Jump to content

A shocking 100% rejections of RTI applications in Telangana


DiscoKing

Recommended Posts

  • Replies 413
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Annayya_fan

    287

  • DiscoKing

    31

  • Android_Halwa

    29

  • khamosh1

    13

2 minutes ago, Android_Halwa said:

bhajana bhajana kalisthe emaitadi...sappuda ekkuvaitadi...chevulu pelttayi

సుప్రీమ్ కోర్ట్ సారు మీద పగ పట్టినట్టుంది... సారు ఎం చేసిన తప్పంటుంది.
సారు........మనం సపరేట్ సుప్రీం కోర్ట్ తెచ్చుకుందాం....

Link to comment
Share on other sites

మహోన్నత త్యాగాల పునాదుల మీద సుదీర్ఘ కాలం కొనసాగిన ప్రజాస్వామిక ఉద్యమం -తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం..
నాన్ ముల్కీ గో బ్యాక్ నుండి 1969 ఆంధ్రా సర్కార్ కాల్పుల నుండి తెలంగాణ ప్రజాసమితి విజయ దుందుబి , 1995 మలిదశ ఉద్యమం నుండి ,తెలంగాణ మహాసభ ,జనసభ ,ఐక్యవేదిక ,తెలంగాణ రాష్ట్ర సమితి ,సకల జనుల సమ్మె ,మిలియన్ మార్చ్ ,సాగర హారం ----2014,జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావం వరకు ---
అణువణువునా ఉద్వేగం ,త్యాగం ,ఉక్కిరిబిక్కిరవుతున్న రాష్ట్ర సాధన ఆకాంక్షల వ్యక్తీకరణ ---
స్వతంత్ర భారతంలో తెలంగాణకే స్వంతం....
అనేక ఆటుపోట్ల మద్య వచ్చిన తెలంగాణలో సార్వత్రిక ఏన్నికలోచ్చినాయ్..
14ఏండ్ల ఉద్యమ పార్టీ అని TRS ను గెలిపిస్తే , నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలయినట్లుంది ప్రస్తుత పరిస్థితి...
పాలాభిషేకాలతో పాలకులు ఊరేగుతుంటే, పోరాడి తెలంగాణ సాధించినవాడు అనేక కష్టాలతో మునిగి తేలుతున్నాడు...
తెలంగాణ ద్రోహులు రేపు TRS పార్టీ ఆవిర్భావ దినోత్సవాల్లో ఊరేగుతుంటే మొదట ఉద్యమ జెండా పట్టినవాడు మట్టికొట్టుకొని పోతున్నాడు....
ఇప్పుడు నడుస్తున్న చరిత్ర ఇదే కదా..!
తెలంగాణ ఉద్యమ సమయంలో దళితుడు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి అని ,దళితులకు మూడెకరాల భూమి అని ,నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలని ,ధర్నా చౌక్ లు లేని ప్రజల ప్రభుత్వమని ,పాలన పారదర్శకతని ,ప్రజల నోట్లో పంచెదారని నమ్మబలికి "వెయ్యి అబద్ధాల వొయ్యి " 
KCR -TRS మ్యానిఫేస్టో ఒక ఇంట్లో నాలుగు ఉద్యోగాలుగా ,కెసిఆర్ కనిపిస్తున్న దేవుడిగా ,ఆ నలుగురు తెలంగాణ నాలుగు దిక్కులుగా ,రాష్ట్రమే ఒక రియల్ ఎస్టేట్ పంచాయతీగా ,బతుకు కోసం భూమిని నిలబెట్టుకునే మల్లన్న సాగర్ గా, సీమాంధ్ర ఆకు-పోకగా ,పాలనలో పాగల్ ఖానా పనులుగా ,కుట్రలో పగబట్టి పోగ బెట్టి ఏ రాజకీయ ప్రజాశిబిరం లేకుండా చేయడంలో ఒక నియంత ఆనవాలుగా తెలంగాణ మిగిలింది..
తెలంగాణ ప్రజా క్షేత్రంలో నడయాడిన వందల యోధులు ,త్యాగదనులకు ఇప్పటికి ఈ వచ్చిన తెలంగాణ ముఖచిత్రం మార్చి, బతుకుకు భరోసా ఇచ్చే ప్రత్యామ్నాయం రాగుాడదా.?
డబ్బు సంచులు వెనుక లేనిదే రాజకీయాలు చేయడం అసాద్యమని మనమూ చేతులెత్తేస్తే తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని ఉపఎన్నికల్లో కోట్ల రూపాయల సీమాంధ్ర వరదను ఎదురీది కదా మనవాళ్ళని గెలిపించింది.
అట్లా గెలిచిన పార్టీ ,కోట్ల రూపాయలతో నారయణఖేడ్ ,పాలేరులో కోట్లు వెదజల్లి రాజకీయాలను మరింత భ్రష్టు పట్టించి "కూలి పనుల " నాటకాలేసి అన్ని అడ్డదారుల్లో ఆవిర్భావ సభలకు సిద్దమవుతున్నది..?
అధికారంలో ఉన్నందుకు ఏ పర్మిషన్ లేకుండా అడ్డదారిలో వాహనాలు , వందలాది ఎకరాల్లో సభలు -- 
ఇతరులకు ఏవీ ఉండొద్దు--
ప్రజల దగ్గరకు పోయి సహకారం ఆశించవద్దు....
సభలకు అనుమతి ఇవ్వొద్దు....
ఇప్పుడు....వరంగల్ ,హన్మకొండ ప్రజలకు ఇబ్బంది కలుగదా...?
సకల ఉద్యమ సామాజిక శక్తులారా..!
మన కండ్ల ముందే బరి తెగించిన దొర గడీ పాలనకు ప్రత్యామ్నాయం వద్దా....?
నిన్న తెలంగాణకై నెత్తురోడిన గాయమే ఇప్పుడు ఈ వికృత రాచపుండుకు చికిత్స చేయాలనుకుంటున్నది....మీరు సిద్దమేనా...?
లక్షలాదిమంది తెలంగాణ బిడ్డల త్యాగాలతో సరిపోల్చలేని కుటుంబం....కుటుంబమే తెలంగాణ రాజకీయాల్ని శాసిస్తామంటే , శిరసావహించడానికి తెలంగాణ సిద్ధమేనా.....???
వొద్దా...తెలంగాణలో ఉద్యమ ,సామాజిక శక్తుల ప్రత్యామ్నాయం..??
వొద్దా...సబ్బండ వర్ణాల ప్రజాస్వామిక పని విధానాల తెలంగాణ ఇంటి పార్టీ....???
వొద్దా...ప్రజల మనుషుల ప్రజా ప్రతినిధుల వారసత్వం చట్ట సభలకు...???
కొనసాగించాల్సిందేనా సకల మాఫియా ,అక్రమార్కుల తెలంగాణ ముసుగు పిరాయింపు వీరవిహారం....??
చేయి చేయి కలిపి ఇంటికి పిడికెడు బియ్యం తీరు..తలా చేయి వేసి చేదోడై తోడై ఉంటే పరిపుష్టం కాదా తెలంగాణ ఇంటి పార్టీ...!!
సమయం వచ్చింది....తెలంగాణ ప్రజాక్షేత్రంలో కొత్త పుంతలు తోక్కాల్సిన రాజకీయ పరిణామాల కోసం కొత్త రక్తంతో ఉరకలేయ్యడానికి..!
వందల తెలంగాణ ఉద్యమాలు నిర్మించిన ఉద్యమ నాయకత్వానికి ,తెలంగాణ యుద్ధగితిక వినిపించడానికి మన "గద్దరన్న" వస్తున్నాడు...
సుర్వి శ్రీనివాస్ గౌడ్ -తెలంగాణ వర్తమానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు....
డా.చెరుకు సుధాకర్ ,యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణలో పరిస్థితులు ,తెలంగాణ ఇంటి పార్టీ గురించి వివరిస్తారు.
జూన్ 2, పార్టీ గురించి మనవాళ్ళే నిర్మించిన దృశ్య గీతం ఆవిష్కరణ ఉంటుంది.
తెలంగాణ ఉద్యమాభిమానుల మాటలు -- సంఘీభావం ఆర్ధికంగా , హార్ధికంగా వుంటుంది...
రండి.! ఇదే మా ఆహ్వానం....
Telangana Udyama Vedika -TUV 
9000600744

Image may contain: text

Link to comment
Share on other sites

మరోసారి తెలంగాణను చెప్పుతో కొట్టిన సుప్రీమ్ కోర్ట్ !!
చిత్తశుద్ధి లేకుండా .. రాజ్యాంగం మీద అవగాహన లేకుండా గుడ్డిగా ముందుకు పోయిన తెలంగాణ సర్కార్ కు ఇలాంటి పరాభవాలు కొత్త ఏమీ కాదు.. . 
పాపం సింగరేణి కార్మికులు .. కెసిఆర్ దొంగ మాటలు నమ్మి పాలాభిషేకాలు చేశారు .. 
ఇప్పుడు మునిగిపోయారు ...
రేపు ఒక పద్ధతి లేకుండా పెంచే రిజర్వేషన్ ల గతి కూడా ఇంతే .. 
కెసిఆర్ ను నమ్మిన ముస్లిం సోదరులు ...,ఉన్న 4 శాతం రిజర్వేషన్ లు కూడా పోతే ఎం చేస్తారో ?
మనం నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే కాదు .. వాటిని తెలివిగా సాధించుకోవడం కూడా తెలియాలి .. 
చిత్తశుద్ధి అనే మాటకు అర్థం అదే

 

No automatic alt text available.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...