Jump to content

Reality of Pattiseema project - CAG report


micxas

Recommended Posts

http://www.eenadu.net/news/news.aspx?item=ap-main-news&no=2

 

పట్టిసీమలో రూ.350 కోట్ల వృథా 
టెండరు ప్రీమియం పెంపు, ఆకృతుల మార్పు వల్లే.. 
నీటి వినియోగదారులను గుర్తించకుండానే రూ.1427 కోట్ల ఖర్చు 
పోలవరాన్ని పరిగణనలోకి తీసుకుంటే పట్టిసీమ జీవనకాలం మూడేళ్లే 
ప్రాజెక్టుకు అనుమతులూ తీసుకోలేదు 
ప్రభుత్వ తీరును తప్పుపట్టిన కాగ్‌ 
31ap-main1c.jpg

బడ్జెట్‌కు విశ్వసనీయత ఉందా..? కేటాయింపులతో సంబంధం లేకుండా నిధులు వ్యయం చేస్తుంటే బడ్జెట్‌కి రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన విలువ ఏమిటి? అంటూ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ప్రశ్నలు లేవనెత్తింది. 2015-16కి సంబంధించి కేటాయింపులు లేకుండా రూ.36వేల కోట్లు వ్యయం చేయడాన్ని తప్పుబట్టింది. సర్కార్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో దుబారా వ్యయాల్నీ... గుత్తేదారులకు రూ.వందల కోట్ల మేర కల్పించిన అనుచిత లబ్ధిని ఎత్తి చూపింది. గోదావరి-కృష్ణాలను అనుసంధానించిన పట్టిసీమ ప్రాజెక్టులో రూ.350 కోట్లు వృథా అయినట్లు తన నివేదికలో కుండబద్ధలు కొట్టింది. జలవనరుల ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియలోని లోపాల్నీ, డీపీఆర్‌లు లేకుండా, నిర్దుష్ట లక్ష్యం లేకుండా చేస్తున్న పనుల్నీ ఎండగట్టింది. రహదారుల పనుల్లో ఇదే తరహాలో గుత్తేదారులకు నష్టంవాటిల్లకుండా ఖజానా ఖర్చయిపోయేలా చేస్తున్న వైఖరిపై కాగ్‌ అక్షింతలు వేసింది. మరో వైపు నిధులు వ్యయం చేస్తున్నా విద్య, వైద్య రంగాల్లో వాటి ఫలితాలు అందని తీరుని కాగ్‌ నివేదిక తేటతెల్లం చేసింది. వైద్యం కోసం సర్కారీ ఆసుపత్రికి వెళ్లే రోగులకు పరీక్షలు చేసే యంత్రాలకు రూ.కోట్లు ఖర్చు చేసినా అవి మూలనపడ్డ దుస్థితినీ.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉత్తీర్ణత పెరిగినా ప్రతిభావంతులు మాత్రం రాని వైనాన్నీ, భూములకి సంబంధించిన రికార్డుల్ని కూడా పట్టించుకోని రెవెన్యూ నిర్లక్ష్యాన్నీ తాజా నివేదిక వెల్లడించింది.

ఈనాడు - అమరావతి

31ap-main1d.jpgఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం లోపాల పుట్టగా కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ నివేదిక కుండబద్దలు కొట్టింది. ఈ పథకంలో రూ.350 కోట్లకు పైగా వృథా వ్యయమైనట్లు తేల్చింది. అధిక టెండరు ప్రీమియంతో పనులు అప్పగించడం వల్ల రూ.199 కోట్లు, అవసరం లేకున్నా నిర్మాణ పద్ధతి మార్చడం వల్ల రూ.106.17 కోట్లు వృథాగా ఖర్చు చేసినట్లు ఎండగట్టింది. ఎక్సయిజ్‌ సుంకం, కార్మిక సంక్షేమ శిస్తుల తిరిగి చెల్లింపు తదితర కారణాల వల్ల మరో రూ.50 కోట్లు దుర్వినియోగమయినట్లు నిందించింది. రూ.1427.50 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టినా ఇందులో సాగునీటి వసతులపై ఎలాంటి ప్రస్తావన లేదని పేర్కొంది.

వినియోగదారులను గుర్తించకుండానే ప్రాజెక్టు నిర్మాణమా?: గోదావరి నుంచి 80 టీఎంసీల నీటిని గృహ పారిశ్రామిక వినియోగం కోసం మళ్లించే లక్ష్యంతో పట్టిసీమ నిర్మాణానికి 2015 జనవరిలో ప్రభుత్వం పాలనామోదం ఇచ్చింది. ఇందులో సాగునీటి వసతుల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. ప్రాజెక్టు కిందవినియోగదారులు ఎవరో కూడా సరిగా గుర్తించలేదని స్పష్టమవుతోందని కాగ్‌ పేర్కొంది.

* ఈ పథకం వల్ల నీటిని పొందే పరిశ్రమల వినియోగదారులను గుర్తించలేదని, పోలవరం కుడి కాలువ కింద డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఇంకా ఖరారు కానందున గృహావసరాల కోసం గ్రామాలను ఇంకా గుర్తించలేదని వివరించింది. 
* పట్టిసీమ సకాలంలోనే పూర్తయినా పోలవరం కుడి కాలువ పనులు పూర్తి కాకపోవడంతో జలవనరుల శాఖ కేవలం 11 పంపులతోనే నీటిని ఎత్తిపోయగలిగింది. అధిక టెండరు ప్రీమియానికి పనులు అప్పగించడం వల్ల ఆశించిన ప్రయోజనం దక్కలేదని, రూ.199 కోట్లు అదనంగా ఖర్చు చేసినట్లయిందని కాగ్‌ తప్పుపట్టింది. 
* సెంట్రల్‌ ఎక్సయిజ్‌ సుంకం, కార్మిక సంక్షేమ శిస్తును తప్పుగా తిరిగి చెల్లించడం వల్ల గుత్తేదారుకు అనుచిత లబ్ధి చేకూర్చినట్లు వివరించింది. 
* పారిశ్రామిక నీటి సరఫరా ద్వారా వచ్చే ఆదాయాన్ని రూ.41.51 కోట్లుగా పరిగణించారని, ఇంతవరకు పారిశ్రామిక యూనిట్లను గుర్తించనేలేదని నిందించింది. 
* పట్టిసీమ జీవనకాలం 20 ఏళ్లుగా గుర్తించి.. తరుగుదలను లెక్కించారని, పోలవరం పూర్తయ్యేవరకే ఈ పథకాన్ని వినియోగించుకోవాలని ప్రతిపాదించారని, ఆ రకంగా పట్టిసీమ జీవనకాలం మూడేళ్లే అవుతుందని కూడా ప్రస్తావించింది. 


ఎత్తిపోతల్లో ఎన్ని తప్పులో!

లాంటి లక్ష్యం లేకుండా ఏపీ జలవనరులశాఖ ఎత్తిపోతల పథకాలు చేపడుతోందని కాగ్‌ మొట్టికాయలు వేసింది. సమగ్ర ప్రాజెక్టు నివేదికల తయారీ అసమగ్రంగా ఉందని, భూసేకరణలో ఆలస్యం వల్ల ప్రాజెక్టుల నిర్మాణమూ ఆలస్యమవుతోందని పేర్కొంది. లబ్ధి, వ్యయ నిష్పత్తిని సరిగా లెక్కించడం లేదని తప్పుపట్టింది. అవసరమైన అనుమతులూ లేకుండానే నిర్మిస్తున్నారని పేర్కొంది. రాష్ట్రంలోని పులికనుమ, గురురాఘవేంద్ర, పట్టిసీమ, పుష్కర ఎత్తిపోతల పథకాలపై అధ్యయనం చేసి లోపాలను ఎత్తిచూపింది. గురురాఘవేంద్ర, పులికనుమ పథకాలు రూ.584.97 కోట్ల సవరించిన అంచనాలతోను, పట్టిసీమ రూ.1667.15 కోట్ల సవరించిన అంచనాలతోను, పుష్కర రూ.674.50 కోట్ల సవరించిన అంచనాలతోను పనులు చేపట్టారు. ఇందులో పట్టిసీమ తప్ప మిగిలిన మూడు ఎత్తిపోతల నిర్మాణాలూ కొనసాగుతున్నాయి.

* ఈ ప్రాజెక్టుల కింద ఉన్న డిస్ట్రిబ్యూటరీల ప్రవాహ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎత్తిపోతలు చేపట్టడం, పంపింగ్‌ సామర్థ్యానికి తగ్గట్టు డిస్ట్రిబ్యూటర్లను ఆధునీకరించకపోవడం వల్ల లక్షిత ఆయకట్టుకు పూర్తి స్థాయిలో ప్రయోజనాలు అందలేదు. 
* పులికనుమ ఎత్తిపోతలను రూ.263.10 కోట్లతో చేపట్టి ఎనిమిదేళ్లు అయినప్పటికీ ఆయకట్టును నిర్ధారించలేదు. 
* పుష్కర ఎత్తిపోతలలోను ప్రాజెక్టు నివేదిక సవ్యంగా లేదు. తొలుత కోటనందూరు మండలంలో 1,223 ఎకరాలకు నీరివ్వాలని ఉంది. తర్వాత ప్రణాళిక మారడంతో తొలుత ప్రతిపాదించిన ఆయకట్టుకు నీరిచ్చే చర్యలే చేపట్టలేదు. 
* పుష్కర అంచనా వ్యయం రూ.674.52 కోట్లకు పెరిగింది. పైగా పోలవరం నిర్మాణం వల్ల దీని జీవనకాలం తగ్గిపోతోంది. 


ఖర్చుకు నోచని కేంద్రం సొమ్ము

రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను ఖర్చు చేయని విషయాన్ని కాగ్‌ నివేదిక ఎత్తిచూపింది. కొత్త రాజధానిలో రాజ్‌భవన్‌, శాసనసభ భవనాల నిర్మాణాలకు 2015 మార్చిలో కేంద్రం రూ.500కోట్లు ఇచ్చినా 2016 సెప్టెంబరు దాకా సీఆర్‌డీఏ వినియోగించలేదని వెల్లడించింది. ఆకృతులు, బృహత్‌ప్రణాళికలు ఖరారు కాలేదని, టెండర్ల ఖరారు, బిడ్డింగ్‌ ప్రక్రియ పురోగతిలో ఉన్నాయని సంస్థ తెలియజేసినట్లు పేర్కొంది.

* ఖజానాశాఖ బిల్లులను తిరస్కరించినందున గుంటూరు, విజయవాడల్లో భూగర్భ మురుగుకాలువల నిర్మాణానికి కేంద్రమిచ్చిన వెయ్యికోట్లను వినియోగించలేదని పేర్కొంది.

* వివిధ పథకాల కోసం రూ.345 కోట్లను పీడీ ఖాతా నుంచి డ్రా చేసి వివిధ బ్యాంకు ఖాతాల్లో జమ చేయడాన్ని తప్పుపట్టింది.మరికొన్ని పథకాలకు వినియోగపత్రాలు సమర్పించలేదని గుర్తు చేసింది. రాజధాని నిర్మాణంలో భూమిని కోల్పోయిన వారికి పింఛను పథకం కింద 23,500 కుటుంబాలను గుర్తించినా 19,075 కుటుంబాలకు మాత్రమే సాయం అందించడంపై అభ్యంతరం తెలిపింది. 


నిర్లక్ష్యం నీళ్ల పాలు! 
సాగునీటి ప్రాజెక్టుల్లో దశాబ్దాల ఆలస్యం 
రూ.24,182.44 కోట్ల అదనపు వ్యయం

ల వనరుల శాఖలో సాగునీటి ప్రాజెక్టులు దశాబ్దాల పాటు నత్తనడకన సాగుతున్న తీరుపట్ల కాగ్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ భారీ సాగునీటి ప్రాజెక్టులను కలిగి ఉందని, అయితే పలు ప్రాజెక్టులు ఇప్పటికీ నత్తనడకన సాగుతుండటంపై పెదవి విరిచింది. 2016 మార్చి 31 నాటికి 274 సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావాల్సి ఉన్నా.. అవి పూర్తికాలేదని ఇప్పటికే ఈ ప్రాజెక్టులపై ప్రభుత్వం రూ.71,154 కోట్లు వెచ్చించిందన్నారు. 63 ప్రాజెక్టులు వాస్తవ వ్యయాన్ని మించి సవరించిన అంచనా వ్యయం 45.82 శాతం పెరిగిందని, తద్వారా రూ.24,182.44 కోట్లు అదనంగా వెచ్చించాల్సి వచ్చిందని తెలిపింది. తోటపల్లి బ్యారేజీ, గజపతినగరం బ్రాంచి కెనాల్‌ ప్రాజెక్టులను 2004లో రూ.520.70 కోట్ల వాస్తవ అంచనాతో ప్రారంభిస్తే ఇప్పటికీ పూర్తి కాలేదని, దానివల్ల ఈ పనుల సవరించిన వ్యయం రూ.851.90 కోట్లకు చేరుకుందని పేర్కొంది. గడికోట రిజర్వాయర్‌ లిఫ్ట్‌ పథకాలు, పులివెందుల బ్రాంచి కెనాల్‌ లాంటి పథకాలు కూడా నత్తనడకన సాగుతున్న తీరుపై కాగ్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది.

హంద్రీనీవాలో గుత్తేదారుకు రూ.5 కోట్ల అధిక చెల్లింపులు: హంద్రీనీవా సుజల స్రవంతి పథకం రెండో దశలో 6వ ప్యాకేజీ, 10వ ప్యాకేజీలకు సంబంధించి గుత్తేదారుకు రూ.4.97 కోట్లు అదనంగా చెల్లించినట్లు కాగ్‌ నివేదిక తప్పు పట్టింది. ఈ రెండు ప్యాకేజీల్లో పనులు ఆలస్యం కావడం వల్ల మళ్లీ గడువు పొడిగించారు. ఆ తర్వాత గుత్తేదారు పనుల్లో సరైన ప్రగతి చూపకపోవడంతో వారి నుంచి కొంత తొలగించి వేరే వారికి అప్పగించారు. చెల్లింపు షెడ్యూళ్లను తప్పుగా ఆమోదించడం వల్ల సొరంగం, అప్రోచ్‌ ఛానల్‌ పనులకు అధిక చెల్లింపులు చేశారని కాగ్‌ గుర్తించింది.

Link to comment
Share on other sites

  • Replies 164
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • micxas

    29

  • TOM_BHAYYA

    13

  • puthareku

    11

  • bhaigan

    11

Top Posters In This Topic

10 minutes ago, perugu_vada said:

Misuse of money epudu undedhe ga ye govt ochina ;) adhe dhourbhaagyam ;) cant help

Not just corruption vuncle.. primary objective of the project ento choodu paina news report lo....and jananiki emani chepparo choodu..

 life span of the project 3 years ata... and more over Vundavalli has given clear explanation of how little the the project uses really are..

Media ni addupettukoni money wastage cheyadame kadu dhanni maLLi edho goppa Ghanathaga cheppukovadam...  

Trying to find the old link 

 

Link to comment
Share on other sites

Just now, micxas said:

Not just corruption vuncle.. primary objective of the project ento choodu paina news report lo....and jananiki emani chepparo choodu..

 life span of the project 3 years ata... and more over Vundavalli has given clear explanation of how little the the project uses really are..

Media ni addupettukoni money wastage cheyadame kadu dhanni maLLi edho goppa Ghanathaga cheppukovadam...  

Trying to find the old link 

 

I dont know in n out of this uncle ;) kani db lo tdp supporters full josh lo unnaru ga mari pattiseema super hit, #thankucbn antuu :o

Link to comment
Share on other sites

1 minute ago, perugu_vada said:

I dont know in n out of this uncle ;) kani db lo tdp supporters full josh lo unnaru ga mari pattiseema super hit, #thankucbn antuu :o

padi sarlu abaddam chepte nijam aipothundi ane nammakam%$#$

Link to comment
Share on other sites

Just now, micxas said:

padi sarlu abaddam chepte nijam aipothundi ane nammakam%$#$

Gorrelu lanti supporters unnantha kaalam political leaders ki no worries :) 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...