Jump to content

ఏపీ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం


JANASENA

Recommended Posts

15brk143a.jpg

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్ట బద్ధత కల్పిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఇవాళ సాయంత్రం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మూడో టేబుల్‌ అంశంగా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అంశం చర్చకు రాగా.. మంత్రి వర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు వందశాతం నిధులు ఇవ్వడంతో పాటు, పర్యావరణ అనుమతుల విషయంలో కూడా కేంద్రమే చొరవ తీసుకుంటుంది. ప్రత్యేక హోదా వల్ల లభించే నిధులను ఈఏపీ ప్రాజెక్టుల ద్వారా సమకూర్చాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులుగా గతేడాది సెప్టెంబర్‌ 8న కేంద్ర ఆర్థికమంత్రి ఆరుణ్‌జైట్లీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో మాదిరిగా కాకుండా ప్రత్యేక ప్యాకేజీకి చట్ట బద్ధత కల్పించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పలుమార్లు ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీని కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎట్టకేలకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం చట్ట బద్ధత కల్పించింది. ఏపీ ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వానికి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం కోసం చంద్రబాబు చేసిన కృషి ఫలించిందని వ్యాఖ్యానించారు.

ఐఐఐటీ బిల్లుకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదనంగా 2శాతం డీఏ చెల్లింపునకు కేంద్రమంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. జనవరి 2017 నుంచి అదనపు డీఏ వర్తించనుంది.

 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...