Jump to content

A shocking 100% rejections of RTI applications in Telangana


DiscoKing

Recommended Posts

  • Replies 413
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Annayya_fan

    287

  • DiscoKing

    31

  • Android_Halwa

    29

  • khamosh1

    13

 

TJAC.
"నిరసన గళంపై నిర్బంధ జులుం"
నిర్భందాలను చేదించాలి..... 
ధర్నచౌక్ ను రక్షించుకోవాలి...
1f449.png👉చలో ఇందిరాపార్క్ 15 మే, 2017

No automatic alt text available.

Link to comment
Share on other sites

ఎన్నికల్లో మైనంపల్లి తప్పుడు అఫిడవిట్: 
అల్వాల్ లో భూమి కబ్జా చేసిన ఎం.ల్. సి:
హైకోర్టు లో కేసు..విచారణ కు స్వీకరణ:
సమాచార హక్కు చట్టం కార్యకర్తపై దాడి:
***-----****
- రాజకీయ అవినీతిని నిర్ములిస్తామన్న సీఎం కేసీఆర్ .. అందుకు బిన్నంగా
అవినీతిపరులకు అందలం ఎక్కించి, ఎం.ల్.సి. పదవులు కట్టబెడుతున్నారు.

- ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన మైనంపల్లి హన్మంతరావు గతంలో .. 2009 మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి, 2014 మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి, 2017 ఎమ్మెల్సీగా పోటీ చేసారు. ఈ మూడు సార్లూ తన విద్యా అర్హతలు అఫిడవిట్ లో పరస్పరం విరుద్దంగా ప్రకటించారు.

ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 125A ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో కేసు వేశాము. (W.P. no. 68708 of 2017). కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘ, మైనంపల్లి లను ప్రతివాదులుగా ఈ కేసును కోర్టు విచారణకు స్వీకరించారు.

- ఆధారాలను మీడియాకు చూపించారు.

**
- అల్వాల్ లోని గోల్నాక ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర కాలనీ లోని 450 చ.గ. పార్కు స్థలం కబ్జా చేసి భవనం నిర్మించారు.

- స. హ. చట్టం కింద వివరాలు కోరితే సాయి ప్రసాద్ అనే యువకుడి పై తన అనుచరులతో మైనంపల్లి దాడి చేశారు.

- చివరికి GHMC రికార్డుల్లో తన పేరు తప్పుగా ప్రచురితమైనదని, సవరించాలని కోరుతూ లేఖ రాసి తపాలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ అస్తికి తను పన్నులు చెల్లిస్తున్నారు. 
కానీ ఎన్నికల అఫిడవిట్ లో ఈ ఆస్తిని పేర్కొనలేదు. వివరాలు మీడియాకు చూపించాము.

సాయి ప్రసాద్ కు మైనంపల్లి హన్మంతరావు నుంచి ప్రాణ భయం ఉంది.

కాంగ్రెస్ డిమాండ్:

మైనంపల్లిని పదవి నుంచి వెంటనే తొలగించాలె... చట్టపరమైన చర్యలు తీసుకోవాలే. చర్యలకు వెనుకాడితే ప్రభుత్వ పెద్దల ప్రోతబలంతోనే ఈ తతంగం నడుస్తోందని భావించాల్సి ఉంటుంది.

The Warrior

Link to comment
Share on other sites

ప్రాజెక్టు డిజైన్‌ మార్పుతో ఎన్నో సమస్యలు 
ప్రైవేటు సంస్థలు భూమిని కొనుగోలు చేస్తున్నాయి 
దౌర్జన్యకర పద్ధతిలో భూసేకరణను నిలిపివేయాలి 
మహిళా రైతుల హక్కుల వేదిక సమావేశంలో వక్తలు 
చిక్కడపల్లి/హైదరాబాద్‌: కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు.. డిజైన్‌ మార్చినప్పటి నుంచి అనేక వివాదాలకు కేంద్రంగా మారిందని మహిళా రైతుల హక్కుల వేదిక సభ్యులు ఆరోపించారు. 18.19 లక్షల ఎకరాల సాగునీటిని ఈ ప్రాజెక్ట్‌ అందిస్తుందని ప్రభుత్వం చెబుతోందని, కానీ.. ఈ ప్రాజెక్టుకు అంత సామర్థ్యం ఉందా? అనే ప్రశ్నతోపాటు అనేక సాంకేతిక ఆర్థిక అంశాలను కూడా నిపుణులు, పౌరసమాజ సంఘాలు లేవనెత్తుతున్నాయని అన్నారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరిస్తున్న గ్రామాల్లో తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోందని వారు పేర్కొన్నారు. మహిళా రైతుల హక్కుల వేదిక తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల మొదటివారంలో ప్రతిపాదిత కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతంలో అధ్యయన యాత్ర జరిపింది. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో అధ్యయన బృందం సభ్యులైన మకాం నేషనల్‌ ఫెసిలిటేటర్‌ టీమ్‌ ప్రతినిఽధులు ఉషా సీతాలక్ష్మి, ఎస్‌.ఆశాలత, ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక ప్రతినిధి మీరా సంఘమిత్ర, టీజీఏసీ మకాం సభ్యురాలు ఆర్‌.లక్ష్మి, రైతు స్వరాజ్యవేదిక సభ్యులు బీరం రాములు, ఈ కేసులో వాదించిన హైకోర్టు న్యాయవాదులు రచనారెడ్డి, రవికుమార్‌, ప్రాజెక్ట్‌లో భూములు కోల్పోతున్న భూనిర్వాసితులు పాల్గొని ప్రసంగించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికను ప్రజల ముందు చర్చకు ఉంచకపోవడం వల్ల ప్రాజెక్టు కోసం ఎంత భూమిని సేకరిస్తున్నారనే విషయంలో స్పష్టత లేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు నిర్వహిస్తున్న కంపెనీలు భూమి సొంతదారుల నుంచి నేరుగా ప్రాజెక్టు కోసం కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ప్రజాప్రయోజన ప్రాజెక్ట్టు కోసం ప్రైవేటు సంస్థలు ఏవిధంగా భూమిని కొనుగోలు చేస్తున్నాయని వారు ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మోసం, ద్రోహం, తప్పుడు మార్గాలు, నకిలీ గ్రామసభ తీర్మానాలు వంటి దౌర్జన్యకర పద్ధతుల ద్వారా భూసేకరణ ఆపివేయాలని, ప్రజల్లో భయాలు, అనుమానాలు సృష్టించడం మానుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టుల రూపు మార్చేటప్పుడు ప్రజల్లో విస్తృతంగా చర్చలు జరపాలని అన్నారు.

రైతులను భూముల్లోకి రానివ్వడంలేదు
మా భూముల్లో పెద్దసంఖ్యలో పోలీసులు మోహరించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా వ్యవసాయం చేసుకోవచ్చని కోర్టు పేర్కొన్నా.. మమ్మల్ని భూముల్లోకి రానివ్వడంలేదు. 
కటుకూరి రాజగోపాల్‌రెడ్డి

18 ఎకరాలు పోతోంది
మా 18 ఎకరాలు తీసేసుకుంటున్నారు. ఇల్లు మాత్రమే మిగిలింది. పొలం మొత్తం తీసుకుంటున్నామని చెబితే నోటీసులు తీసుకోలేదు. పనులు మొదలుపెట్టాక ఇంటికి నోటీసులు అంటించారు. 
కొలిపాక సరిత

బలవంతంగా గుంజుకున్నారు
నా నాలుగెకరాల భూమిని బలవంతంగా గుంజుకున్నారు. భూమిలోకి రావొద్దని పోలీసులతో చెప్పిస్తున్నారు. బలవంతంగా భూమిని లాగేసుకోవడం ఎంతవరకు సబబో పాలకులే చెప్పాలి. 
గుడి వెంకట్‌రెడ్డి

Image may contain: 1 person, sitting

Link to comment
Share on other sites

పేరు పిట్టల రవీందర్...
మొన్నటి దాకా జేఏసీ లో లీడర్...
కోదండరాం గారిపై అబాండాలు వేస్తూ జేఏసీని విడిచిపెట్టి, జేఏసీని చీల్చడానికి ఇతర సభ్యులను ఎలా ప్రలోభపెడుతున్నాడో జర చూడండి..."ఇప్పటిదాకా ఉద్యమించాం...ఇప్పుడైనా అనుభవిద్దాం"...అంటూ పిట్టల రవిందర్ మాట్లాడిన మాటలు వినండి..

 

Link to comment
Share on other sites

No automatic alt text available.

 

ఇదయ్యా " ప్రభుత్వ " ద్వంధ నీతి ! 
* 
సోమారం గ్రామం , తొర్రూర్ మండలం. మహబూబాద్ జిల్లా అధికార పార్టీకి చెందిన సర్పంచ్ !

గ్రామ పంచాయతి నిధులను అక్రమంగా - ఎలాంటి తిర్మాణాలు లేకుండా స్వంతానికి వాడుకుంటే !

ఈ విషయంపై జిల్లా అధికారులకు ఎన్ని విన్నపాలు చేసినా ' 

ప్రభుత్వం ' విచారణ చేపట్టలేదు - ఆ గ్రామస్తులు విసుగు చెంది !

డబ్బులు ఖర్చుపెట్టుకోని హైకోర్టుకు వచ్చి!

' అవనీతిపై విచారించండి ' అని డైరక్షన్ తీసుకున్నా ! 

ఇప్పటికి కూడా విచారించకుండా పట్టిచ్చుకోవడం లేదు ! 

ఈ 20 తారీకునాదు దానికి సంభందించిన కేసు హైకోర్టులో ఉంది ! 

' ఆ లేదు - ఊ లేదు ' కానీ అగమేఘాల మీద ! 

కాంగ్రేస్ పార్టీకి చెందిన " జిల్లా సహకార బ్యాంక్ అధ్యకున్ని & బాడీని " మాత్రం ! 

తెలంగాణ ద్రోహుల పార్టీ నుండి వలస వచ్చిన ఎర్రబెల్లి వత్తిడీతో రద్దు చేసారు ! 

* 

ప్రతికార ప్రభుత్వ చేష్టలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ! 

వచ్చే ఎన్నికలలో " పాలకుర్తి నియోజక వర్గంప్రజలు " 

ఎర్రబెల్లిని శంకరగిరి మాన్యాలు పట్టీయడం ఖాయం !

Link to comment
Share on other sites

రోజులో సూర్య చంద్రులు ఉండడము యెంత నిజమో అలాగే ......

తెలంగాణ లో కెసిఆర్ చట్టము చేసిండు అంటే కోర్ట్ కోటివేస్తది అనే మాట కూడా అంతే నిజము Brahmi-4.gif.a28ea167ff30f24bcb05c1ec5ad

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...