయనం చేసి, నేర్చుకున్న సందర్భాలు ఎన్నో....

కలెక్టర్ బాబు కృష్ణా జిల్లాకు వచ్చి రెండేళ్ళ పూర్తి అయ్యింది. ఈ రెండేళ్ళలో టెక్నికల్ గా ఆయన ఎన్నో పనులు చేశారు. అవన్నీ సీఎం చంద్రబాబుతో పాటు పలువుర్ని ఆకర్షించడం ఒక ఎత్తయితే జిల్లాలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, ఉద్యోగులు ఆయన తీరు పట్ల విముఖతతో ఉన్నవారు ఉన్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు కలెక్టర్ వైఖరి పట్ల సుముఖంగా లేరు. ముక్కు సూటిగా ఉంటూ, చేసే పని కరెక్ట్ అనుకుంటేనే పని చేసే మనస్తత్వం, అధికార పార్టీ నాయకులకు నచ్చలేదు. అలాగే తరుచూ సమీక్షలు, సమావేశాలు అంటూ, కింద స్థాయి ఉద్యోగులు ఇబ్బంది పడేవారు. ఆయనను ఎలా అయినా బదిలీ చేయించాలి అని, అన్ని విధాలుగా ప్రయత్నించారు. కాని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ బాబు పనితనం నచ్చి, ఏ విధమైన ఒత్తిడులకు లొంగకుండా, కలెక్టర్ బాబుని కొనసాగించారు.

కలెక్టర్ బాబు చేసిన కొన్ని విప్లవాత్మకైన పనులు:

టెక్ కలెక్టర్ గా పేరు
రెవిన్యూ ఆఫీసంటే ఫైలు కదలదని... రెవిన్యూ అధికారులంటే... నత్తల్లా పనులు నడస్తాయని... అందరూ అనుకోవడం పరిపాటి. కానీ, కృష్ణా జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబును చూస్తే, చాలు.. పనులు స్పీడందుకుంటాయ్. ఆయన అధికార యంత్రాంగాన్ని పరుగులు తీయించడమే కాదు.. వారికి టెక్నాలజీని అలవాటు చేసి, అవినీతికి అడ్డుకట్ట వేస్తున్నారు. చిన్న చిన్నఉద్యోగుల్లో సైతం ట్యాబ్ల వినియోగంతో విదులు నిర్వహిస్తున్నారు. డిజిటల్ సిగ్నేచర్స్ ఆచరణలోకి వచ్చాయి. దశాబ్దాలుగా కలెక్టరేట్లో ఉన్న పాత ఫైళ్ళు కంప్యూటరీకరణ జరుగుతోంది. జిల్లాను టెక్నికల్ జిల్లాగా మార్చాలన్నదే కలెక్టర్ ఉద్దేశం.

Advertisements

ఆధార్‌ బాబు
ఆధార్‌ను ప్రవేశపెట్టంలో అహ్మద్‌ బాబుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే ఆయన్ను ఆధార్‌ బాబు అని పిలుస్తారు. ఆధార్ నమోదు, ఆన్‌లైన్‌లో రెవెన్యూ సేవలు, మీ సేవ, రేషన్‌కార్డులు, నగదు బదిలీకి సంబంధించి వంటగ్యాస్ వినియోగదారుల ఆధార్, బ్యాంక్ అకౌంట్ల సీడింగ్ అంశాలపై దృష్టిసారించి ప్రశంసలు పొందారు. ఆధార్ నమోదు విషయంలో జాతీయస్థాయి అవార్డును ఆ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా అందుకున్నారు.

రేషన్ వ్యవస్థలో అవినీతికి అడ్డుకట్టు
రేషన్ వ్యవస్థలో లక్షలాది రూపాయల దుర్వినియోగాన్ని ఈపోస్ విధానంతో అరికట్టగలిగారు అహ్మద్ బాబు. మనుషులు లేకుండా, కార్డులు రాయకుండా రేషన్ దుర్వినియోగం చేసే డీలర్లకు ఈపోస్ ద్వారా అహ్మద్ బాబు చెక్ పెట్టారు. దీనివల్ల ఒక్క కృష్ణా జిల్లాలోనే ఏటా 3 కోట్ల రూపాయలు ఆదా అయింది. దీనిని సిఎం చంద్రబాబు ప్రశంసించారు... ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలలో ఈపోస్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆదేశించారు.

కలెక్టర్ యాప్
కలెక్టర్ ఎప్పుడు ఎక్కడ నుంచి అయినా... కిందిస్థాయి అధికారులకు అందుబాటులో ఉండేలా కలెక్టర్ అహ్మద్ బాబు ఒక యాప్ తయారుచేశారు. దీనిని చూసి సిఎం ఆయన్ని అభినందించారు.

క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్‌కి దేశానికే ఆదర్శం
రేషన్ షాపుల్లోగాని, ఎరువుల దుకాణంలో గాని డబ్బు చెల్లించకుండా, కేవలం ఇ-ట్రాన్స్ఫర్ ద్వారా సరుకులు, ఎరువులు కొనుగోలు చేసే ఈ ఇంటరాఫరబుల్ విధానం కొత్తగా అమలు చేశారు. దీనికోసం ఆయన అన్ని బ్యాంకులు, వాణిజ్య సంస్థలతో విస్తృతంగా సమావేశాలు నిర్వహించారు. పెద్దనోట్ల రద్దు తరువాత ఏర్పడ్డ కరెన్సీ కొరతతో దేశమంతా నగదు రహిత లావాదేవీలు ప్రారంబించగా, ఆ ప్రక్రియ జిలాలో ఏడాది క్రితమే మొదలయింది. ఈ పోస్ అమలు, నగదు రహిత లావాదేవీలే కాకుండా ఇంకా ఎన్నో క్యాష్ లెస్ అంశాలు అమల్లోకి వచ్చయి.

సామాజిక సేవ
ఆయన ఎక్కడ పనిచేసినా.. ‘ప్రేరణ’ అనే సంస్థను ఏర్పాటు చేసి నడుపుతారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రేరణ అనే సంస్థను సొంతంగా ఆయన ఏర్పాటు చేసి.. ఉన్నతాధికారులు, అధికారులందరినీ ఇందులో భాగస్వాములను చేస్తారు.

పభుత్వ పధకాల అమలు
ప్రభుత్వ పధకాల అమలులోను ముందుండాలని తరచూ సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తారు. అందుకు అనుగుణంగా యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తారు.

కృష్ణా జిల్లలో కలెక్టర్ బాబు అధ్యక్షతన సక్సెస్ ఫుల్ గా జరిగిన కొన్ని ముఖ్యమైనవి

  • కృష్ణా పుష్కరాలు
  • పట్టిసీమ భూసమీకరణ
  • నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్
  • పవిత్ర సంగమం దగ్గర నిత్య కృష్ణా హారతి
  • ఎయిర్ షో
  • నేవీ షో
  • ప్రజా సాధికారత సర్వే
  • అమరావతి షాపింగ్ ఫెస్టివల్
  • గ్లోబల్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఫెస్టివల్
Link to comment
Share on other sites

  On 3/1/2017 at 5:14 PM, DiscoKing said:

kukka bathukutundhi.. Jagan gadu kooda bathukutunadu @3$% 

Expand  

Kukkalu chala better.. Viswasam untundhi vaatiki..

eedu dunnapothu meeda varsham padinattu ga undhi eedi brathuku..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...