Jump to content

TANA Patriots - Episode 2 - పదవికోసం గడ్డికరచిన లావు అంజయ్య ... ఓటు కోసం చనిపోయిన మామను బ్రతికించిన వైనం


Hitman

Recommended Posts

ప్రియమైన తానా సభ్యులారా!


ప్రార్ధించే పెదవులకన్నా …. సహాయం చేసే చేతులు మిన్న అని సూక్తులు వల్లించే మన తానా అంజయ్య అడ్డదారులు తొక్కి పదవికోసం గడ్డికరుస్తున్నాడు. పెద్దమనిషి 2012 లో ఇతని అత్త మామలను తానా లో సభ్యులుగా చేర్చటం జరిగింది. ఇది చాలా అభినందించవలసిన విషయం కానీ ఇక్కడే అసలు తంతు జరిగింది. అతని మామగారు శ్రీ రామకృష్ణ ప్రసాద్ గారు దశాబ్దకాలం క్రితమే మరణించటం జరిగింది. కానీ ఓటుకు కక్కుర్తిపడి చనిపోయిన మామగారిని ఓటరుగా చేర్చి రెండు సార్లు (2013 & 2015) ఓటు గుద్దుకోవడం జరిగింది.

 

అల్లుడు గారు చేసిన నిర్వాకం చూసి మామగారి ఆత్మ ఘోషిస్తుంది. మధ్యనే అల్లుడు గారికి మామ గారు కలలోకి వచ్చి "అల్లుడు గారు మీకు ఇది తగునా? కూతురును ఇచ్చిన నేరానికి నన్ను ఇలా బజారులో వేయటం ఎంతవరకు సబబు బాబు?" అని ప్రశ్నిస్తే, ఎన్నికలు కాగానే తొలగిస్తాను మామ గారు అని సెలవిచ్చారట.

 

సహాయ కోశాధికారిగా, కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ గా పదవి వెలగబెట్టిన ఇతను చనిపోయిన మామనే ఓటరుగా చేర్చారంటే ఇంకా తన గెలుపుకోసం 5 సంవత్సరాలలో ఎన్ని దొంగ ఓట్లు చేర్పించాడో ఎవరికి అంతుచిక్కని విషయం.

 

అసలు అంజయ్య అనే అతను ఎవరికి అంతు చిక్కని క్యారక్టర్. 2008 లో తానా ను సంక్షోభం నుంచి రక్షించటం కోసం ఆనాటి కార్యకర్తలు ఎంతో శ్రమ పడితే మన అంజయ్య మాత్రం అట్లాంటా లో జరిగిన నాట్స్ సన్నాహక సమావేశానికి హాజరై తానా చీలికలో భాగస్వాముడైనాడు. టిప్ టాప్ గా తయారై ముందు వరసలో కూర్చొని చీలికవాదుల దృష్టిలో పడటానికి నానా ప్రయాస పడినాడు. అక్కడ బెర్త్ ఖాళీలేదని గ్రహించి, తానా లో బెర్త్ కోసం వేట మొదలు పెట్టాడు.

 

ఆనాటి తానా నాయకత్వం చేతి చలువ వలన బెర్త్ దక్కించుకున్న మన అంజయ్య, సారి జరిగే తానా ఎన్నికలలో చేరదీసిన గురువుకే పంగనామం పెట్టేశాడు. గురువు కన్నా బెర్త్ బెస్ట్ అని గ్రహించే సూక్ష్మ సంధాగ్రాహి మన అంజయ్య! రేపు ఎంతమందికి శఠగోపురాలు పెట్టాలో అప్పుడే తన డైరీలో ఎక్కించుకొని తన తెలివిని తానా నాయకత్వానికి చాటిచెప్పినవాడు మన అంజయ్య. అవకాశం ఉంటే సతీష్ వేమనకంటే ముందే ప్రెసిడెంట్ కావాలని వువ్విళ్ళు వురినోడు మన లావు అంజయ్య.  కౌటిల్యుడికే పాటలు నేర్పగల మేధావి ఇతను. సోక్రటీస్, అలెగ్జాండర్ కు యుద్ధ తంత్రం నేర్పగల సైనికుడు ఇతను, కానీ ఖర్మగాలి మన తానాలో వున్నాడు.

 

మన ఖర్మ గాని అంజయ్య లాంటి మేకవన్నె పులులను తప్పు పట్టి ఏమి లాభం? లాంటి ఎన్నో అక్రమాలకూ మరియు అరాచకాలకు నిలయమైన తానా Membership ప్రక్షాళన చేయనందుకు మధు తాతా (తానా సెక్రటరీ), రవి పొట్లూరి (జాయింట్ సెక్రటరీ) ఆపైనా పెద్ద సారూ జంపాల చౌదరి (ప్రెసిడెంట్) గారిని మనం ఘనంగా సన్మానించుకోవాలి. అలాగే కొండను త్రవ్వి ఎలుకను పట్టిన మన పరమానందయ్య శిష్యుల (Membership Verification committee) కఠోర శ్రమకు గుర్తింపుగా తానా Excellency అవార్డు ప్రకటించాలి.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...