Jump to content
People were interested in these podcasts

A shocking 100% rejections of RTI applications in Telangana


DiscoKing

Recommended Posts

  • Replies 413
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Annayya_fan

    287

  • DiscoKing

    31

  • Android_Halwa

    29

  • khamosh1

    13

సమస్త తెరాస అభిమానులకు, నికార్సైన తెలంగాణ బిడ్డలకు తెరాస ఆవిర్భావ శుభాకాంక్షలు. ఒక అప్పీల్. ఒక పిలుపు. ఒక చర్చ...!

--------------------------------------------------------------------------------------------

ఇది చదవండి. మనసుతో వినండి. ఎందరో నికార్సైన తెలంగాణ బిడ్డలు, తెరాస అభిమానుల హృదయ వేదనకు ప్రతిరూపం TRTU వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ S N Reddy Katanguru గారి ఆవేదన.

ఎస్.యెన్ సర్, ఇంకా అనేకమంది తెరాస మితృలారా. ఒక్క విషయం. మేము మిగిలిన రాజకీయ పార్టీలలాగా స్వార్థపర చింతనతో మాట్లాడేవాళ్ళం కాదు. మా Gade Innareddy గారు తెరాస వ్యవస్థాపకుల్లో అతి ముఖ్యులు. పార్టీ తొలి ప్రధాన కార్యదర్శి. తెరాస పుట్టుకకు దశాబ్దం ముందే తెలంగాణ గోసపై పరిశోధనలు చేసినవారు. 'దగాపడ్డ తెలంగాణ' పత్రిక ద్వారా తెలంగాణకు నీళ్ళు-నిధులు-నియామకాలు-ఆత్మగౌరవం దక్కడం లేదన్న భావజాల వ్యాప్తి గణాంక సహితంగా, ఒక్క ఉద్యమంలా చేసిన వారు. Srisail Reddy Vemulaghat అనే నేను 1990 దశకంలో ఇన్నయ్య గారితో కలిసి పనిచేసాను. దగాపడ్డ తెలంగాణ సంకలన బాధ్యత మొత్తం నాదే. అపుడు నా వయసు 22. నేడు కేసీఆర్ కు కుడి, ఎడమ భుజాలుగా ఉన్నవారు, నేడు ఆయనకు అత్యంత ఆత్మీయులు ఎవరికీ తెలంగాణ సోయి కూడా లేని రోజుల్లో మేము క్షేత్రంలో పనిచేసినం. అమెరికాలో ఉన్న కవిత, కేటీఆర్ వేడుకున్నారు ఇన్నయ్య గారిని... 'అంకుల్ మా నాన్నను ఉద్యమంలో దించి మాకు అన్యాయం చేయకండి. మేమింకా సెటిల్ కాలేదు' అని.

అయినా, ఇన్నయ్యగారు ఒక్క కేసీఆర్ తో మాత్రమే తెలంగాణ సాధ్యం అన్న కృతనిశ్చయంతో ఆయనను లాగారు.

ఏమాటకు ఆ మాటే... కేసీఆర్ కూడా కసితో పనిచేసారు 11 సంవత్సరాలు. రాష్ట్రం వచ్చింది.

అప్పటినుంచి ఆయన పనిచేయడం మానేశారు. అంటే, అందరికీ అని కాదు. కాంట్రాక్టర్లకు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని రాజకీయ నాయకులకు, పార్టీలకు, మీడియాకూ, సన్యాసులకూ మాత్రమే ఆయన దగ్గర ఎంట్రీ ఈరోజు.

ఇవేవీ ఆయన తెలియక చేస్తున్నది కాదు. ఒక పథకం ప్రకారమే, ప్రణాళికతోనే చేస్తున్నరు. ఉద్యమ ఛాయలు ఎక్కడా ఉండొద్దు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను భావితరాలు మరచిపోవాలు. అప్పుడే తన కుటుంబ దోపిడీని ప్రశ్నించకుండా ఉంటారు.

ఇదిగో... సరిగ్గా ఈ స్వార్థమే, ఈ కుటుంబ వ్యవహారమే, ఈ దోపిడీయే, ఈ దుర్మార్గమే ఇన్నయ్య గారితో సహా, నాతొ సహా, తెరాస శ్రేయోభిలాషులు ఎందరినో బాధిస్తున్నది. దీనికి ఉదాహరణే ఎస్.యెన్. సారు పోస్టు.

విజ్ఞులైన తెలంగాణ ప్రజలారా... మేము కేసీఆర్ ను వ్యక్తిగతంగా ద్వేషించడం లేదు. అవమానించడం లేదు. మా లక్ష్యం అసమానతలు లేని తెలంగాణ. మా కార్యాచరణ ప్రజల తెలంగాణ. దీనికి అడ్డు వస్తే, ఎవరినీ లెక్కచేయం. కేసీఆర్ ను అసలు లెక్కచేయం. ఉద్యమకారుడుగా గౌరవిస్తూనే, ఒక ఉద్యమ ఆకాంక్షల ద్రోహిగా చీల్చి చెండాడుతాం. సందేహం వద్దు.

రండి. కలవండి. కదలండి.

#PrajaTelangana

*

S N Reddy Katanguru గారి ఆవేదన ఆయన మాటల్లోనే:

తెరాస అధినేత మరియు తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం కెసిఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన పిమ్మట తనలో వచ్చిన మార్పు, చేస్తున్న పాలన తీరు-తెన్నుల గురించి, జాతీయ-అంతర్జాతీయ స్థాయిల్లో ప్రఖ్యాతిగాంచిన- ఎందరో మేధావులను-శాస్త్రజ్ఞులను అందించిన ఘన చరిత్రకల్గిన ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల తీరు గురించి, ఈ రోజు జరుగనున్న పార్టీ 16వ వార్షికోత్సవం గురించి శ్రీశైల్ రెడ్డి గారు వెలిబుచ్చిన అభిప్రాయాలు విన్నాక, వాటిని కాదనలేక బాధపడాల్సి వస్తోంది.

లోగా ఉధ్యమకాలంలో ఉద్యమ లక్ష్యాన్ని అవహేళన చేసేవారిని, కేసీఆర్ ను విమర్శించినవారిని సరైన పంథాలో జవాబిచ్చి తెలంగాణ వ్యతిరేకుల నోళ్లు మూయించేవాళ్లం,

అయితే ఇప్పుడు పూర్తిగా నాటి శతృవులే నేడు వారికి మితృలయిండ్రు. కేసీఆర్ దర్శనం కావాలంటే నాటి వ్యతిరేకుల హర్డిల్స్ దాటి, వారి సిఫారసులు పొందాల్సిన దుస్థితి మాది.

నాడు తనకు బాసటగా నిలిచిన వాళ్లకు తెలంగాణ ఐనాక కేసీఆర్ అపాయింటుమెంటుకు ప్రయత్నించినా దొరుకడంలేదని చెప్పుకోవడమే తలవంపుగా వుంది.

లోగా రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు లపాలనకు ఎదురొడ్డి ధైర్యంగా, ఆత్మ గౌరవంతో పనిజేసిన ఎందరో మానసికంగా ఇప్పుడు కృంగి పోతున్నారు.

అప్పుడప్పుడు ఈ అవమానాలు భరించడానికే బ్రతికున్నామా అని బాధపడాల్సి వస్తోంది. ఇంతటి బాధ భరించలేకనే ఇటీవల ఓ TRS కార్యకర్త బలవన్మరణానికి బలై వుంటాడు.

తెలంగాణ అయినాక ఉద్యమంలో తనవెంట బాసటగా నున్నవారిని విస్మరించడం, తనను విమర్శించిన వారిని అందల మెక్కించడం, నాటి ఉద్యమ సంస్థలను, సంఘాలను కానకపోవడం, కనీసం దర్శనానికి కూడ నోచుకోక పోవడాన్ని తట్టుకోలేక పోతున్నాం.

ఒక్కొక్కప్పుడు అనిపిస్తది, అమరులైన బియ్యాల జనార్ధన్ రావు, కాళోజీ, జయశంకర్ సార్ లాంటి నేతలే అదృష్టవంతులు, ఇప్పుడు బ్రతికుంటే ఎలా వుండేవారో?

ఇలాంటి అవమానాల్ని ప్రసాదించే తెలంగాణను కళలోకూడా ఊహించుకోలేదు. ఇలాంటి వైఖరియే కొనసాగితే ఈ తెలంగాణను చూడలేని మా శేషజీవితం కూడా అమరుల దరికి చేరుకోవడమే మంచదన్న ఆలోచనకు తావిస్తోంది. మమ్మల్ని ఎలా మరిచారో 
మా కేసీఆర్ గారు! సారీ ....
బాధతో ... 
*ఎస్ ఎన్ రెడ్డి కటంగూరు* 
TRTU వ్యవస్థాపక అధ్యక్షుడు

Link to comment
Share on other sites

Prof. కోదండ రాం Sir అడిగిన గీ 10 ప్రశ్న ల్లో తప్పేముంది? దీనికే అరెస్ట్ చేస్తారా? సార్ ను అరెస్ట్ చేయడమంటే తెలంగాణా గొంతుకను ఆపడానికి చేస్తున్న ప్రయత్నమే... ఇదే మీ గులాబి మాఫియా పతనానికి నాంది.. 
=========================================
1. తెలంగాణా వచ్చిన తర్వాత ఆంధ్ర కంట్రాక్టర్ల కు పనులు ఇవ్వడం ఏమిటి? తెలంగాణా లో లేరా? ఆంధ్రా కాంట్రాక్టర్లు ఇచ్చే ముడుపుల కోసం ఇట్లా చెయ్యడం బాగలేదు. ప్రజలు సహించరు.
2. వేల ఎకరాలు ఉన్న రామోజీ కి "ఓం సిటీ " పేరిట వేల ఎకరాల ప్రభుత్వ భూములని ఇద్దామనే దిశ గా చర్యలు తీసుకోవడం జుగుప్సాకరం గా ఉంది. దానికి బదులు తెలంగాణా ఫిల్మ్ సిటీ ని ఏర్పాటు చేసి తెలంగాణా బిడ్డలకు అవకాశాలు కల్పించండి. 
3. ముఖ్యమంత్రి దంపతులు ఇద్దరు ఉండేందుకు 9 ఎకరాల్లో అనగా వందల కోట్ల విలువైన భవనం అవసరమా? ఆ ప్రజా సంపదని ఇంకా ఎన్నో ముఖ్యమైన పనులకు ఉప్యోగిస్తే ప్రజలకు మేలు జరిగేది కదా?
4. ఆంధ్రా వాల్లు ఖాలి చేసినంక మొత్తం సచివాలయం మనకే ఉన్నా కూడా వందల కోట్ల విలువైన ప్రజా సంపదని కూలగొట్టి, వాస్తు కొరకు కొత్తగా కట్టాల్సిన అవసరం ఉందా? ఎవరికో చూపించడానికి ఇంత అవసరమా? అంత పెద్ద సచివాలయం ఉపయోగించుకుంతే వేల కోట్ల ప్రజా సంపద మిగులుతుంది.. ఎన్నో కార్యక్రమాలకు ఖర్చు చేయవచ్చు. కాని, ఈ ప్రభుత్వానికి కండ్లు నెత్తిమీదికి పోయినయ్. 
5. రాచరికపు నిజాం కూడా పాలెస్ లు కట్టిండు కాని, ఇది నిజాం పాలన కాదు కదా? మీ కుటుంబ అర్భాటం, ఆడంబరం కొరకు నిజాం కంటే పెద్ద భవనాలు కట్టడం, ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డలి పెట్టు.
6. ఊర్ల లో ఇప్పటి వరకు తాగు నీళ్ళే లేవన్నట్లు.... ప్రతీ ఊరికి తాగునీరు అని 40,000 కోట్ల రూపాయల ప్రజా సంపదని వెంటనే మొదలు పెట్టడం లో వేల కోట్ల ముడుపులే అని నన్ని కలిసిన మేధావులు, ఉద్యమకారులు, విద్యావంతులు అడిగారు.. ఇట్లా చెయ్యడం భావ్యమేనా?
7. పేరు కు మంత్రులని పెట్టి, హోం, హైదరాబద్ పాలన, దాదాపు అన్నిట్లో కుటుంబ జోక్యం చేసుకొని, మంత్రులని ఉత్సవ విగ్రహాలు చేయడం మంచిదేనా?
8. ఆంధ్రా లో వర్గ కోటరీ ఉన్నట్లు, ఇక్కడ కూడా అట్లానే ఏర్పాటుచేసుకొని, వెన్నుపోట్లు, అమాయకులని ఉపయోగించుకొని తిట్టించడం... చూస్తుంటే మీ రాజకీయాలు చంద్ర బాబు కంటే మితిమీరినాయనిపిస్తుంది. ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
9. ఈ రెండేండ్ల లో ఎన్నో కంపనీల లో, వివిధ విద్యా సంస్థలు, మెడికల్ కాలేజీల్లో ఇన్ని వందల కోట్ల సంపద ఎట్లా సమకూరిందో? సాధ్యమైందో!! శ్వేత పత్రం విడుదల చేయండి... ఈ వివరాలన్నీ ప్రజల ముందు త్వరలోనే ఉంచుతాం...
10. మీ స్వంత మొక్కుబడి ఉంటే... ఎన్నో కోట్ల ప్రభుత్వ సంపద తో దేవునికి ముడుపులు చెల్లించడం లో మతలబు ఏమిటి? వాస్తు పేరిట ఇన్ని కోట్ల వృధా అవసరమా? ఇవన్నీ ప్రజలకు ఏమాత్రం మేలు చేయవని మేము నమ్ముతున్నాం... వీటన్నింటిని ఆపి, ప్రజా సంపద కాపాడాలని మనవి.

 

Image may contain: 3 people, people smiling

Link to comment
Share on other sites

**** తెలంగాణ ఉద్యమ వేదిక ***
@@ ముఖ్యమంత్రి పై కేసు నమోదు చేయాలి @@
ఓరుగల్లులో నిన్న జరిగిన టి.ఆర్.ఎస్ సభ తారా స్థాయిలో పరనింద అదుపు లేని ఆత్మస్థుతి , అతిశయోక్తులకు పరాకాష్ట...!
ఆర్.టి.ఎ అధికారులను మీడియా ముఖంగా అడుగుతున్న రోడ్డు నియంత్రణ వాహన నిబంధన చట్టాన్ని కాదని ,1000 ట్రాక్టర్లలను తీసుకుని పోవడానికి ఆర్.టి.ఎ అనుమతించిందా...... ???? 
అనుమతించకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి పై కేసు నమోదు చేయాలి...!
స్వయానా ముఖ్యమంత్రియే 1000 ట్రాక్టర్లలను తరలించారు అని చెప్పాడు. 
తెలంగాణ ద్రోహులను అందలమెక్కిచడం తెలంగాణ ఉద్యమ స్పూర్తికి విరుద్ధం కాదా..????
ప్రాజెక్టల రీడిజైన్ పేరుతో వేల ఎకారలను ద్వంసం చేయడం జీవనవిద్వంసం కాదా... ???
ఇటువైపు తెలంగాణ ద్రోహులను.... 
అటువైపు తెలంగాణ ద్రోహులను కూర్చోపెట్టుకొని జయశంకర్ సార్ పేరు ఉచ్చరించడానికి అర్హత ఉందా...కెసిఆర్ గారికి ??
నిన్ను ప్రశ్నింస్తే తెలంగాణ ద్రోహి ? 
నీ సంకలో చేరితే తెలంగాణ పునర్నిర్మాణానికి అంకితమైన బంగారు బాతులు,బంగారు చిలుకలు....!
వంచన శిల్పం పరాకాష్టకు చేరింది, కాబట్టే తెలంగాణ ప్రజలు ఎక్కడికిపోయిన నిరసనలు తెలుపుతున్నారు.
రాజకీయ, ప్రజాస్వామ్య, సంస్కృతి జీవనవిద్వంసం చేసినతరువాత మాట్లాడే అర్హత ఉందా... కెసిఆర్ గారికి ??
కడియం శ్రీహరి అసలు.... ఎస్సీ ఎస్టీ డెవలప్ మెంట్ శాఖకి ఓ రెడ్డి మంత్రిగా ఉన్నాడని చెప్పరేం? ఆ శాఖకి ప్రిన్సిపాల్ సెక్రెటరీ లేరు అని చెప్పరేం? అత్యంత ముఖ్యమైన ఆ పోస్టు ఖాళీగా ఉందనీ, ఎవరినైనా అపాయింట్ చేయమని ఎందుకు చెప్పలేదు కెసిఆర్ కు.!
తెలంగాణ లో ఏకైక బాహుబలి అని చెప్పుకునే కెసిఆర్ ఉస్మానియా యూనివర్సిటీలో బాహుబలి నోరు ఎందుకు విప్పి మాట్లాడలేదు?? 
జై మహిస్మతి అనడానికి దొరల సామ్రాజ్యం కాదు, రాజరికం కాదు తెలంగాణ అంటే. 
ధర్నా చౌక్ పునరుద్ధరించండి, ప్రజలు పెటుకునే సభలకు అనుమతించండి. 
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్, తెలంగాణ ఉద్యమ వేదిక అదికార ప్రతినిది సుర్వి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ ఉద్యమ వేదిక హైదరాబాద్ ఇన్చర్జి దేవేందర్ రెడ్డి, తెలంగాణ ఉద్యమ వేదిక స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు సందీప్ చమర్ పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

2001 లో కె సి అర్ కి చంద్రబాబు మంత్రి పదవి ఇయ్యకుంటనే పార్టీ పెట్టిండు అని అందరికి తెలిసిందే ...

1997 డెసెంబర్లో వరంగల్ డిక్లరేషన్ ... తెలంగాణ ఉద్యమానికి ఒక కీలక మలుపు...

 

No automatic alt text available.

Link to comment
Share on other sites

ఖమ్మం లో ఆగ్రహించిన రైతన్నలు మార్కెట్ యార్డ్ పై దాడులు.....
సభలకు కోట్లు కార్చుపెట్టడం కాదు రైతుల సంక్షేమం పైన దృష్టి పెట్టండంటున్న రైతన్నలు.........
నిన్న సభలో గోప్పలూ చెప్పిన TRS పార్టీ కి తెల్లరె జలక్ ఇచ్చిన రైతులు.

No automatic alt text available.Image may contain: outdoor

Link to comment
Share on other sites

ఓరి సన్నాసి,
తెలంగాణ ఎట్లోచ్చిందో మర్సిపోయినవా,
అరెస్టులు, నిర్బంధాలు చేసుకుంటా అనవసరంగా నీ గొయ్యి నీవే తవ్వుకుంటున్నావ్....
బెదిరిస్తే బెదిరిపోయే రోజులు ఆంధ్రోళ్ల మీద పోరాటం చేసిన రోజునే పోయినయి....

కూట్లే రాయి తీయనోడు ఎట్లే రాయి తీస్తాడ - 
నిన్న పెద్ద పెద్ద గప్పాలు కోడితివి కదా, 
సంఘాలు పెట్టాలి,
మీ ధర మీరే నిర్ణయించుకోవాలి అని..
అప్పటిదాకా నువ్వొచ్చి పో ఒక్కసారి ఏనుమాముల మార్కెట్ కో, ఖమ్మం మార్కెట్ కో...
రేట్ చూసి, రైతుల కష్టం చూసి పో...
నీకు గడీల కెళ్ళి బయటకు రా చేత గాదాయే, జనాల కష్టాలు తెల్సుకుందాం అని పోతున్న కోదండరాం ను అరెస్ట్ జెపిస్తివి....

ఎలక్షన్ ల ముందు నువ్విచ్చే 4000 రూపాయల పెట్టుబడి కోసం ఇయ్యాల మా పంట అంటువెట్టుకోమంట వా ...
15 రోజుల నుండి మార్కెట్ ల పరిస్థితులు ఎట్లున్నయ్యో ఒక పెగ్గ్ వేసి రిపోర్ట్ చూడు తెలుస్తాది..

చిన్నజీయర్ లను, తుమ్మకాయలను నమ్ముకుంటే నిండా ముంచుతారు జాగ్రత్త..
Condemning arrest of Kodandaram..
.....................................
కన్న తల్లికి అన్నం పెట్టనోడు పిన తల్లికి బంగారు గాజులు చెపిస్తా అన్నాడట ఎనకటికి కెసిఆర్ లాంటోడు, ఈ సారి పండిన పంటకు మద్దతు దర కల్పించు రా వారి అంటే మళ్ళొచ్చే యాడాది 4000 ఇస్తాడట....

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...