Jump to content

‘హీరోయిన్’తో కోట్ల స్కామ్ బయటకు! భారతీయ అమెరికన్కు 9 ఏళ్ల జైలుశిక్ష


JANASENA

Recommended Posts

3brk-65-american-pasport1.jpg

అలెగ్జాండ్రియా: నకిలీ పాస్‌పోర్టులు, క్రెడిట్‌ కార్డులు, నగదు అక్రమ బదిలీ కుంభకోణంలో లక్షల డాలర్లు సంపాదించిన ఓ భారతీయ అమెరికన్‌కు అమెరికా కోర్టు జైలుశిక్ష విధించింది. 1992లో అమెరికాకు వెళ్లిన అమిత్‌ చౌదరి అనే వ్యక్తికి అలెగ్జాండ్రియా ఫెడరల్‌ కోర్టు తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించింది. తానెప్పుడూ జైలుకు వెళతానని అనుకోలేదని, కుటుంబం కోసమే ఈ నేరాలకు పాల్పడ్డానని అమిత్‌ చెప్పాడు. ఎఫ్‌బీఐ ఏజెంట్‌ ఒకరు అమెరికాలోని బుల్లితెర నటి లారా వండెర్‌వూట్‌ చిత్రాన్ని నకిలీ పాస్‌పోర్ట్‌పై చూడడంతో ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి.

క్రెడిట్‌ కార్డులు కొట్టేసి.. 
అమిత్‌చౌదరి ఇతరుల క్రెడిట్‌ కార్డులు చోరీ చేసి ఆ డబ్బును షెల్‌ బ్యాంకు ఖాతాల ద్వారా అక్రమంగా బదిలీ చేసేవాడు. తక్కువ ధరలకే ప్రయాణ ప్యాకేజీలు అందిస్తామంటూ ప్రకటనలు ఇచ్చేవాడు. ఆ తర్వాత వినియోగదారుల డబ్బులు కొట్టేసేవాడు. చోరీచేసిన క్రెడిట్‌ కార్డులతో వారి హోటల్‌, ప్రయాణ, భోజన బిల్లులు చెల్లించేవాడు. భారత్‌లోని అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌లో పనిచేసే ఓ వ్యక్తి సాయంతో నకిలీ క్రెడిట్‌ కార్డులు సృష్టించి 25 మిలియన్‌ డాలర్లు కొల్లగొట్టాడు. చివరికి టీవీ నటి లారా చిత్రం నకిలీ పాస్‌పోర్ట్‌పై గమనించిన ఎఫ్‌బీఐ అమిత్‌ చౌదరి బృందంపై కన్నేసి వారిని పట్టుకొంది. తనతో పాటు మరికొందరికి ఈ కుంభకోణంతో సంబంధమున్నట్లు అమిత్‌ తెలిపాడు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...